Weight Loss Drink : ఈ డ్రింక్‌తో బరువు తగ్గొచ్చు.. షుగర్ కూడా కంట్రోల్ చేయొచ్చు
Weight Loss Drink Recipe : బరువు తగ్గడానికి, మధుమేహంతో పోరాడటానికి, రక్తపోటును అదుపులో ఉంచగలిగే ఓ డ్రింక్ రెసిపీ ఇక్కడ ఉంది.
Healthy Drink Recipe : మన శరీరంలో ఆరోగ్యకరమైన మార్పులు గమనించాలంటే.. ముందు దానిని డిటాక్స్ (Detox) చేయాలి. శరీరంలోని టాక్సిన్లను అలాగే ఉంచి.. ఎన్ని మందులు వేసినా.. ఎన్ని క్రిములు పూసినా.. ఎన్ని వ్యాయామాలు చేసినా అది వ్యర్థమే. మీ మొఖం మెరియాలంటే మేకప్ వేసుకోవడం కాదు.. ముందు చర్మానికి అవసరమైన డిటాక్స్ చేయాలి. శరీరంపైనున్న మృతకణాలు (Dead Skin Cells) పోవాలి.. లోపలి నుంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. సీరమ్, మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ వంటి రోటీన్ అలవాటు అయితే.. గ్లో న్యాచురల్‌గానే వస్తుంది. ఇవన్నీ పని చేయాలంటే ముందు మాత్రం డిటాక్స్ చేయాలి. జుట్టుకు కూడా అంతే ముందు లోపలి నుంచి శరీరాన్ని క్లియర్ చేసుకుని.. అప్పుడు దానికి సంబంధించిన చికిత్సలు ఫాలో అవ్వాలి.
ఆరోగ్య ప్రయోజనాలు(Health Benfits) పొందాలంటే కూడా ముందు శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపాలి. అప్పుడు వాటికి సంబంధించిన మందులు వేసుకుంటే మెరుగైన ఫలితాలు పొందవచ్చు. లేదంటే అంతా బురదలో పోసిన పన్నీరే అవుతుంది. అయితే మీ పూర్తి శరీరాన్ని డిటాక్స్ చేయడానికి, ఆరోగ్యప్రయోజనాలను అందించే ఓ డ్రింక్ (Weight Loss Drink Recipe) రెసిపీ ఇక్కడ ఉంది. మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలి? ఎప్పుడు దీనిని తీసుకుంటే మంచిది? దీనితో ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
ఆపిల్ సైడర్ వెనిగర్ - 2 స్పూన్స్
నిమ్మరసం - 1 టీ స్పూన్
తేనె - పావు స్పూన్
దాల్చిన చెక్క పొడి - 1 టీస్పూన్
నీరు - 1 గ్లాసు
తయారీ విధానం..
ఈ డ్రింక్‌ను తయారు చేయడం చాలా తేలిక. కేవలం ఒక్క నిమిషంలో దీనిని తయారు చేసుకోవచ్చు. గ్లాసు తీసుకుని.. దానిలో ఆపిల్ సైడర్ వెనిగర్, నిమ్మరసం, తేనె, దాల్చినచెక్క పొడి వేసి బాగా కలపాలి. దానిలో నీరు వేయాలి. ముందుగా పదార్థాలు అన్ని కలిపి.. నీరు వేస్తే.. అన్ని బాగా మిక్స్ అవుతాయి. అంతే శరీరాన్ని డిటాక్స్ చేసే హెల్తీ డ్రింక్ రెడీ. మీ ఆరోగ్యకమైన రోజును ప్రారంభించాలనుకుంటే.. పరగడుపున దీనిని తీసుకోండి. జిమ్‌కి వెళ్లేవారైతే.. సెషన్‌కు ముందు దీనిని తీసుకోవచ్చు. ఇది మెటాబాలిజం పెంచడంతో పాటు.. జిమ్‌లో మీరు కష్టపడేందుకు శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది.
Also Read : మధుమేహం ఉందా? అయితే ఈ టేస్టీ లంచ్ రెసిపీ మీకోసమే
ఈ అద్భుతమైన డిటాక్స్ డ్రింక్ (Detox Drink Recipe)మీ శరీరంలో కొవ్వును బర్న్ చేస్తుంది. సన్నగా ఉండేవారిలోనైనా.. లావుగా ఉండే వారిలోనైనా కొవ్వు అనేది అనేక ఆరోగ్య సమస్యలు తీసుకువస్తుంది. కాబట్టి మీరు హెల్తీ లైఫ్‌తో పాటు.. శరీరంలోని కొవ్వును కరిగించుకునేందుకు ఈ డ్రింక్ ట్రై చేయవచ్చు. అంతేకాకుండా జీవక్రియను మెరుగుపరుస్తుంది. తద్వార మీరు బరువు తగ్గుతారు. మీరు బరువు తగ్గడానికి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారా? అయితే ఈ డ్రింక్ మీ రోటీన్లో కచ్చితంగా చేర్చుకోండి. ఇది మీకు మెరుగైన ఫలితాలు ఇస్తుంది. అంతేకాదండోయ్.. మధుమేహంతో ఇబ్బంది పడేవారు దీనిని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి. ఇది రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. ఇన్ని ఆరోగ్యప్రయోజనాలు అందించే ఈ డ్రింక్‌ను వైద్యుని సూచనల మేరకు మీ డైట్లో చేర్చుకోండి. ఎందుకంటే ఆపిల్ సైడర్ వెనిగర్ కొందరికి అలెర్జీని కలిగించే ప్రమాదముంది. కాబట్టి మీరు దీనిని తీసుకునే ముందు వైద్యుడి సలహా కచ్చితంగా తీసుకోండి.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆
*T&C Apply*
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.