Blood Pressure : ఈ చెట్టు బెరడుతో బీపీ సమస్య మటుమాయం అవుతుందట
జీవన శైలి జబ్బుల కారణంగా ఈరోజుల్లో రోజు మాత్ర వేసుకోకుండా రోజు గడిచే వారు చాలా తక్కువ మంది. బీపికోసమో, షుగర్ కోసమో కనీసం ఒక్క మాత్రైనా వాడేవారే ఎక్కువ. ఈ చెట్టు బెరడు కషాయం మాత్ర మాన్పించేస్తుందట.
Blood Pressure Medicine : ఈ రోజుల్లో చాలా మంది లైఫ్ స్టైల్ వల్ల పలు వ్యాధుల బారిన పడుతున్నారు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది బీపి. రక్తనాళాల్లో ప్రవహించే రక్త పీడనాన్ని బీపీగా చెప్తారు. ఈ ప్రెషర్ ఎక్కువగా ఉంటే శరీరంలోని అన్ని ముఖ్యమైన అవయవాల మీద దీని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా గుండె, కిడ్నీలు, మెదడు మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఎలాంటి లక్షణాలు చూపని ఈ అనారోగ్యాన్ని సైలెంట్ కిల్లర్ గా అభివర్ణిస్తారు.
హైబీపికి కారణాలు
ఉప్పు ఎక్కువగా వాడే వారు, స్థూలకాయం, మధుమేహం, నిద్రలోపం, ఒత్తిడి వంటి రకరకాల కారణాలతో బీపీ ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంటుంది. బీపీ కచ్చితంగా అదుపులో ఉంచుకోవడం అవసరం. బీపీ వల్ల గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ సమస్యలు, డిమెన్షియా వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది.
బీపి ఎంత ఉంటే నార్మల్?
సాధారణంగా, బీపీని రెండు సంఖ్యలతో కొలుస్తారు:
- సిస్టోలిక్ బీపీ (Systolic Pressure): గుండె రక్తాన్ని పంపుతోన్నప్పుడు, రక్తనాళాల్లో ఉన్న గరిష్ట ఒత్తిడి. ఇది మొదటి సంఖ్య.
- డయస్టోలిక్ బీపీ (Diastolic Pressure): గుండె విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, రక్తనాళాల్లో ఉన్న కనిష్ఠ ఒత్తిడి. ఇది రెండవ సంఖ్య.
CDC ప్రకారం, రక్తపోటు 90/60 mmHg నుంచి 120/80 mmHg వరకు ఉండటం సాధారణ బీపీగా పరిగణించబడుతుంది. కానీ బీపీ 140/90 mmHg కంటే ఎక్కువగా ఉంటే దాన్ని హై బీపీగా పరిగణిస్తారు. అలాగే 90/60 mmHg కంటే తక్కువగా ఉంటే, దాన్ని లో బీపీగా పరిగణిస్తారు.
బీపిని అదుపు చేసేందుకు క్రమం తప్పకుండా మందులు వాడాల్సి ఉంటుంది. ఆహార నియమాలు కూడా పాటించాల్సి ఉంటుంది. అయితే సహజమైన పద్ధతుల్లో బీపిని అదుపులో పెట్టుకోవాలనుకునే వారికి ఓక్ చెట్టు బెరడుతో బీపి సమస్య పరిష్కారం అవుతుంట. హైబీపీతో బాధపడుతున్న వారు ఈ చెట్టు బెరడుతో చేసిన కషాయం రోజూ తాగితే మంచి ప్రయోజనం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఓక్ చెట్టు బెరడు కషాయాన్ని ఔషధంగా వాడటం రక్తపోటు సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. రక్తపోటు అధికంగా ఉంటే, ప్రతిరోజూ ఖాళీ కడుపుతో ఓక్ చెట్టు బెరడు కషాయం తాగితే బీపీ సాధారణ స్థాయికి వస్తుంది.
ఓక్ బెరడు ప్రయోజనాలు
- ఓక్ చెట్టు బెరడు కషాయం జీర్ణక్రియ వ్యవస్థను బలపరుస్తుంది అజీర్ణ సమస్యను తగ్గిస్తుంది.
- ఓక్ చెట్టు ఆకుల కషాయం డయాబెటిక్స్ లో బ్లడ్ షుగర్ అదుపు చేయడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.
- ఓక్ చెట్టులో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. మంచి క్యాన్సర్ నివారణిగా పనిచేస్తుంది.
బీపి ఉంటే ఈ జాగ్రత్తలు తప్పవు
హై బీపీ నియంత్రించడానికి ఆహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. అధిక కొవ్వు, ఉప్పు ఉన్న ఆహారాన్ని తగ్గించడం మంచిది. అలాగే ప్రతిరోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం చేయడం, శరీర బరువు పెరగకుండా జాగ్రత్త పడితే బీపీ సమస్యను నివారించడం సాధ్యపడుతుంది. క్రమం తప్పకుండా బీపీ పరీక్షించుకుంటూ తగిన జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని గుర్తుంచుకోవాలి.
Also Read : సైలెంట్ కిల్లర్స్తో జాగ్రత్త, ప్రాణాలు హరిస్తున్న బీపీ సమస్యలు.. న్యూ స్టడీలో షాకింగ్ రిజల్ట్స్