(Source: ECI/ABP News/ABP Majha)
Diabetes in Winter: చలికాలంలో డయాబెటిస్ తీవ్రత పెరుగుతుందా? కారణాలు ఇవే
Diabetes : బ్లడ్ షుగర్ శీతాకాలంలో పెరుగుతుందా. సమాధానం అవును అనే వస్తోంది. తాజాగా కొన్ని అధ్యయనాల్లో డయాబెటిస్ రోగుల్లో, శీతాకాలం రక్తంలో చక్కెర నిల్వలు పెరిగినట్లు వైద్య నిపుణులు గమనిస్తున్నారు.
Diabetes : వయసుతో సంబంధం లేకుండా అందరికీ డయాబెటిస్ అనేది కామన్ గా వచ్చే శారీరక రుగ్మతగా మారింది. ముఖ్యంగా భారతదేశంలో డయాబెటిస్ రోగుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు డయాబెటిస్ వచ్చేందుకు కారణంగా మారుతున్నాయి. సాధారణంగా శరీరంలో ఇన్సులిన్ స్థాయి తగ్గినప్పుడే మన రక్తంలో షుగర్ నిల్వ పెరుగుతుంది అప్పుడే మనకు డయాబెటిస్ పరిస్థితి ఏర్పడుతుంది. అయితే డయాబెటిస్ కి సంబంధించి వైద్య పరిశోధనలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. అలాంటి పరిశోధనల్లో తాజాగా ఒకటి ఆసక్తికరంగా బయటపడింది. ఇందులో ముఖ్యంగా శీతాకాలంలో మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిలో కొద్దిగా తేడాలు ఉన్నాయని పరిశోధకులు తేల్చారు. దీనివల్ల ఈ కాలంలో డయాబెటిస్ రోగులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
చలికాలంలో డయాబెటిస్ ఎందుకు పెరుగుతుంది?
శీతాకాలంలో చల్లగా ఉండటం వలన శారీరక శ్రమ చేయడం కూడా తగ్గుతుంది. అంతే కాదు చలికాలంలో మనం తీసుకునే ఆహారం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిపై ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా డయాబెటిస్ రోగులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంతేకాదు విపరీతమైన చలి కారణంగా మీ గ్లూకోజ్ స్థాయిలు ప్రభావితం కావచ్చు. తక్కువ ఆక్సిజన్ సరఫరా, సంకోచించిన రక్త నాళాల కారణంగా కూడా మీ రక్తంలో చక్కెర స్థాయి పెరిగేందుకు దోహదపడుతుంది. డయాబెటిస్ నిర్వహణ అనేది లైఫ్ స్టైల్ మార్పుల మీద ఆధారపడి ఉంటుంది. అంతేకాదు వర్కవుట్‌లను వాయిదా వేయడం. ఆహారపు అలవాట్లను మార్చడం, కేలరీలు పెరగడం వంటివి శరీరంలో గ్లూకోజ్ స్థాయి పెరగడానికి కొన్ని కారణాలుగా మారుతున్నాయి.
చలికాలం కోసం డయాబెటిస్ నివారణ చిట్కాలు:
చలికాలంలో చురుకుగా ఉండండి: వ్యాయామం చేయడం దాటవేయవద్దు. చలికాలంలో రోజుకు కనీసం 20 నిమిషాల పాటు వ్యాయామాలు లేదా యోగా సాధన చేయడం చాలా ముఖ్యం. శారీరకంగా చురుకుగా ఉండటానికి ప్రయత్నించండి, తద్వారా శరీరంలో సరైన కదలిక ఉంటుంది.
షుగర్ స్థాయిని క్రమం తప్పకుండా పర్యవేక్షించండి: ప్రతిరోజూ మీ గ్లూకోజ్ స్థాయిలను తనిఖీ చేసుకోండి. అందువల్ల, మీ శరీర ఉష్ణోగ్రత సాధారణంగా ఉండేలా చూసుకోండి. క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోండి. ఇన్సులిన్ స్థాయిని అదుపులో ఉంచడానికి ఆకు కూరలు, బీట్‌రూట్, క్యారెట్ వంటి ఆహారాలను మీ డైట్ లో చేర్చండి. చల్లని ఉష్ణోగ్రతలు మీ శరీరాన్ని ఒత్తిడికి గురి చేస్తుంది. చలి వాతావరణంలో ఉన్ని దుస్తులను ధరించండి.
ఒత్తిడిని తగ్గించుకోండి:
ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు లేదా ప్రియమైనవారితో నాణ్యమైన సమయాన్ని గడపడం వంటి కార్యకలాపాలలో పాల్గొనండి. అలాగే డయాబెటిస్ ఉన్నవారు నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో మెడిసిన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా డయాబెటిస్ రోగులు ఎప్పటికప్పుడు బ్లడ్ షుగర్ టెస్టులు చేయించుకోవాలి. అప్పుడే మీరు శీతాకాలంలో డయాబెటిస్ తో యుద్ధం చేసే వీలుంటుంది. డయాబెటిస్ బాధితులు కేవలం శీతాకాలంలోనే కాదు మిగతా అన్ని కాలాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి.
Also Read : ఈ డ్రింక్‌తో బరువు తగ్గొచ్చు.. షుగర్ కూడా కంట్రోల్ చేయొచ్చు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply