Hyperthyroidism: కళ్లు పొడిబారుతున్నాయా? జాగ్రత్త, హైపర్ థైరాయిడ్ కావచ్చు, ఇలా చేస్తే సేఫ్
థైరాయిడ్ సమస్యలు కళ్ళని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. దీని వల్ల కళ్ళు మంట, దురద వంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఎక్కువ సేపు స్క్రీన్ చూడటం వల్ల కొంతమంది కళ్ళు పొడిబారిపోతాయి. కంప్యూటర్ చూడటం వల్లే ఇలా అవుతుందని అనుకుంటారు. కానీ అది హైపర్ థైరాయిడిజం వల్ల కూడా ఇలా జరగొచ్చు. కళ్ళు దురద పెట్టడం, ఎక్కువగా రుద్దటం, మంటగా అనిపించడం హైపర్ థైరాయిడిజం లక్షణాలు. ఈ కళ్ళ సమస్యని గ్రేవ్స్ అని కూడా అంటారు. ఈ వ్యాధికి చికిత్స తీసుకున్న తర్వాత హైపో థైరాయిడిజం అభివృద్ధి చెందుతుంది. దీన్నే గ్రేవ్స్ ఆప్తాలోపతి అని పిలుస్తారు. ఇది మరింత ఎక్కువై హైపర్ థైరాయిడిజం వరకు వస్తుంది. గ్రేవ్స్ ఆప్తాలోపతి వల్ల కంటిలో అసౌకర్యం, ఏదో గుచ్చుకుంటున్న భావన కలుగుతుంది. దృష్టిలో కూడా మార్పులు చోటుచేసుకుంటాయి.
హైపర్ థైరాయిడిజం కళ్ళను ఎలా ప్రభావితం చేస్తుంది?
హైపర్ థైరాయిడిజం వల్ల కళ్ళు పొడిగా మారిపోతాయి. ఇది డ్రై ఐ సిండ్రోమ్ లాగా అనిపిస్తుంది కానీ దానికి భిన్నంగా ఉంటుంది. డ్రై ఐ సిండ్రోమ్ కారణంగా కళ్ళు తగినంత కన్నీళ్ళను ఉత్పత్తి చేయలేవు. ఫలితంగా కళ్ళు పొడి బారిపోతాయి. హైపర్ థైరాయిడిజం అయితే కళ్ళు సాధారణంగానే కన్నీళ్ళు ఉత్పత్తి చేస్తాయి. నిజం చెప్పాలంటే సాధారణం కంటే ఎక్కువగా కన్నీళ్ళని ఉత్పత్తి చేస్తుంది. ఎక్కువగా కన్నీళ్ళు బయటకి పోవడం వల్ల పొడి కళ్ళు సమస్య ఏర్పడుతుంది.
హైపర్ థైరాయిడిజం అంటే ఏంటి?
మెడ, గొంతు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉండే ఎండోక్రైన్ గ్రంథులలో థైరాయిడ్ గ్రంథి ఒకటి. రోజువారీ జీవనానికి కావాల్సిన హార్మోన్లను ఇది విడుదల చేస్తుంది. అతిగా హార్మోన్లు విడుదల చేస్తే హైపర్ థైరాయిడిజం అంటారు. అదే తక్కువగా ఉత్పత్తి చేస్తే హైపో థైరాయిడిజం అని పిలుస్తారు. ఇవి రెండూ సమస్యలే. థైరాయిడ్ అధిక మొత్తంలో హార్మోన్లను విడుదల చేస్తే జీవక్రియ వేగవంతం అవుతుంది. హైపర్ థైరాయిడిజం లక్షణాలు హృదయ స్పందన రేటు పెరగడం, బరువు తగ్గడం, ఆకలి పెరగడం, ఆందోళన. హైపర్ థైరాయిడిజాన్ని యాంటిథైరాయిడ్ డ్రగ్స్, రేడియోధార్మిక అయోడిన్, బీటా బ్లాకర్స్, సర్జరీతో చికిత్స చేయవచ్చు.
థైరాయిడ్ ఉన్నప్పుడు కళ్ళు పొడబారిపోతే చికిత్స ఎలా?
ఐ డ్రాప్స్: పొడి కళ్ళ సమస్య నుంచి బయట పడేందుకు ఐ డ్రాప్స్ డాక్టర్లు సిఫార్సు చేస్తారు. ఇవి కళ్ళని తేమగా ఉంచేందుకు కన్నీళ్ళు ఉత్పత్తి సాధారణ స్థితికి వచ్చేలా చేస్తాయి. అయితే రెడ్ ఐ రిలీఫ్ అనే ఉత్పత్తులను నివారించడం మంచిది. ఎందుకంటే ఇవి పొడి కన్ను సమస్యని మరింత దిగజారుస్తాయి.
స్టెరాయిడ్ కంటి చుక్కలు: కంటి వైద్య నిపుణులు కళ్ళని తేమగా ఉంచడంలో సహాయపడే బలమైన స్టెరాయిడ్ డ్రాప్స్ సూచిస్తారు. ఇవి వాపు, చికాకు, మంటని తగ్గిస్తాయి. కానీ వీటిని కొద్ది రోజులు మాత్రమే ఉపయోగించడం సురక్షితం.
నోటి స్టెరాయిడ్స్: కొన్ని సార్లు ట్యాబ్లెట్స్ కూడా సూచిస్తారు. ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కంటి సమస్యల్ని దూరం చేస్తాయి. థైరాయిడ్ పరిస్థితికి చికిత్స చేసే ఎండోక్రినాలజిస్ట్ వీటిని సూచిస్తారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: సంతానం కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే ఈ రోజువారీ అలవాట్లు తప్పకుండా మానేయాల్సిందే