అన్వేషించండి

Night Sleep: రాత్రి పడుకునే ముందు వీటిని అస్సలు తీసుకోకండి... మంచి నిద్ర కోసం ఏం చేయాలి?

రాత్రి నిద్ర సరిగా పట్టాలంటే కొన్ని అలవాట్లు చేసుకోవాలి. ఆహారపు అలవాట్లలో కూడా కొన్ని మార్పులు అవసరం. అవేంటో ఇప్పుడు చూద్దాం.

రాత్రి పడుకునే ముందు మనం ఏం తింటున్నామా అనేది కూడా చాలా ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. రాత్రి నిద్రపోయే ముందు తినే ఆహారం కారణంగా చాలా మందిలో గుండెల్లో మంట, గ్యాస్, నిద్రలేమి, అధిక బరువు లాంటి కొన్ని సమస్యలు వస్తున్నాయట. కాబట్టి రాత్రిపూట  ఎక్కువ కార్బోహైడ్రేట్స్, ఫ్యాటీ యాసిడ్స్, మసాలాలు కలిగి ఉన్న ఆహారాలకు దూరంగా ఉంటే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కొన్నింటిని రాత్రి పడుకునే ముందు వీటిని అస్సలు తినకూడదని చెబుతున్నారు. 

Also Read: జామ కాయే కాదు... జామ ఆకులు కూడా ఎంతో మంచివి... ఆ ప్రయోజనాలేంటో మీకు తెలుసా?

పడుకునే ముందు ఏం తినకూడదు? 
* పాస్తా, అన్నం, బంగాళదుంపలు కలిగిన ఫుడ్ రాత్రి పడుకునే ముందు తినకూడదు. ఇవి తినడం వల్ల బ్లడ్‌లో షుగర్, ఇన్సులిన్ లెవెల్స్ పెరిగి బాడీ మెటబాలిజమ్ తగ్గిపోతుంది. ఫలితంగా ఎనర్జీని కోల్పోతారు. వీటికి బదులు ప్రొటీన్లు కలిగి ఉండే ఆకుకూరలు లాంటివి తినడం మంచిది.
* రాత్రిపూట మసాలాలు ఎక్కువ ఉన్న ఫుడ్ తింటే.. గుండెల్లో మంట పుడుతుంది. ఛాతి కింది భాగంలో కూడా నొప్పి వస్తుంది. భవిష్యత్తులో ఇది పెద్ద సమస్యను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. 
* డిన్నర్ టైంలో జిడ్డు ,కొవ్వుతో కూడుకున్న ఆహారం తినడం వల్ల అవి సరిగా అరగవు. అందుకే చాలా మందికి పేగుల్లో ఇబ్బందులు ఏర్పడి గ్యాస్ సమస్యలు ఎదురవుతాయి. 
* చాక్లెట్లలో ఉండే కెఫైన్ నిద్ర పట్టకుండా చేస్తుంది. అంతేకాదు కెఫైన్ తీసుకోవడం వల్ల నీరసం, వికారం, స్టమక్ ఇరిటేషన్స్ లాంటి వాటికి కారణమవుతుంది. కెఫైన్ ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల హార్ట్‌రేట్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. 
* పడుకునేముందు వీలైనంత వరకు కొన్ని పానీయాలను తాగకుండా ఉండడమే మంచిది. కాఫీ, కూల్ డ్రింక్స్, చక్కెరతో కూడిన పండ్ల రసాలు, ఎనర్జీ డ్రింక్స్ లాంటివి మీకు నిద్ర సరిగ్గా పట్టకుండా చేస్తాయి. ఆ ప్రభావం మీ చర్మంపై పడుతుంది.

Also Read: సొరకాయ జ్యూస్‌తో... యూరినరీ ఇన్ఫెక్షన్స్‌కి చెక్... సొరకాయ జ్యూస్ ఎలా చేసుకోవాలి?

నిద్ర పోయే ముందు ఏం చేయాలి? 
* నిద్ర పోయే ముందు మేకప్ రిమూవ్ చేసి పడుకోవడం తప్పనిసరిగా చేయాలి. లేదంటే స్కిన్ డ్రై గా మారిపోతుంది. 
* రాత్రి పార్టీ ఉందన్నా, వర్క్ రిలేటెడ్ ఫంక్షన్‌లో ఆల్కహాల్ సర్వ్ చేస్తారని తెలిసినా మీ నిద్ర టైం‌కి రెండు మూడు గంటల ముందు ఆల్కహాల్ ఆపేసి నీరు తాగడం మొదలుపెట్టండి.
* వారానికి ఒకసారైనా బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ మార్చాలి. లేదంటే మన బాడీ మీద, ఫేస్ మీద పేరుకున్న మురికి, జిడ్డు వాటికి అంటుతుంది. తద్వారా చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 
* రూం టెంపరేచర్ కూడా నిద్రని ఎఫెక్ట్ చేస్తుంది. మరీ వేడిగా ఉన్నా, మరీ చల్లగా ఉన్నా సరిగ్గా నిద్ర పట్టదు. చలిగా లేదా ఉక్కగా ఉండకుండా చల్లగా ఉంటే మీకూ హాయిగా నిద్ర వస్తుంది. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ఈ కథనానికి ‘abp దేశం’ ఎలాంటి బాధ్యత వహించదని గమనించగలరు. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Infantile Epilepsy : శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
Amla Benefits : రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?
రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?
Water Weight : వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే
వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే
Kidney Disease : కిడ్నీలు దెబ్బతింటున్నా తెలియకపోవచ్చు.. ముందుగా గుర్తించేందుకు ఈ 2 టెస్ట్‌లు చేయించుకోండి
కిడ్నీలు దెబ్బతింటున్నా తెలియకపోవచ్చు.. ముందుగా గుర్తించేందుకు ఈ 2 టెస్ట్‌లు చేయించుకోండి

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget