అన్వేషించండి

Islamabad Blast: ఇస్లామాబాద్ మసీదులో ఆత్మాహుతి దాడి - యాభై మంది దుర్మణం - బలూచ్ ఆర్మీ పనే?

Mosque Blast :పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ఒక మసీదులో భారీ పేలుడు జరిగింది. వందల మంది చనిపోయినట్లుగా అంచనా వేస్తున్నారు

Blast rocks mosque in Islamabad: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ఒక మసీదులో భారీ పేలుడు జరిగింది.   శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో ఒక మసీదులో సంభవించిన భారీ పేలుడు నగరాన్ని వణికించింది.  ఇస్లామాబాద్‌లోని షాజాద్ టౌన్ పరిధిలో ఉన్న మసీదు లక్ష్యంగా ఈ దాడి జరిగింది. ప్రార్థనల కోసం భక్తులు పెద్ద ఎత్తున గుమిగూడిన సమయంలో ఈ  పేలుడు సంభవించడంతో  భారీగా ప్రాణనష్టం జరిగింది. యాభై నుంచి వంద మంది చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు.                    
 
పేలుడు తీవ్రతకు మసీదు గోడలు కూలిపోయాయని, పలువురు భక్తులు శిథిలాల కింద చిక్కుకుపోయారని స్థానిక మీడియా వెల్లడించింది. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్  ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.            

ఈ దాడిపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, పాకిస్తాన్ సైన్యం ,  బాంబు స్క్వాడ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రాథమిక విచారణలో ఇది ఆత్మాహుతి దాడి కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఇస్లామాబాద్ నగరం అంతటా అత్యవసర పరిస్థితి  ప్రకటించారు. ముందస్తు జాగ్రత్తగా ప్రధాన రహదారులను మూసివేసి, నగరాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.  ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌లో ఉగ్రవాద దాడులు మళ్లీ పెరుగుతున్నాయి.

 గత నవంబర్‌లో కూడా ఇస్లామాబాద్ జ్యుడీషియల్ కాంప్లెక్స్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా మసీదు పేలుడుకు బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన విడుదల చేయలేదు. అయితే, బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీపై ఇటీవల పాక్ సైన్యం ఊచకోతకు పాల్పడటంతో  ప్రతీకారంగా  ఈ దాడి జరగిందని  భావిస్తున్నారు.                               

                       

టాప్ హెడ్ లైన్స్

IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
United States IRAN War: 'ఒక్క సైనికుడు మా భూభాగంలో అడుగుపెట్టినా కాళ్లు నరికేస్తాం' అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ 
'ఒక్క సైనికుడు మా భూభాగంలో అడుగుపెట్టినా కాళ్లు నరికేస్తాం' అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ 
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
SlumDog Update : విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ నుంచి బిగ్ సర్ప్రైజ్ - టబు As డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డే
విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ నుంచి బిగ్ సర్ప్రైజ్ - టబు As డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డే
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - ఈ వారం థియేట్రికల్ రిలీజెస్... మీరు ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - ఈ వారం థియేట్రికల్ రిలీజెస్... మీరు ఛాయిస్ ఏంటి?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
కారు నుంచి లారీ వరకు.. ఫిట్‌నెస్‌ను ఇక యంత్రాలే పరీక్షిస్తాయి! తెలంగాణలో 15 చోట్ల కొత్త వ్యవస్థ
మీ కారు ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఇక కొత్త రూట్‌లో.. మాన్యువల్‌ పరీక్షలకు చెక్‌!
Embed widget