కరివేపాకు మీ ఆహారం రుచిని, సువాసనను అందిస్తుంది.

అంతేకాకుండా దీనిలో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు దాగి ఉన్నాయి.

ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు.. రక్తపోటును తగ్గిస్తుంది.

కరివేపాకులోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది.

దీనిలోని ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు సీజనల్​ వ్యాధులను దూరం చేస్తాయి.

ఇది జుట్టు, చర్మ సంరక్షణలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.

కాబట్టి దీనిని మీరు సూప్​లలో, కూరల్లో కలిపి తీసుకోవచ్చు.

లేదంటే కరివేపాకుతో టీ తయారు చేసుకుని తాగొచ్చు.