Covid Vaccination: కరోనా వ్యాక్సినేషన్‌పై సర్కార్ కీలక ప్రకటన.. ఇక వారు కూడా అర్హులే
2023 జనవరి నాటికి 15 ఏళ్లు నిండే పిల్లలు కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులేనని కేంద్రం ప్రకటించింది.
కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. 2023 జనవరి నాటికి 15 ఏళ్లు నిండిన వారందరూ కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులేనని ప్రభుత్వం తెలిపింది. 15- 18 ఏళ్ల మధ్య వయసు వారితో పాటు వీరు కూడా వ్యాక్సిన్ తీసుకునేలా చూడాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది.
Additional Secretary&Mission Director NHM writes a letter to states & UT's that "those attaining age of 15 years as on Jan 2023, are eligible for vaccine under 15-18 age group. It has been clarified that those born in years 2005, 2006 & 2007 are eligible in 15-18 years' category" pic.twitter.com/RI5Y2A9dgc
— ANI (@ANI) January 27, 2022
2005, 2006, 2007 సంవత్సరాల్లో పుట్టిన వారు కూడా ఈ 15-18 ఏళ్ల కేటగిరీలోకే వస్తారని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఈ కేటగిరీకి చెందిన 59 శాతం మంది పిల్లలు తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్నట్లు పేర్కొంది.
దిల్లీలో సడలింపు..
మరోవైపు దిల్లీలో కరోనా ఆంక్షలను సడలించింది అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.
- ప్రస్తుతం అమలులో ఉన్న వారాంతపు కర్ఫ్యూను ఎత్తివేసింది ప్రభుత్వం.
- దుకాణాలపై ఉన్న సరి-బేసి విధానాన్ని కూడా తొలగించింది.
- నగరంలోని రెస్టారెంట్లు, బార్లకు 50 శాతం సామర్థ్యంతో కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అనుమతి.
- ప్రభుత్వ కార్యాలయాలు కూడా 50 శాతం సామర్థ్యంతో కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు.
- బహిరంగ ప్రదేశాల్లో జరిగే పెళ్లి వేడుకలకు అత్యధికంగా 200 అతిథులు హాజరు కావచ్చు.
- ఇండోర్ వెన్యూలలో 50 శాతం సామర్థ్యంతో వేడుకలు నిర్వహించుకోవచ్చు.
- అయితే పాఠశాలల పునఃప్రారంభంపై మాత్రం తదుపరి చర్చల్లో నిర్ణయం తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
Also Read: Omicron Sub-Variant BA.2: బీ అలర్ట్.. దేశంలో ఆ వేరియంట్ వ్యాప్తే ఎక్కువగా ఉందట!
Also Read: Arunachal Boy Missing Case: అరుణాచల్ ప్రదేశ్ బాలుడ్ని భారత ఆర్మీకి అప్పగించిన చైనా