Red Line On Tablet Strips: టాబ్లెట్స్ స్ట్రిప్‌పై రెడ్ మార్క్ ఎందుకు ఉంటుంది? అది ఎంత డేంజరో తెలుసా?
Red Line On Tablet Strips: మనం ఆరోగ్యం బాలేనప్పుడు టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటాం. వాటి అట్టలపై రకరకాల గుర్తులు ఉంటాయి. అవేమీ పట్టించుకోం. వచ్చిన రోగం తగ్గిందా లేదా అనేది మాత్రమే చూస్తాం.
Red Mark Line On Tablet Strips: ఏ మాత్రం ఆరోగ్యం బాగాలేదని తెలిసినా వెంటనే గుటుక్కున ట్యాబ్లెట్లు మింగేస్తాం. డాక్టర్ సలహాతో పని లేకుండా సంప్రందించకుండా సొంతగా తీసుకుంటూ ఉంటాం. కొన్ని టాబ్లెట్లు మెడికల్ షాప్స్‌లో తీసుకుని వేసుకోవచ్చు. ఇంకొన్ని మాత్రం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అసలు మనం తీసుకోకూడదు.. మెడికల్ షాప్స్ వాళ్లు కూడా అమ్మకూడదు. మరి ఆ టాబ్లెట్స్ ఏంటన్నది మనకెలా తెలుస్తుంది..? ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందా..?
టాబ్లెట్స్ అట్టపై ఉండే రెడ్ మార్క్ లైన్ వెనుక ఉన్న అర్థం ఇదా.. ?
హాస్పిటల్‌కు అనారోగ్యంతో వెళ్లినప్పుడు వైద్యులు అనేక టాబ్లెట్స్ రాస్తుంటారు. వాటిపై రకరకాల గుర్తులుంటాయి. అలాంటి గుర్తుల్లో రెడ్ మార్క్ లైన్ కూడా ఒకటి. ఆ రెడ్ మార్క్ ఏం సూచిస్తుందన్నది డాక్టర్లకు తెలుసు కానీ వాళ్లు మనతో పెద్దగా ఆ విషయాన్ని చెప్పరు. అయితే ఆ రెడ్ మార్క్ గుర్తున్న టాబ్లెట్ల విషయంలో మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ టాబ్లెట్లను డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు. అలా వాడితే కొన్ని సీరీయస్ కాంప్లికేషన్స్ ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఆ హెచ్చరిక గుర్తుగానే రెడ్ మార్క్ లైన్‌ను టాబ్లెట్లపై ఫార్మా కంపెనీలు ముద్రిస్తుంటాయి.
రెడ్ ముద్ర ఉన్న వాటిని డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాప్ వాళ్లు కూడా అమ్మడానికి లేదు. ముఖ్యంగా ఈ రెడ్ లైన్‌ను యాంటిబయోటిక్స్ టాబ్లెట్స్ అట్టల మీద ముద్రిస్తుంటారు. వాటిని మితంగా.. వాడకపోతే విపరీతమైన అనారోగ్య సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంది. మనం ఇకపై మెడికల్ షాప్స్‌కు వెళ్లి ఏ ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్లు తీసుకోవాల్సి వస్తే.. అందులో రెడ్ మార్క్ ఉన్నవి ఉంటే వాడే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కూడా రెడ్ మార్క్ లైన్ ఉన్న టాబ్లెట్లను నేరుగా వాడొద్దని సూచిస్తూ ట్వీట్ కూడా చేసింది.
You can prevent antibiotic resistance!
— Ministry of Health (@MoHFW_INDIA) March 10, 2024
A RED LINE on the strip of medicines implies that the medicine should not be consumed without a doctor's prescription.#SwasthaBharat #AntibioticResistance pic.twitter.com/zo7SooaiN9
ఈ రెడ్ మార్క్ లైన్‌తో పాటు మరి కొన్ని గుర్తులు కూడా టాబ్లెట్ల అట్టలపై ఉంటాయి. వాటిల్లో ఒకటి “Rx”. ఈ గుర్తు ఉన్న వాటిని కూడా డాక్టర్స్ సలాహా మేరకు.. ప్రిస్క్రిప్షన్ తీసుకొని వెళ్లి మాత్రమే కొనుగోలు చేసి వాడాలి.
టాబ్లెట్ల అట్టపై "NRx" అని ఉంటే..?
ఈ “NRx” గుర్తు ఉన్నవి పేషెంట్లకు వైద్యులు రాయాలంటే వారికి ప్రత్యేకమైన లైసెన్స్ కూడా ఉండాలి. ఇవి నార్కోటిక్స్ డ్రగ్స్ కిందకు వస్తాయి. వీటి అమ్మకం, వాడకంపై ప్రత్యేకమైన నిబంధనలు, ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అందుకే ఏ వైద్యుడు పడితే ఆ వైద్యుడు వీటిని ప్రిస్క్రైబ్ చేయడానికి ఉండదు.
టాబ్లెట్ల అట్టపై “XRx” ఉంటే..?
టాబ్లెట్ల అట్టపై “XRx” అని ఉందంటే.. ఆ మందులు రోగి వేసుకోవడానికి లేదు. వైద్యులు మాత్రమే నేరుగా రోగికి అందిస్తారు. ఈ మందులు ప్రిస్క్రిప్షన్‌లో వైద్యులు రాసినప్పటికీ బయట మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయడానికి లేదు. వీటిని నేరుగా డాక్టర్ దగ్గర మాత్రమే తీసుకోవాలి. ఈ గుర్తులు సూచించే విషయాలను జ్ఞాపకం ఉంచుకొని ఇకపై టాబ్లెట్స్ వినియోగించాలి. వీటితోపాటు టాబ్లెట్లు లేదా సిరఫ్‌లు కొనే ముందు వాటి ఎక్స్‌పైరీ డేట్ కూడా సరి చూసుకోవాలి. చిన్న పిల్లల కోసం తీసుకునే సిరఫ్‌ల డోసేజ్ తదితరాలను ఒకసారి క్రాస్ చెక్ చేసుకొనే వాడాలి.
Also Read: ప్రసవానికి ముందు తల్లికి చికెన్ గున్యా.. పుట్టిన బేబికి అరుదైన వ్యాధి, కారణం అదేనట