Hypertension And Stroke Are Silent Killers : సైలెంట్ కిల్లర్స్‌తో జాగ్రత్త, ప్రాణాలు హరిస్తున్న బీపీ సమస్యలు.. న్యూ స్టడీలో షాకింగ్ రిజల్ట్స్
Silent Killers : ఈ మధ్య ఎలాంటి లక్షణాలు లేకున్నా కొందరు సడెన్‌గా మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జాగ్రత్తగా ఉండాలని.. ముఖ్యంగా బీపీ ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఎందుకంటే..
Blood Pressure Prevention Tips : చాలా సాధారణంగా తీసుకునే ఆరోగ్య సమస్యల్లో అధిక రక్తపోటు కూడా ఒకటి. ప్రస్తుతం దీనినే స్ట్రోక్ సైలెంట్ కిల్లర్స్ అంటున్నారు. ఎందుకంటే ఇది ఎలాంటి లక్షణాలు లేకుండా మిలియన్ల మందిపై ప్రతికూల ప్రభావాలు చూపిస్తుంది. సకాలంలో నివారణ చర్యలు తీసుకోకపోతే.. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావడంతో పాటు.. కొన్నిసార్లు మరణానికి దారితీస్తుంది. ఈ పరిస్థితిని ఎలా గుర్తించాలో.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో.. దీనిపై నిపుణులు ఇచ్చే సలహా ఏంటో చూసేద్దాం.
పరిస్థితి చేజారిపోవడానికి కారణం అదే
అధిక రక్తపోటు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. చికిత్స చేయించుకోకుండా వదిలేస్తే.. స్ట్రోక్, గుండెపోటు, మూత్రపిండాల సమస్యలతో పాటు మరణానికి దారితీసే ప్రమాదాన్ని కలిగిస్తుంది. అయితే ఇప్పుడు కొందరిలో ఈ తరహా లక్షణాలు కనిపించట్లేదు. సమస్య ఉన్నా.. లక్షణాలు కనిపించక శ్రద్ధ తీసుకోలేకపోతున్నారు. దీనివల్ల పరిస్థితి మరింత చేజారిపోతుందని నిపుణులు చెప్తున్నారు. అందుకే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
అధిక రక్తపోటు అంటే.. బీపీ ఎంత ఉండాలి?
తమకు అధిక రక్తపోటు ఉందని కూడా తెలియకపోవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కొందరిలో వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదించింది. అధిక రక్త పోటు ఉన్నవారిలో దాదాపు సగం మందికి ఈ సమస్య ఉన్నట్లు, లక్షణాలు కూడా తెలియడం లేదని.. అందుకే వాటిని సైలెంట్ కిల్లర్స్ అంటున్నారు. బీపీ అనేది 140/90 ఎక్కువ ఉంటే దానిని అధిక రక్తపోటు లేదా హైపర్ టెన్షన్ అంటారు. ఇది ఏ వయసు వారినైనా ప్రభావితం చేస్తుంది. ఊబకాయం, రక్తంలో గ్లూకోజ్ స్థాయిల పెరుగుదల, జీవనశైలిలో మార్పులవల్ల ఈ సమస్య వస్తుందని అధ్యయనం నిరూపించింది. అయితే యువతలో ఈ సమస్యను గుర్తించలేకపోవడం వల్లనే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని పరిశోధనలో తేలింది.
ఆ మార్పులు కచ్చితంగా చేయాలి.. లేకుంటే..
హైపర్ టెన్షన్ మెదడుపై ప్రభావం చూపిస్తుంది. మెదడులో రక్తస్రావం ఎక్కువగా జరగడంవల్ల కూడా ఈ పరిస్థితి సంభవించవచ్చు. మీ బీపీలో మార్పులు గమనిస్తే వెంటనే వైద్యుల దగ్గరకు వెళ్లాలి. చికిత్స పూర్తిగా అధిక రక్తపోటును తగ్గించదు. కానీ కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా జీవనశైలిలో కొన్ని మార్పులు చేయడం వల్ల కూడా దీనిని కంట్రోల్ చేయవచ్చు. బరువు ఎక్కువగా ఉంటే.. తగ్గేందుకు మార్గాలు వెతుక్కోవాలి. రోజూ ఏడెనిమిది గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఆల్కహాల్, స్మోకింగ్ జోలికి అస్సలు వెళ్లకూడదు. కెఫిన్ కూడా తక్కువగా తీసుకుంటే మంచిది. ఈ తరహా మార్పులు చేస్తే ఈ సైలెంట్ కిల్లర్స్ మిమ్మల్ని ఏమి చేయవు అంటున్నారు. అశ్రద్ధ చేస్తే మాత్రం ప్రాణాలపై ఆశలు వదులుకోవాలని హెచ్చరిస్తున్నారు.
Also Read : రాత్రుళ్లు త్వరగా నిద్రరావట్లేదా? అయితే ఈ టిప్స్‌తో హాయిగా నిద్రపోండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.