News
News
X

Periods: మహిళలూ, పీరియడ్స్ ఆలస్యం చేసే టాబ్లెట్స్ వేసుకుంటే వచ్చే ఆరోగ్య సమస్యలేంటో తెలుసా?

పండుగ, వేడుకలు,పెళ్లిళ్లు ఉన్నాయని చాలామంది మహిళలు పీరియడ్స్ రాకుండా ఆపే మాత్రలను వేసుకుంటారు.

FOLLOW US: 
Share:

హిందూ సంప్రదాయం ప్రకారం పీరియడ్స్ వచ్చిన కాలంలో మహిళలు అన్ని శుభకార్యాలకు దూరంగా ఉండాలి. అందుకే ఇప్పుడు ఏదైనా పెళ్లి, పేరంటము లేక పండుగ ఉంటే మహిళలు ఆరోజు పీరియడ్స్ రాకుండా ఆపే టాబ్లెట్లను వేసుకుంటున్నారు. ఈ టాబ్లెట్లను వాడడం అధికమైపోయింది. పీరియడ్స్‌ను ఆలస్యం చేసే మందులు వాడడం వల్ల ఎలాంటి చెడు ప్రభావాలు ఉంటాయో కూడా వారు ఆలోచించడం లేదు. వీటి వాడకం ఎంతగా పెరిగిపోయిందంటే ఇప్పుడు ప్రతి మహిళ బ్యాగ్ లో ఈ టాబ్లెట్లు దాచుకుంటున్నారు.

ఎప్పుడు పీరియడ్స్ వస్తాయి?
మీ హార్మోన్లోని మార్పులు పీరియడ్స్ సమయాన్ని నిర్ణయిస్తాయి. ప్రతినెలా అండాశయాల ద్వారా ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ కారణంగా గర్భాశయం చుట్టూ ఉన్న పొర మందంగా మారుతుంది. ఫలదీకరణం చేసిన గుడ్డు ప్రవేశానికి సిద్ధంగా ఉండటానికి గర్భాశయ పొర సిద్ధమవుతుంది. ఆ పొరను ప్రొజెక్టరాన్ హార్మను రెండు వారాల పాటూ కాపాడుతుంది. ఆ సమయమే గర్భధారణకు ఉత్తమ కాలం. ఆ సమయంలో గర్భం ధరించకపోతే  ప్రొజెక్టరాన్ హార్మోను స్థాయిలు తగ్గిపోతూ ఉంటాయి. అలాగే గర్భాశయం దాని పొరను కూడా కోల్పోవడం ప్రారంభిస్తుంది. ఆ సమయంలోనే పీరియడ్స్ ప్రారంభమవుతాయి.

పీరియడ్స్ ఆలస్యం చేసే మందులలో ఎక్కువగా వాడేవి నోరేథిస్టిరాన్. ఇవి ప్రొజెస్టరాన్ హార్మోనుకు సింథటిక్ రూపం. ఈ మాత్రలు శరీరంలో ప్రొజెస్టరాన్ హార్మోన్‌ను కృత్రిమంగా పెంచి పీరియడ్స్ రాకుండా అడ్డుకుంటాయి. పీరియడ్స్‌ను రెండు వారాలపాటు వాయిదా వేయడానికి ఈ మందులను వాడడం ఎక్కువైంది. అయితే రోజు ఒకటి లేదా రెండు మాత్రలు వేస్తేనే పీరియడ్స్ ఆలస్యం అవుతాయి. 

ఎప్పుడు తీసుకోవాలి?
పీరియడ్స్ ప్రారంభానికి మూడు రోజుల ముందు నుంచే ఈ టాబ్లెట్ వినియోగాన్ని ప్రారంభించాలి. అప్పుడే పీరియడ్స్ ఆలస్యం అవుతాయి. టాబ్లెట్స్ ఆపేసిన ఒకరోజు లేదా నాలుగైదు రోజులలోపు పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంది.

సురక్షితమేనా?
పీరియడ్స్‌ను ఆలస్యం చేసే మాత్రలు పూర్తిగా సురక్షితం కాదనే చెప్పాలి. అయితే పెళ్లిళ్లు, వేడుకలు ఉన్న సందర్భాల్లో ఒకటి రెండు రోజులు ఈ మాత్రలు వేసుకోవడం వల్ల పీరియడ్స్ ఆగుతాయి. అలా అరుదుగా వేసుకుంటే సమస్య లేదు. కానీ పదేపదే ఉపయోగిస్తే మాత్రం హార్మోన్లలో మార్పులు వచ్చి ఋతుచక్రం ఇబ్బంది పడుతుంది. మహిళల్లో వీటి వాడకం ఎక్కువైతే ప్రతికూల ప్రభావాలు తప్పవు.రక్తస్రావం అధికంగా జరగడం రొమ్ముల్లో గడ్డలు ఏర్పడడం, రొమ్ము క్యాన్సర్ రావడం, కాళ్లు, ఊపిరితిత్తులు, మెదడులో రక్తం గడ్డ కట్టడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ చరిత్రలో రొమ్ము క్యాన్సర్, మెదడులో రక్తం గడ్డ కట్టడం వంటి సమస్యలు ఉన్నవారు ఉంటే ఈ మందులను వేసుకోకపోవడమే మంచిది. పదేపదే పీరియడ్స్ ను వాయిదా వేయడం ఆరోగ్యానికి చెడే చేస్తుంది. పొత్తికడుపులో అసౌకర్యంగా అనిపించడం, వికారం వేధిస్తాయి. 

Also read: ఇరవై నాలుగేళ్లుగా ఇతని ఆహారం నీళ్లు, కొబ్బరే - ఆ సమస్యను తట్టుకునేందుకే ఇలా మారాడట

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 20 Feb 2023 06:28 AM (IST) Tags: Periods Women Periods Period delay tablets

సంబంధిత కథనాలు

World Tuberculosis Day: క్షయ వ్యాధి లక్షణాలేమిటీ? ఎవరికి ఎక్కువ ప్రమాదం?

World Tuberculosis Day: క్షయ వ్యాధి లక్షణాలేమిటీ? ఎవరికి ఎక్కువ ప్రమాదం?

దేశంలో భయపెడుతున్న కరోనా - 24 గంటల్లో 3 వేలకుపైగా కేసులు నమోదు

దేశంలో భయపెడుతున్న కరోనా - 24 గంటల్లో  3 వేలకుపైగా కేసులు నమోదు

ఈ పండ్లు పేరేమిటో తెలుసా? కనిపిస్తే కచ్చితంగా తినాల్సిందే

ఈ పండ్లు పేరేమిటో తెలుసా? కనిపిస్తే కచ్చితంగా తినాల్సిందే

Papaya: బొప్పాయి తినడం వల్ల నిజంగా గర్భస్రావం జరుగుతుందా? ఇది ఎంతవరకు నిజం

Papaya: బొప్పాయి తినడం వల్ల నిజంగా గర్భస్రావం జరుగుతుందా? ఇది ఎంతవరకు నిజం

కొత్తిమీరను రుచి, వాసన కోసమే వాడుతారనుకుంటే పొరపాటే - ఇది చేసే మేలు ఎంతో

కొత్తిమీరను రుచి, వాసన కోసమే వాడుతారనుకుంటే పొరపాటే - ఇది చేసే మేలు ఎంతో

టాప్ స్టోరీస్

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు