అన్వేషించండి

పారాసిటమాల్ వాడుతున్నారా? ఇక అంతే సంగతులు!

పాండమిక్ మొదలైనప్పటి నుంచి పారాసిటామోల్ వినియోగం చాలా పెరిగిందని సర్వేలు తెలుపుతున్నాయి. జ్వరానికి, నొప్పులకు పారాసిటమాల్ వాడేవారి సంఖ్య క్రమేనా పెరిగింది.

పెయిన్ కిల్లర్స్  లేని ఇళ్లు దాదాపు ఉండడం లేదు. కనీసం పారాసిటామాల్ అయినా ఉంటోంది ప్రతి ఇంట్లో. కోవిడ్-19 మొదలైనప్పటి నుంచి పారాసిటామాల్ వినియోగం చాలా పెరిగిందని సర్వేలు తెలుపుతున్నాయి. జ్వరానికి, నొప్పులకు పారాసిటమాల్ వాడుతున్నవారి సంఖ్య ఎక్కువైనట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే, పారాసిటమాల్‌ను పరిమితి కంటే ఎక్కువ వాడేవారి సంఖ్య బాగా ఎక్కువ కావడమే. 

పారాసిటామాల్‌ను మోతాదుకు మించి తీసుకోవడం చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నొప్పి ఎంత ఎక్కువగా ఉన్నా సరే డాక్టర్ సూచించిన డోస్ కంటే ఎక్కువ మోతాదులో వాడకూడదు. పారాసిటామాల్ ను తలనొప్పి, జ్వరం, ఒళ్లునొప్పులు, కడుపునొప్పి, పిరియడ్ క్రాంప్స్ ఇలా రకరకాల సమస్యలకు ఒకే పరిష్కారం కింద వాడుతున్నారు. ఇది మాములుగా శరీరంలోని పెయిన్ రిసెప్టార్స్ ను బ్లాక్ చేస్తుంది.

ఎన్ హెచ్ ఎస్ గైడ్ లైన్స్ ప్రకారం 24 గంటల వ్యవధిలో పెద్దలు 500 ఎంజీ టాబ్లెట్స్ ఎనిమిదికి మించి తీసుకోకూడదు. రెండు టాబ్లెట్స్ మధ్య కనీసం నాలుగు గంటల సమయం ఉండాలి. దీని ప్రకారం 24 గంటల్లో పెద్దలు 500 ఎంజీ టాబ్లెట్లు నాలుగు మాత్రమే తీసుకోవాలి. అయితే పారాసిటమాల్‌ను ఎప్పుడైనా తీసుకోవచ్చు. భోజనం తర్వాత లేదా భోజనం ముందు ఎలా తీసుకున్నా పెద్దగా నష్టం ఉండదు.

ఎక్కువ మోతాదులో తీసుకోవాలి?

ఎక్కువ మోతాదులో పారాసిటమాల్ వాడినపుడు చాలా సీరియస్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. నొప్పి ఎక్కువగా ఉందని డబుల్ డోస్ తీసుకోవడం లేదా డోస్ పెంచుకోవడం చెయ్యకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది పారాసిమాలే కదా అని డోస్ పెంచి తీసుకుంటూ ఉంటారు. ఎక్కువ మోతాదులో వాడే మందుల్లో పారాసిటమాల్ ఒకటి. అయితే ఇది అధిక మోతాదులో తీసుకున్నపుడు లివర ఫెయిల్యూర్ కు దారి తీస్తుంది. ఇది అప్పుడప్పుడు మరణానికి దారి తీసే ప్రమాదం ఉంటుంది.

పారాసిటమాల్ వల్ల చిన్న మొత్తంలో NAPQI అనే విష పదార్థం లివర్‌లో ఏర్పడుతుంది. అయితే ఇది ఓవర్ డోస్ అయినపుడు ఎక్కువ మొత్తంలో ఏర్పడుతుంది. దీనిని డీటాక్సిఫికేషన్ గ్లూటథియాన్ శరీరంలో విడుదల అవుతుంది. శరీరంలోకి పారాసిటమాల్ ఎక్కువ మోతాదులో వెళ్లినపుడు లివర్‌లో ఎక్కువ మొత్తంలో NAPQI ఏర్పడుతుంది. అందుకు సరిపడినంత గ్లూటాథియాన్ శరీరంలో లేకపోవడం వల్ల లివర్ ఫేయిల్ అవుతుంది.

