News
News
X

ఆయుర్వేద చిట్కాలు: చలికాలంలో జలుబు, జ్వరాలను దూరం చేసే ఆహారాలు ఇవే!

చలికాలం వచ్చిందంటే జ్వరాలు వెంటాడుతాయి. వాటి నుంచి బయటపడాలంటే.. ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ ఆహారాలను తీసుకోండి.

FOLLOW US: 
Share:

చలి కాలం వచ్చిందంటే.. వ్యాధుల సీజన్ మొదలైనట్లే. ఎందుకంటే.. ఈ సమయంలోనే వైరస్‌లు, బ్యాక్టీరియాలు యాక్టీవ్ అవుతాయి. అంతేకాదు చలికాలం వాత, పిత్త, కఫ దోషాలు కూడా కారణం కావచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే, వాటి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే.. తప్పకుండా ఈ కింది ఆహారాలను మీ మెనూలో చేర్చుకోండి. 

శీతాకాలం ప్రారంభం నుంచి చివరి వరకు.. అంటే హేమంత రుతువు ఆరంభం నుంచి శిశిర రుతువు మొదలయ్యే వరకు వాత, కఫాలను సమతులంగా ఉంచడం అవసరం. కఫం సమతులంగా ఉంటే కీళ్ల ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, చర్మంలో నిగారింపు నిలిచి ఉంటుంది. కఫ దోషం ఏర్పడితే శ్లేష్మ సంబంధ అనారోగ్యాలు, బరువు పెరగడం, నీరసం వంటివి ఏర్పడతాయి. వీటిని నివారించాలంటే చలికాలంలో కొన్ని ఆహార నియమాలు పాటించడం తప్పనిసరి.

సీజన్లు మారుతున్న క్రమంలో ఆహారంలో కూడా మార్పులు తప్పనిసరిగా చేసుకోవాలి. ఇవి శరీరంలో దోషాలు ఏర్పడకుండా నివారించేందుకు అవసరం. శీతాకాలం ఆహారంలో గుడ్డు, నెయ్యితో చేసిన కిచిడి, వెచ్చని పాలు, నువ్వులు, చెరకుతో చేసిన పదార్థాలు, బాదం, వాల్నట్ వంటి డ్రైఫ్రూట్స్ చేర్చుకోవడం మంచిది. మాంసాహారులైతే చికెన్ సూప్, నెయ్యితో వండిన ఆకుకూరలు తప్పనిసరిగా భోజనంలో భాగం చేసుకోవాలి. తులసి, లెమన్ గ్రాస్, అల్లం వంటి హెర్బ్స్ తో చేసిన గ్రీన్ టీ తరచుగా తీసుకోవాలి. ఇవన్నీ కూడా శీతాకాలంలో ఇమ్యూనిటి పెంచేందుకు దోహదం చేసే ఆహారాలు.

  • వీటిలో బెల్లం శరీరంలో వేడి పెంచుతుంది. జీర్ణసంబంధ ఎంజైముల ఉత్పత్తికి, నిరోధక శక్తిని పెంపొందించడానికి మంచి ఆహారం.
  • కిచిడి మన సనాతన వంటకాల్లో ఒకటి. ఆవు నెయ్యితో బియ్యం, గింజధాన్యాలు, కూరగాయలు కలిపి వండిన ఈ పదార్థం ఒక సూపర్ ఫుడ్. శరీరానికి కావల్సిన అమైనోఆసిడ్స్ ను అందిస్తుంది. అంతేకాదు, ఇందులో తగినన్ని ప్రొటీన్లు కూడా ఉంటాయి.
  • నువ్వులు శరీరంలో వేడి పెంచే కొవ్వులను కలిగిన ఆహారం. వీటిలో ఐరన్, కాపర్, జింక్ రకరకాల విటమిన్లు కలిగిన మంచి ఆహారం. నిరోధక శక్తిని కూడా పెంపొందిస్తాయి.
  • ఈ కాలంలో ఆకుకూరలు పుష్కలంగా లభిస్తాయి. బచ్చలి, పాలకూర, మెంతి కూర, ఉల్లి ఆకు, వంటి ఆకుకూరలు తప్పకుండా తీసుకోవాలి. ఇవి ఇమ్యూనిటి పెంచడమే కాదు శరీరానికి అవసరమయ్యే వెచ్చదనాన్ని కూడా ఇస్తాయి.
  • పసుపు కలిపిన పాలను గోల్డెన్ మిల్క్ అని పిలుస్తారు. చలికాలంలో నిద్రకు ముందు తప్పనిసరిగా చిటికెడు పసుపు కలిపిన కప్పు పాలు తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. కీళ్లు గట్టిపడడం మాత్రమే కాదు, చలికాలంలో తరచు వేధించే ఇన్ఫెక్షన్లు దరి చేరకుండా నివారిస్తాయి.
  • చికెన్ సూప్ తీసుకోవడం కూడా చాలా మంచిది. దీని తయారీలో వాడే మసాలాలు శరీరంలో వేడి పుట్టిస్తాయి.
  • చలికాలంలో వేడిగా టీ, కాఫీ లు తాగడం చాలా సౌకర్యంగా అనిపిస్తుంది. కానీ వీటి బదులుగా తులసి, అల్లం, లెమన్ గ్రాస్ తో చేసిన హెర్బల్ గ్రీన్ టీ తీసుకోవడం మంచిది. ఈ పానీయం వెచ్చగా సౌకర్యంగా ఉండడం మాత్రమే కాదు ఆరోగ్యానికి మేలు కూడా చేస్తుంది.

Also Read: మూలశంక ఎందుకు వస్తుంది? పైల్స్‌ను నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్ వస్తుందా? నివారణ ఎలా?

Published at : 03 Jan 2023 09:06 PM (IST) Tags: Health Tips Winter Food Food for Winter

సంబంధిత కథనాలు

Parenting Tips: మీ పిల్లలు ఇలా ప్రవర్తిస్తున్నారా? మీరు మరింత అప్రమత్తంగా ఉండాలని అర్థం

Parenting Tips: మీ పిల్లలు ఇలా ప్రవర్తిస్తున్నారా? మీరు మరింత అప్రమత్తంగా ఉండాలని అర్థం

ఈ జ్యూసు రోజుకో గ్లాసు తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గడం ఖాయం

ఈ జ్యూసు రోజుకో గ్లాసు తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గడం ఖాయం

Blood Circulation: శరీరంలో రక్త సరఫరా సరిగా జరగకపోతే కనిపించే లక్షణాలు ఇవే - జాగ్రత్త

Blood Circulation: శరీరంలో రక్త సరఫరా సరిగా జరగకపోతే కనిపించే లక్షణాలు ఇవే - జాగ్రత్త

Heart Attack: రక్తనాళాల్లో కొవ్వు చేరకూడదనుకుంటే సజ్జలను మెనూలో చేర్చుకోండి

Heart Attack: రక్తనాళాల్లో కొవ్వు చేరకూడదనుకుంటే సజ్జలను మెనూలో చేర్చుకోండి

ఈ ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే ఛాతీలోని కఫం, దగ్గు త్వరగా తగ్గిపోతాయి

ఈ ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే ఛాతీలోని కఫం, దగ్గు త్వరగా తగ్గిపోతాయి

టాప్ స్టోరీస్

Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు

Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు

Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం

Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం

Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?

Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?

Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్

Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్