Corona Updates: ఏపీలో కనిష్టానికి కరోనా కేసులు... కొత్తగా 75 కేసులు, ఒకరు మృతి
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 75 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 1517 యాక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల వ్యవధిలో 21,211 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 75 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గడచిన 24 గంటల్లో ఒకరు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,480కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 154 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,59,882 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 1517 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
#COVIDUpdates: As on 20th December, 2021 10:00AM
— ArogyaAndhra (@ArogyaAndhra) December 20, 2021
COVID Positives: 20,72,984
Discharged: 20,56,987
Deceased: 14,480
Active Cases: 1,517#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/TzIPVMuAFY
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,75,879కి చేరింది. గడచిన 24 గంటల్లో 154 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 1517 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,480కు చేరింది.
Also Read: న్యూ ఇయర్ వేడుకలకు ఇండియాలో టాప్ 11 ప్రదేశాలివే...
దేశంలో కొత్తగా 6,563 కరోనా కేసులు నమోదుకాగా 132 మంది మరణించారు. 8,077 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆదివారం 8,77,055 కరోనా శాంపిళ్లను పరీక్షించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 82,267కు చేరింది. 572 రోజుల్లో ఇదే అత్యల్పం. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.24గా ఉంది. రికవరీ రేటు 98.39 %గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యధికం.
వ్యాక్సినేషన్..
దేశంలో టీకా పంపిణీ వేగంగా కొనసాగుతోంది. ఆదివారం మరో 15,82,079 మందికి వ్యాక్సిన్లు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,37,67,20,359కి చేరింది.
వ్యాక్సినేషన్‌లో అండమాన్ అండ్ నికోబార్ దీవులు అరుదైన మైలురాయిని చేరుకున్నాయి. అర్హులైన వారందరికీ రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసి రికార్డ్ సృష్టించింది. ఈ మేరకు అక్కడి పాలకవర్గం ట్వీట్ చేసింది. కేవలం కొవిషీల్డ్ వ్యాక్సిన్‌తోనే ఈ ఘనత అందుకోవడం విశేషం. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైన జనవరి 16నే ఈ దీవుల్లోనూ టీకాలు ఇవ్వడం మొదలుపెట్టారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం అండమాన్ నికోబార్ దీవుల్లో మొత్తం 2.87 లక్షల మంది అర్హులు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ దీవుల్లో మొత్తం జనాభాలో 74.67 శాతం మందికి టీకాలు అందాయి.
Also Read: ఐశ్వర్య రాయ్‌కు ఈడీ షాక్.. పనామా పత్రాల కేసులో సమన్లు జారీ
ఒమిక్రాన్ కేసులు..
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 153కు చేరింది. మహారాష్ట్రలో కొత్తగా 6 ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా గుజరాత్‌లో 4 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 11 రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ వ్యాపించింది. దిల్లీ (22), రాజస్థాన్ (17), కర్ణాటక (14), తెలంగాణ (20), గుజరాత్ (11), కేరళ (11), ఆంధ్రప్రదేశ్ (1), చండీగఢ్ (1), తమిళనాడు (1), బంగాల్ (1). ఒమిక్రాన్ వేరియంట్‌పై అప్రమత్తంగా ఉండాలని ఎయిమ్స్ చీఫ్ డా. రణ్‌దీప్ గులేరియా హెచ్చరించారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునేలా ఉండకూడదని ముందుగానే తేరుకోవాలని ఆయన సూచించారు.
Also Read: స్పీడ్ పెంచిన ఒమిక్రాన్.. 1.5 నుంచి 3 రోజుల్లోనే కేసులు డబుల్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి