(Source: ECI/ABP News/ABP Majha)
Bottle Gourd Juice: సొరకాయ జ్యూస్‌తో... యూరినరీ ఇన్ఫెక్షన్స్‌కి చెక్... సొరకాయ జ్యూస్ ఎలా చేసుకోవాలి?
సొరకాయ జ్యూస్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. మహిళల్లో యూరినరీ ఇన్ఫెక్షన్స్‌కి సొరకాయ జ్యూస్ ద్వారా చెక్ పెట్టవచ్చు. ఇంకా ఏమేమి ప్రయోజనాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
సొరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సొరకాయలో దాదాపు 96 శాతం నీళ్లు ఉంటాయి. విటమిన్ C, B,సోడియం, ఐరన్, జింక్, పొటాషియం వంటి విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. శరీరంలోని అధిక వేడిని బయటకు పంపి మేలు చేస్తుంది. ఇందులో యాంటి ఆక్సిడెంట్స్ అధికంగా ఉండడం వల్ల శరీరంలో కణాలు డ్యామేజ్ అవ్వకుండా చేస్తుంది. సొరకాయని కూర, స్వీట్స్, వంటివి చేయడానికి ఉపయోగిస్తారు. కానీ, సొరకాయ జ్యూస్‌తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయ. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Also Read: మీ బేబీకి డైపర్లు వాడుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారో లేదో చెక్ చేసుకోండి
సొరకాయ జ్యూస్ ఎలా తయారు చేస్తారు?
ముందుగా సొరకాయ పై తొక్క తీసేయాలి. ఆ తర్వాత సొరకాయను ముక్కలుగా చోసి మిక్సీలో వేసి తగినన్ని నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్‌ని వడగట్టాలి. ఈ రసాన్ని గ్లాసులోకి తీసుకుని డైరెక్ట్‌గా తాగవచ్చు. లేదంటే అర చెక్క నిమ్మరసం, రెండు స్పూన్ల తేనె వేసి బాగా కలిపి తీసుకోవచ్చు.
సొరకాయ జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
సొరకాయ జ్యూస్ ప్రతి రోజూ ఉదయం టిఫిన్‌కి ముందు తాగాలి. కనీసం 6 వారాల పాటు ఈ జ్యూస్ క్రమం తప్పకుండా తాగితే ఎన్నో అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి.
Also Read: ఈ కాంబినేషన్ ఫుడ్స్‌ని పొరపాటున కూడా కలిపి తినకండి... స్లో పాయిజన్ అయ్యే అవకాశం ఉంది
* సొరకాయ జ్యూస్ శరీర జీవ క్రియల్ని శుద్ధి చేస్తుంది. దీనివల్ల చర్మంపై ఉండే జిడ్డు కంట్రోల్ అవుతుంది. దీంతో మొటిమల సమస్య దూరమవుతుంది. ఉదయాన్నే సొరకాయ జ్యూస్ తాగడం వల్ల వయసు మీద పడే లక్షణాల్ని కనిపించకుండా చేస్తుంది.
* గుండె పని తీరును మెరుగుపరుస్తుంది సొరకాయ. దీనిలో జింక్ ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెజర్‌ని కంట్రోల్ చేసి గుండె ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది.
* సొరకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. సొరకాయ జ్యూస్ రక్త ప్రసరణ సజావుగా జరగడానికి సహాయపడుతుంది. స్ట్రెస్, ఆందోళన తగ్గించడంలో సహాయపడుతుంది.
* ఈ జ్యూస్‌లో యాసిడ్ లెవెల్స్ మెరుగుపరిచి... జీర్ణక్రియను మెరుగుపరిచే గుణాలుంటాయి. దీనివల్ల ఎసిడిటీ, కాన్ట్పిపేషన్ వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
* ఈ సొరకాయలో 96శాతం నీరు ఉండటం వల్ల, తిన్న ఆహానం మరింత శక్తివంతంగా తేలికగా జీర్ణం అవ్వడానికి బాగా సహాయపడుతుంది. తీవ్రమైన అతిసార, మధుమేహం ఉన్నవారికి కూడా సొరకాయ బాగా పనిచేస్తుంది. శరీరం అధిక మోతాదులో సోడియం నష్టపోకుండా చూస్తుంది.
* ఈ న్యాచురల్ డ్రింక్ డ్యూరెటిక్‌గా పనిచేస్తుంది. దీంతో యూరినరీ ఇన్ఫెక్షన్స్ నుంచి ఉపశమనం పొందవచ్చు. యూరిన్‌లో ఉండే యాసిడ్ కంటెంట్‌ని న్యూట్రలైజ్ చేయడం ద్వారా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. సొరకాయలో డ్యురెటిక్ నేచర్ మలినాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా మహిళల్లో యూరినరీ సమస్యలకు సొరకాయ జ్యూస్ చెక్ పెడుతుంది.
Also Read: https://telugu.abplive.com/health/can-apple-cider-vinegar-treat-warts-6496
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ఈ కథనానికి ‘abp దేశం’ ఎలాంటి బాధ్యత వహించదని గమనించగలరు.