By: Haritha | Updated at : 26 Dec 2022 12:06 PM (IST)
(Image credit: Pixabay)
వేరు శెనగ పలుకులు తినాలా? వద్దా? అనే సందేహం చాలా మందికి వస్తుంది. ఎంతో మంది బరువు పెరుగుతామనే సందేహంతో వాటిని తీసి పక్కన పెట్టేస్తారు. వీటిని తింటే నిజంగా బరువు పెరుగుతారా? అంటే కాదనే చెబుతున్నారు పోషకాహార నిపుణులు. వీటిని తినడం వల్ల బరువు తగ్గే ప్రయాణం సులభం అవుతుందని అంటున్నారు. వాటిలో నూనె పుష్కలంగా ఉంటుంది కాబట్టి బరువు పెరుగుతామని చాలా మంది నమ్మకం. కేవలం ఈ కారణం వల్ల వాటిని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు.
వీటిలో ఏముంటాయ్?
100 గ్రాముల వేరుశెనగలో 567 కేలరీలు, 25 గ్రాముల ప్రోటీన్, 16 గ్రాముల కార్బోహైడ్రేట్, 50 గ్రాముల కొవ్వు ఉంటుంది. అలాగే ఫైబర్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ కూడా అధికంగా ఉంటాయి. పై డేటాను బట్టి వీటిలో ప్రొటీన్ అధికంగా లభిస్తుంది. ఇదంతా మొక్కల ఆధారిత ప్రొటీన్. కాబట్టి బరువు తగ్గడానికి సహకరిస్తుంది. ఈ అధిక ప్రొటీన్, పీచు పదార్థాలు పొట్ట నిండుగా అనిపించేలా ఎక్కువ కాలం ఉంచుతాయి. దీని వల్ల భోజనం తక్కువగా తింటాము. అంటే మనకు తెలియకుండానే బరువు తగ్గుతాము. ఇలాంటి నట్స్ తినే వ్యక్తులు త్వరగా బరువు పెరగడని కొన్ని అధ్యయనాలు కనుగొన్నాయి. అలాగే గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశాలను కూడా ఇవి తగ్గిస్తాయి. శరీరంలోని విష వ్యర్థాలను అడ్డుకునే సత్తా వీటికే ఎక్కువ. తొక్కలు తీయకుండానే వేరుశెనగ పలుకులను తినాలి. ఎందుకంటే ఆ పొట్టులోనే ఫైబర్ ఉంటుంది. ఇవి అధిక బరువును తగ్గిస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె పోటు రాకుండా అడ్డుకుంటాయి.
అలెర్జీలు ఎందుకు?
వేరుశెనగ శరీరానికి పడితే ఎంత మేలు చేస్తుందో, పడకపోతే అంత కీడు చేస్తుంది. కొందరికి వీటి అలెర్జీ ఉంటుంది. అలాంటి వారు తినకపోవడమే మంచిది. వీటి వల్ల కలిగేది చాలా తీవ్రమైన అలెర్జీ. వేరుశెనగలో అరాచిణ్, కోనరాచిన్ అనే రెండు ప్రొటీన్లు ఉంటాయి. ఇవి పడకపోవడం వల్లే వ్యక్తులకు అలర్జీ వస్తుంది. అలెర్జీ వచ్చిన వెంటనే వైద్యసహాయానికి తీసుకెళ్లకపోతే ప్రాణహాని కలుగవచ్చు. కాబట్టి వేరుశెనగ అలెర్జీ ఉంటే మాత్రం వాటిని పూర్తిగా మానయడం ఉత్తమం.
Also read: లక్షల్లో విలువ చేసే ఫంగస్, దీని కోసం చైనా సైనికుల చొరబాట్లు? ఏమిటీ ఫంగస్?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
సంతానోత్పత్తి అవకాశాలను పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే, స్త్రీ పురుషులిద్దరికీ పనిచేస్తాయి
రైస్ టీ ఎప్పుడైనా తాగారా? ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు
ఈ జ్యూస్ రోజూ తాగారంటే చర్మం మెరిసిపోవడం ఖాయం
Fatty liver Disease: కాలేయం ఆరోగ్యంగా ఉందా? లేక కొవ్వు పేరుకుపోయిందా? తెలుసుకోవడం ఎలా
Vitamin D: మనదేశంలో ప్రతి నలుగురిలో ముగ్గురికి విటమిన్ డి లోపం - చెబుతున్న టాటా ల్యాబ్స్ సర్వే
SI Constable Marks : ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్, ఆ 7 ప్రశ్నల విషయంలో మార్కులు కలపాలని బోర్డు నిర్ణయం
Australian Open 2023: 2023ను రికార్డుతో మొదలెట్టిన ‘జోకర్’ - పదో ఆస్ట్రేలియన్ ఓపెన్ సొంతం!
Nellore Rural MLA: నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు ! వైసీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?