అన్వేషించండి

Rapamycin: రపామైసిన్‌ టాబ్లెట్ తీసుకుంటే వయసు తగ్గుతుందా? ఈ ప్రచారంలో నిజమెంతా?

Rapamycin Pill: రపామైసిన్‌ను సాధారణంగా ఇమ్యునోసప్రెసివ్‌ ట్రీట్మెంట్‌కు వైద్యులు సూచిస్తుంటారు. కానీ ఇదో దివ్య ఔషధం అని మనుషుల జీవిత కాలాన్ని పెంచుతుందని బిలయనీర్లు కూడా విశ్వసిస్తున్నారు.

Rapamycin is an Anti-Ageing Pill: రపామైసిన్ అనే సాధారణ టాబ్లెట్ చుట్టూ అసాధారణ నమ్మకాలు ఏర్పడ్డాయి. కొవిడ్ సమయంలో సంజీవనిలా పని చేసిన ఈ పిల్‌తో జీవితకాలం పెంచుకోవచ్చని చాలా మంది నమ్ముతున్నారు. ఈ జాబితాలో శాస్త్రవేత్తలు, బిలయనీర్లు కూడా ఉన్నారు. కొంత మంది ఐతే తమ ఆస్తులు అన్నీ అమ్ముకొని ఈ టాబ్లెట్ వాడుతూ తమ జీవితాన్నే ఒక ప్రయోగశాలగా మార్చుకునేలా రపామైసిన్ చుట్టూ మిత్‌లు అల్లుకున్నాయి.

రపామైసిన్‌పై ఉన్న నమ్మకంతో సంస్థను అమ్ముకున్న వ్యక్తి:

బ్రియన్ జాన్సన్.. 47 ఏళ్ల టెక్ ఎంట్రప్రెన్యూర్‌. మిలయనీర్ కూడా. ఇతడికి ఎక్కువ కాలం జీవించాలని కోరిక. దాని కోసం వివిధ రకాలైన డైట్ పద్ధతులు, మందుల వాడకంతో పాటు రపామైసిన్‌పైనా ఆధారపడ్డారు. ఎక్కువ కాలం బతకాలన్న కోరికతో తన బ్రెయిన్ ట్రీ సంస్థను 2013లో పేపాల్‌కు 800 మిలియన్ డాలర్లకు అమ్మేశారు. ఆ విషయాన్ని కొన్నేళ్ల తర్వాత బయటపెట్టారు. మరణం లేని జీవితాన్ని అనుభవించడం కోసమే ఆ మొత్తాన్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఈ యాంటి ఏజింగ్ కోసం ఏటా 2 మిలియన్ డాలర్ల వరకూ బ్రియాన్ ఖర్చు చేస్తున్నారు. ప్రతి రోజూ ఒక క్రమ పద్ధతిలో డైట్ ఫాలో అవడం, పూర్తిగా వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం సహా రపామైసిన టాబ్లెట్ కూడా తన జీవితంలో భాగం అయిందని ఆయన చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన వయస్సు ఎపిజెనెటిక్ వయస్సుతో పోల్చితే 5న్నరేళ్లు తక్కువగా మారిందని తన బ్లూప్రింట్ వెబ్‌సైట్ ద్వారా తెలిపారు. అతడు రపామైసిన్ 13 ఎంజీ తీసుకుంటున్నట్లు చెప్పారు.

ఇతడే కాదు మిఖైల్‌ బ్లగోస్‌క్లోనీ అనే రష్యన్ ఆంకాలజీ, యాంటీ ఏజింగ్ స్పెషలిస్టు కూడా రపామైసిన్ అద్భుతాలు చేస్తుందని ప్రకటించారు. కణజాలం వయస్సుకు సంబంధించిన TOR సిగ్నలింగ్‌పై రపామైసిన్ ప్రభావం చూపుతుందని ఈయన పేర్కొన్నారు. బ్రియాన్ ఒక్కళ్లే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది రపామైసిన్‌పై ఆధారపడి ఎక్కువ కాలం జీవించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

అసలు రపామైసిన్ ఎవరు తయారు చేశారు.. దాని చుట్టూ మిత్‌లు ఎందుకు?

