Diabetic Vascular Disease : మీకు డయాబెటిస్ ఉందా ? కొత్తగా ముంచుకొస్తున్న ఈ ముప్పు గురించి తెలుసా ?
భారత్‌లో డయాబెటిస్ పేషంట్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ డయాబెటిస్ వల్ల రక్తనాళాల సమస్యతో కొత్తగా అనేక వ్యాధులకు ప్రజలు గురవుతున్నట్లుగా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
డయాబెటిస్ ఎందరిలోనో అంతులేని చేదును మిగులుస్తోంది. శరీరాన్ని లోపలి నుంచే పీల్చి పిప్పి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 1980లో 10.80 కోట్లున్న షుగర్ పేషెంట్ల సంఖ్య 2014 నాటికి 42.20 కోట్లకు చేరుకుంది. 11 కోట్ల మందికిపైగా షుగర్ పేషెంట్లతో చైనా ప్రధమస్థానాన్ని కైవసం చేసుకోగా, 7.7 కోట్ల మందితో భారత్ ద్వితీయస్థానంలో నిలిచింది. 2030 నాటికి మనదేశంలో ఈ పేషెంట్ల సంఖ్య 10 కోట్లకు చేరవచ్చని అంచనా. దేశ జనాభాలో 5.5 శాతం మంది మధుమేహ వ్యాధిగ్రస్తులున్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.
గతంలో 50 ఏళ్లు దాటినవారు మాత్రమే డయాబెటిస్‌కు గురయ్యేవారు. ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా 30, 40 దాటని వారిలోనూ ఈ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం భారత్‌లో 40 ఏళ్లు పైబడినవారిలో 20 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో ఈ వ్యాధి తీవ్ర రూపం దాల్చుతోంది. ఒకే విధమైన జీవనశైలి, ఆహార అలవాట్లు ఉన్నప్పటికీ క్రమంగా బరువు కోల్పోతుంటే మధుమేహం లక్షణాలు కావచ్చునని చెబుతున్నారు. చేతులు, కాళ్లు, చర్మంలో నొప్పి కొనసాగితే, అది మధుమేహం సంకేతం కావచ్చు.
Read Also: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం
చాలా మంది తమకు డయాబెటిస్ ఉందని గుర్తించలేకపోతున్నారు. ఇప్పుడు కొత్తగా డయాబెటిస్‌తో రక్త నాళాల సమస్యలు వస్తున్నాయి. వాస్కులర్ వ్యాధులు, స్ట్రోక్, కంటి సమస్యలు, దంత వ్యాధి, ఫుట్ సమస్యలతో సహా, అధిక రక్త గ్లూకోజ్ స్థాయిలు అనేక ఆరోగ్య సమస్యలకు డయాబెటిస్ కారణం అవుతోంది. డయాబెటిస్ వల్ల వచ్చే రక్త నాళాల సమస్యను గుర్తించడం చాలా క్లిష్టం. కంటి రుగ్మత, మూత్రపిండ వ్యాధి, ధమని గట్టిపడటం, కరోనరీ హార్ట్ వ్యాధి వంటి సమస్యలను డయాబెటిక్ వాస్కులర్ వ్యాధులు కారణం అవుతున్నాయి. అడుగుల, వేళ్లు, కాలి, కళ్ళు , మూత్రపిండాలు, అవయవాల్లోని చిన్న ధమనులు కూడా వాస్కులర్ వ్యాధి ద్వారా ప్రభావితమవుతాయి. డయాబెటిస్ సంబంధిత వాస్కులర్ సమస్యలు ఉన్న రోగుల్లో అస్పష్టంగా మచ్చలు, ఊహించని బరువు పెరుగుట, ముఖంపై వాపు, నురుగు మూత్రం, అడుగుల పూత, పుళ్ళు, కాళ్ళు నొప్పి, ఎక్కువసేపు నిలబడి ఉన్నప్పుడు అధిక రక్తపోటు వంటి వాటికి కారణం అవుతాయి.
Read Also: చల్లని పాలు తాగితే లాభమా లేక వేడి పాలు మంచివా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
రోజువారీ అలవాట్లలో బద్ధకం, వ్యాయామం చేసేందుకు విముఖత, జీవనశైలి, ఆహార అలవాట్లలో మార్పులు డయాబెటిస్ పెరుగుదలకు కారణమవుతున్నాయి. చక్కెర వ్యాధి అనేది తనకు తానుగా ప్రమాదకారి కాదు. అది సకల అనారోగ్యాలకు కారణమవుతుంది. అందువల్ల దాని పట్ల జాగురూకతతో ఉండటం, ముందుగానే దానిని గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ముఖ్యం. దేశంలో ప్రతీ ఇద్దరిలో ఒకరికి డయాబెటిస్ వచ్చినా దానిని వారు గుర్తించలేకపోతున్నట్టు వైద్యవర్గాల అంచనా.
Read Also: కాఫీ అతిగా తాగితే హృదయ స్పందనల్లో తేడా... కనిపెట్టిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి