India, Omicron Cases Tally: దేశంలో 145కు చేరిన ఒమిక్రాన్ కేసులు.. గుజరాత్‌లో మరో రెండు కేసులు
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 145కు పెరిగింది. గుజరాత్‌లో తాజాగా రెండు కేసులు నమోదయ్యాయి.
![India, Omicron Cases Tally: దేశంలో 145కు చేరిన ఒమిక్రాన్ కేసులు.. గుజరాత్‌లో మరో రెండు కేసులు Omicron Corona Cases India 19 December 2021 update Delhi Gujarat Andhra Pradesh Maharashtra Chandigarh reported Omicron cases India tally at 145 India, Omicron Cases Tally: దేశంలో 145కు చేరిన ఒమిక్రాన్ కేసులు.. గుజరాత్‌లో మరో రెండు కేసులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/19/80a69aaf064f9ea4831575e85c246c6c_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గుజరాత్‌లో కొత్తగా మరో 2 కేసులు నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 145కు పెరిగింది. కర్ణాటకలో కొత్తగా 6 కేసులు నమోదుకాగా కేరళలో 4 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. మహారాష్ట్రలో 8 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కొత్తగా 12 కేసులు నమోదుకాగా అక్కడ మొత్తం కేసుల సంఖ్య 20కి చేరింది.
రాష్ట్రాల వారీగా
ఇప్పటివరకు 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు వచ్చాయి.
- మహారాష్ట్ర (48)
- దిల్లీ (22)
- రాజస్థాన్ (17)
- కర్ణాటక (14)
- తెలంగాణ (20)
- గుజరాత్ (9)
- కేరళ (11)
- ఆంధ్రప్రదేశ్ (1)
- చండీగఢ్ (1)
- తమిళనాడు (1)
- బంగాల్ (1)
డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక..
డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మరోసారి గుర్తుచేసింది. అయితే తాజాగా ఒమిక్రాన్‌పై మరో షాకింగ్ విషయం చెప్పింది డబ్ల్యూహెచ్ఓ.
సామూహిక వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు 1.5 నుంచి 3 రోజుల్లో రెట్టింపవుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఒమిక్రాన్ బారిన పడిన 89 దేశాల్లో వైరస్ వ్యాప్తి తీరుకు సంబంధించిన నివేదికల ఆధారంగా ఈ మేరకు వెల్లడించింది. ఈ నేపథ్యంలో డెల్టా కేసులను ఒమిక్రాన్ దాటేసే అవకాశం ఉందని అభిప్రాయపడింది.
ఒమిక్రాన్.. వైరస్ రోగ నిరోధక శక్తిని అధిగమిస్తుండటంతోనే వ్యాప్తి వేగంగా జరుతున్నదా అన్న దానిపై ప్రస్తుతం స్పష్టత లేదని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. అలాగే ఒమిక్రాన్ వేరియంట్ వల్ల కలిగే ముప్పు గురించి ఇప్పటి వరకు తక్కువ సమాచారం మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. మరింత డేటా ఆధారంగానే ఈ వేరియంట్ ముప్పును పూర్తిగా అంచనా వేయగలమని అభిప్రాయపడింది. అయితే ఒమిక్రాన్ కేసుల పెరుగుదల నేపథ్యంలో ఆరోగ్య వ్యవస్థలపై మరోసారి భారం పడవచ్చని హెచ్చరించింది. ప్రస్తుతం బ్రిటన్, దక్షిణాఫ్రికా దేశాల్లో ఒమిక్రాన్ రోగులతో ఆసుపత్రులు నిండుతున్నట్లు పేర్కొంది.
Also Read: New Year 2022: న్యూ ఇయర్ వేడుకలకు ఇండియాలో టాప్ 11 ప్రదేశాలివే...
Also Read: Covid-19 Vaccination: ఆదర్శంగా అండమాన్ నికోబార్ దీవులు.. సవాళ్లను దాటి 100% వ్యాక్సినేషన్
Also Read: 144 in Kerala: కేరళ అలప్పుజలో 144 సెక్షన్.. గంటల వ్యవధిలో ఇద్దరు రాజకీయ నేతల హత్య
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)