రపామైసిన్‌ టాబ్లెట్ ఇటీవలే గోల్డెన్ జూబ్లీ పూర్తి చేసుకుంది. అత్యంత జనరిక్ మెడిసిన్‌గా పేరున్న ఈ రపామైసిన్‌ 1972లో చిలీలోని ఈస్టర్ ఐలాండ్ లేదా నేటివ్స్ పిలుచుకునే రపా నూయీ ఐలాండ్‌లో ఒక బ్యాక్టీరియంగా దొరికింది. దీనికి ఇమ్యునోసప్రెసివ్‌ను ట్రీట్ చేసే లక్షణాలున్నాయని గుర్తించిన శాస్త్రవేత్తలు మెడిసిన్‌గా అందుబాటులోకి తెచ్చారు. అప్పటి నుంచి మానవజాతి ఎదుర్కొన్న ప్రళయం కొవిడ్ సమయం వరకూ ఒక దివ్య ఔషధంలా పని చేస్తూ కోట్లాది ప్రాణాలను నిలబెట్టింది.

ఇదొక యాంటి ఏజింగ్‌గా పనికొస్తుందని విశ్వసిస్తూ వచ్చిన శాస్త్రవేత్తలకు 2009లో బలం చేకూరింది.  మనుషుల వయస్సు 60తో సమానమైన వయస్సు కలిగిన ఎలుకలపై ఈ రపామైసిన్‌తో చేసిన ప్రయోగాలు ఫలితాన్నిచ్చాయని యూఎస్ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఎలుకల జీవితకాలం 28 నుంచి 38 శాతం మేర పెరిగినట్లు పేర్కొన్నారు. మనుషులలో అయితే ఇంకా ఎక్కువ ఫలితాలు సాధించొచ్చని పేర్కొన్నారు. అప్పటి నుంచి మనుషుల వయస్సు కూడా పెరుగుతుందని అందరూ నమ్ముతున్నారు. దీనికి సంబంధించి ఏ విధమైన శాస్త్రీయ ఆధారాలు లేదా ప్రయోగాలు జరగనప్పటికీ బ్రయిన వంటి మిలయనీర్లు రపామైసిన్‌పై ఆధారపడడంతో ప్రపంచ వ్యాప్తంగా రపామైసిన్ చుట్టూ మిత్‌లు అల్లుకున్నాయి. 

డాక్టర్లు ఏమంటున్నారు..?

ఈ విషయంలో వైద్యుల మధ్య భేధాభిప్రాయాలు ఉన్నాయి. మిఖైల్ వంటి వైద్యులు ఇది సాధ్యమే అని అభిప్రాయపడుతున్నారు. ఇమ్యూనిటీని కంట్రోల్‌లో ఉంచే ఈ టాబ్లెట్‌తో TOR సిగ్నలింగ్‌ను ప్రభావితం చేయడం సాధ్యమే అంటున్నారు. మరి కొందరు వైద్యులు మాత్రం పరిమితికి మించి రపామైసిన వాడడం వల్ల ఆరోగ్య పరంగా దుష్ఫలితాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతినొచ్చని అంటున్నారు. ఇన్‌ఫెక్షన్లు పెరిగే ప్రమాదం ఉందని, గాస్ట్రిక్ సమస్యలకు కారణం అవుతుందని, నోట్లో అల్సర్లు ఏర్పడొచ్చని, బ్లడ్ షుగర్ లెవల్స్‌లో తేడాలు, లిపిడ్ లెవల్స్‌లో ఛేంజెస్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ టాబ్లెట్‌ వాడుతూ ఎక్కువ కాలం బతకడానికి ప్రయత్నిస్తున్న వారందరూ మిలయనీర్లే. వాళ్లందరికీ అన్ని రకాల వైద్యపరీక్షలు, చికిత్సలు అందుబాటులో ఉంటాయి. సామాన్యులు వీటిని ఇలా ఎక్కువ కాలం బతకడానికి ఒక సాధనంగా వినియోగించాలని చూడడం ప్రమాదకరంగా పరిణమించొచ్చని వైద్య నిపుణుల అభిప్రాయపడుతున్నారు.

