అన్వేషించండి

H5N1 flu: చెన్నైలో కొత్త ఫ్లూ కలకలం.. అసలేమిటీ వైరస్? మనుషులకు ప్రమాదకరమేనా?

Chennai: చెన్నైలో హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా కేసులు నిర్ధారణ కావడం దేశంలో ఆందోళన కలిగిస్తోంది. ఇది మనుషులకు వ్యాపించే ప్రమాదం ఉందని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

H5N1 flu confirmed in Chennai:  తమిళనాడు రాజధాని చెన్నైలో హెచ్5ఎన్1  బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం రేపుతోంది. ఇటీవల చెన్నై నగరంలోని కొన్ని ప్రాంతాల్లో పక్షులు అకస్మాత్తుగా మృతి చెందడంతో అధికారులు అప్రమత్తమై నమూనాలను సేకరించారు. భోపాల్‌లోని హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబొరేటరీకి పంపిన ఈ నమూనాల్లో ప్రాణాంతక హెచ్5ఎన్1 వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ స పశుసంవర్ధక శాఖ అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో  ముందుజాగ్రత్తలు చేపట్టడంతో పాటు, ఐదు కిలోమీటర్ల పరిధిని నిఘా జోన్‌గా ప్రకటించారు.                           

హెచ్5ఎన్1 అనేది ప్రధానంగా పక్షులలో వచ్చే అత్యంత వేగంగా వ్యాపించే ఇన్‌ఫ్లుయెంజా వైరస్. ఇది సాధారణంగా అడవి పక్షులు, వలస పక్షుల ద్వారా పెంపుడు కోళ్లు, బాతులకు సోకుతుంది. సోకిన పక్షుల లాలాజలం, మలం లేదా శ్వాసకోశ స్రావాల ద్వారా ఈ వైరస్ ఇతర పక్షులకు వ్యాపిస్తుంది. పౌల్ట్రీ రంగంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. బాధితులుగా ఉన్న పక్షుల్లో మరణాల రేటు దాదాపు 90 శాతం కంటే ఎక్కువగా ఉండటం ఈ వైరస్ తీవ్రతను తెలియజేస్తుంది.                          

మనుషులకు వ్యాపిస్తుందా అనే ప్రశ్నపై ఆరోగ్య నిపుణులు  భిన్నంగా స్పందిస్తున్నారు.  సాధారణంగా ఈ వైరస్ మనుషులకు సోకడం అరుదు అని చెబుతున్నారు. అయితే, సోకిన పక్షులతో నేరుగా సంబంధం ఉన్నవారికి లేదా కలుషితమైన పౌల్ట్రీ పరిసరాల్లో ఉండేవారికి ఇది సోకే ప్రమాదం ఉంది. మనుషులకు సోకితే ఇది తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులకు  దారితీస్తుంది. ప్రస్తుతం ఇది ఒక మనిషి నుంచి మరొక మనిషికి వ్యాపించే సామర్థ్యం తక్కువగా ఉన్నప్పటికీ, వైరస్ మ్యూటేషన్ చెందితే  భవిష్యత్తులో మహమ్మారిగా మారే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ  హెచ్చరిస్తోంది.                          

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు భయాందోళన చెందకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. పౌల్ట్రీ ఉత్పత్తులను బాగా ఉడికించి తీసుకోవాలని, చనిపోయిన పక్షులను చేతులతో తాకవద్దని హెచ్చరిస్తున్నారు. జ్వరం, దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అధికారులు ఇప్పటికే మాంసం దుకాణాలపై నిఘా పెంచారు.         

టాప్ హెడ్ లైన్స్

No Sugar for 30 Days : నో షుగర్స్ అంటే తినకూడని ఫుడ్స్ ఇవే.. 30 రోజులు స్వీట్స్ మానేస్తే కలిగే ప్రయోజనాలివే
నో షుగర్స్ అంటే తినకూడని ఫుడ్స్ ఇవే.. 30 రోజులు స్వీట్స్ మానేస్తే కలిగే ప్రయోజనాలివే
Babymoon Travel Trend : బేబీమూన్ అంటే ఏమిటి? ఇండియాలో ట్రెండ్ అవుతున్న ఈ ట్రిప్‌కు ఎప్పుడు వెళ్లాలి.. ఎలా ప్లాన్ చేసుకోవాలి?
బేబీమూన్ అంటే ఏమిటి? ఇండియాలో ట్రెండ్ అవుతున్న ఈ ట్రిప్‌కు ఎప్పుడు వెళ్లాలి.. ఎలా ప్లాన్ చేసుకోవాలి?
Weight Loss Tips : పొట్ట (Belly Fat), బరువును తగ్గించడంలో హెల్ప్ చేసే 7 రకాల జ్యూస్​లు ఇవే.. ఆరోగ్యానికి కూడా చాలా మంచివి 
పొట్ట (Belly Fat), బరువును తగ్గించడంలో హెల్ప్ చేసే 7 రకాల జ్యూస్​లు ఇవే.. ఆరోగ్యానికి కూడా చాలా మంచివి 
Brownie Recipe : ఉడికించిన శనగలతో నోరూరించే బ్రౌనీ చేసేయండిలా.. సింపుల్, టేస్టీ రెసిపీ ఇదే
ఉడికించిన శనగలతో నోరూరించే బ్రౌనీ చేసేయండిలా.. సింపుల్, టేస్టీ రెసిపీ ఇదే

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రాబు
Amarnath Yatra 2026 : అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
Telangana Police vs AP Police:హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!
హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!
Super Subbu OTT : ఓటీటీలోకి వచ్చేసిన సందీప్ కిషన్ కామెడీ సిరీస్ - సూపర్ సుబ్బు ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సందీప్ కిషన్ కామెడీ సిరీస్ - సూపర్ సుబ్బు ఎందుకు చూడాలంటే?
Jana Nayagan Release Date : జన నాయగన్‌కు సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ - సీఎం విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
జన నాయగన్‌కు సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ - సీఎం విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Gurthukosthunnayi Web Series Review - 'గుర్తుకొస్తున్నాయి' రివ్యూ: ETV Winలో కొత్త వెబ్ సిరీస్... నవ్వుల నోస్టాల్జియా బావుందా?
'గుర్తుకొస్తున్నాయి' రివ్యూ: ETV Winలో కొత్త వెబ్ సిరీస్... నవ్వుల నోస్టాల్జియా బావుందా?
Isakapatnam Web Series Review - 'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
Importance Of Voter List Verification: ఓటు హక్కు కేవలం రాజకీయం కాదు.. మీ రేషన్, పెన్షన్ పథకాలను శాసించే డిజిటల్ పత్రం ! సామాన్యులకు అలర్ట్!
ఓటు హక్కు కేవలం రాజకీయం కాదు.. మీ రేషన్, పెన్షన్ పథకాలను శాసించే డిజిటల్ పత్రం ! సామాన్యులకు అలర్ట్!
Embed widget