పారాసిటమాల్ ఓవర్ డోస్ లక్షణాలు

⦿ పారాసిమాల్ ఎక్కువ మోతాదులో తీసుకున్న కొద్ది గంటల తర్వాత లక్షణాలు మొదలవుతాయి.

⦿ శరీరంలో టాక్సిన్స్ పెరిగే కొద్ది కుడి వైపు పక్కటెముకల్లో నొప్పి రావడం మొదలవుతుంది. కళ్లు, చర్మం పసుపు రంగుకు మారుతాయి. కామెర్ల లక్షణాలు కనిపిస్తాయి.

⦿ శ్వాసలో వేగం పెరుగుతుంది. కన్ ఫ్యూషన్, మూత్రవిసర్జనలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి.

⦿ పారాసిటమాల్ ఎక్కువ మోతాదులో తీసుకున్నట్టు అనుమానం వస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

మరి ఐబూప్రొఫెన్ సంగతేంటి?

పారాసిటామాల్ తర్వాత ఎక్కువగా వాడే పేయిన్ కిల్లర్ ఐబూప్రొఫెన్. ఇది అడల్ట్స్ కి 24 గంటల్లో 200mg రెండు మోతాదుల్లో తీసుకోవచ్చు. రోజులో మూడు సార్లు భోజనం తర్వాత తీసుకోవడం మంచిది. అయితే ఐబుప్రొఫెన్ ఎక్కువ కాలం తీసుకోవడం మంచిది కాదు. వైద్య నిపుణుల సలహా ప్రకారం.. పెయిన్ కిల్లర్స్‌ను టాబ్లెట్, కాప్సూల్, గ్రాన్యూల్స్ , లేదా లిక్విడ్.. ఏరూపంలో తీసుకున్నా.. చిన్న డోసే తీసుకోవాలి. ఏ ఔషదాన్ని అయినా సరే 10 రోజులకు మించి వాడక పోవడమే మంచిది. జెల్స్, స్ప్రే వంటివి రెండు వారాలకు మించి వాడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also read: ఆయుర్వేదం ప్రకారం ఆర్ధరైటిస్ నొప్పిని తగ్గించే పదార్థాలు ఇవే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Weight Loss Tips : వారంలో కిలో బరువు తగ్గాలంటే రోజుకు ఎన్ని అడుగులు నడవాలి? ఏ టిప్స్ ఫాలో అవ్వాలి?
వారంలో కిలో బరువు తగ్గాలంటే రోజుకు ఎన్ని అడుగులు నడవాలి? ఏ టిప్స్ ఫాలో అవ్వాలి?
Desk Job Joint Pain : డెస్క్ ఉద్యోగుల్లో పెరుగుతోన్న కీళ్ల నొప్పులు..ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తోన్న నిపుణులు
డెస్క్ ఉద్యోగుల్లో పెరుగుతోన్న కీళ్ల నొప్పులు..ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తోన్న నిపుణులు
High BP : అధిక రక్తపోటు ఉందని ఈ లక్షణాలతో గుర్తించవచ్చా? తలనొప్పి నుంచి చూపు మసకబారడం వరకు.. జాగ్రత్త
అధిక రక్తపోటు ఉందని ఈ లక్షణాలతో గుర్తించవచ్చా? తలనొప్పి నుంచి చూపు మసకబారడం వరకు.. జాగ్రత్త
Yoga Poses for Lower Back : నడుమునొప్పి ఇబ్బంది పెడుతుందా? నిద్రలేవగానే ఈ 5 ఆసనాలు వేయండి.. చాలా రిలీఫ్ వస్తుంది
నడుమునొప్పి ఇబ్బంది పెడుతుందా? నిద్రలేవగానే ఈ 5 ఆసనాలు వేయండి.. చాలా రిలీఫ్ వస్తుంది

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Embed widget