Also Read: ఈ చెట్టు బెరడుతో బీపీ సమస్య మటుమాయం అవుతుందట

టాప్ హెడ్ లైన్స్

Milk Purity Checks at Home : పాలు పల్చగా ఉన్నాయా.. వాసన, రుచిలో తేడా కనిపిస్తోందా? ఇంట్లోనే కల్తీపాలను ఇలా గుర్తించండి
పాలు పల్చగా ఉన్నాయా.. వాసన, రుచిలో తేడా కనిపిస్తోందా? ఇంట్లోనే కల్తీపాలను ఇలా గుర్తించండి
Dry Fruits Benefits : బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్.. ఏవి ఏ సమయంలో తింటే మంచిది? నిపుణుల సూచనలు ఇవే
బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్.. ఏవి ఏ సమయంలో తింటే మంచిది? నిపుణుల సూచనలు ఇవే
Morning vs Evening Workout : జిమ్ ఉదయం చేయాలా? సాయంత్రం చేస్తే బరువు తగ్గుతారా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
జిమ్ ఉదయం చేయాలా? సాయంత్రం చేస్తే బరువు తగ్గుతారా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
Kidney Problems : ముఖం ఉబ్బిందా? మూత్రంలో నురుగు కనిపిస్తోందా? కిడ్నీలు ఇస్తున్న ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయొద్దు
ముఖం ఉబ్బిందా? మూత్రంలో నురుగు కనిపిస్తోందా? కిడ్నీలు ఇస్తున్న ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయొద్దు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raja Singh Letter: సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
AP Panchayat Elections 2026: పల్లె పోరులో వేలం పాటల జోరు.. సర్పంచి పదవి కోసం రూ.2.30 కోట్లు, పోటీతో పెరిగిన డిమాండ్
పల్లె పోరులో వేలం పాటల జోరు.. సర్పంచి పదవి కోసం రూ.2.30 కోట్లు, పోటీతో పెరిగిన డిమాండ్
IND vs NZ 5th ODI Highlights: ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
కర్నూలులో కామాంధుడు.. ఆవుపై లైంగిక దాడి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదిన స్థానికులు
కర్నూలులో కామాంధుడు.. ఆవుపై లైంగిక దాడి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదిన స్థానికులు
BJP Ramchander Rao: హైదరాబాద్‌ వేదికగా భారత్ ప్రతిష్ఠకు మచ్చ.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: రాంచందర్ రావు డిమాండ్
హైదరాబాద్‌ వేదికగా భారత్ ప్రతిష్ఠకు మచ్చ.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: రాంచందర్ రావు డిమాండ్
Priya Bhavani Shankar Wedding : భర్తతో 'ఇరుముడి' హీరోయిన్ - నవ వధువు క్యూట్ మూమెంట్స్
భర్తతో 'ఇరుముడి' హీరోయిన్ - నవ వధువు క్యూట్ మూమెంట్స్
Tanishq Gold Robbery: తనిష్క్ గోల్డ్ చోరీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
తనిష్క్ గోల్డ్ చోరీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
Ramyakrishnan : 'దంపతులుగానే ఉన్నాం... వేర్వేరు చోట్ల ఉంటున్నాం' - డివోర్స్ రూమర్స్‌పై రమ్యకృష్ణ రియాక్షన్
'దంపతులుగానే ఉన్నాం... వేర్వేరు చోట్ల ఉంటున్నాం' - డివోర్స్ రూమర్స్‌పై రమ్యకృష్ణ రియాక్షన్
Embed widget