Coriander Water:కొత్తిమీర నీరు ఎవరు తాగితే ప్రమాదం- ఏం జరుగుతుంది?
Coriander Water: కొత్తమీర నీరు ఆరోగ్యానికి ఎంత ప్రయోజనమో అది పడకుంటే అంత ప్రమాదం. అందుకే కొందరు ఈ నీరు తీసుకోకపోవడమే ఉత్తమం. ఆ వివరాలు ఇక్కడ చూడొచ్చు.

Who should not drink coriander water : కొత్తిమీర దాదాపు ప్రతి ఇంట్లో విరివిగా వాడుతుంటారు. వంటల్లో వేయాడనికే ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. లేకుంటే పచ్చడి చేసుకొని తింటారు. దీని ఔషధ లక్షణాలు తెలిసిన వాళ్లు మాత్రం వేర్వేరు విధాలుగా తీసుకునేందుకు ఇష్టపడతారు.
కొత్తిమీర ఒక్కటే కాదు. దాని గింజలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అందుకే వాటిని నానబెట్టి లేదా ఉడకబెట్టడం ద్వారా వచ్చే నీటిని తాగుతుంటారు. ఇలా చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు వైద్యనిపుణులు. ఇలా కొత్తిమీర వల్ల మంచి ప్రయోజనాలే కాదు కొందరు తాగితే చెడు ప్రభావం కూడా చూపుతాయట. అందుకే ఎవరికి ప్రయోజనం, ఎవరు వీటికి దూరంగా ఉండాలో చూద్దాం.
కొత్తిమీర నీరు వల్ల కలిగే ప్రయోజనాలు
జీర్ణశక్తిని పెంచుతుంది: కొత్తమీర నీరు తీసుకుంటే జీర్ణాశయం పరిశుభ్రమవుతుంది. పేగుల్లో ఉన్న మలినాలను తొలగించి ఆమ్లాల ఉత్పత్తిని పెంచుతుంది. ఫలితంగా అజీర్ణం, కడుపు ఉబ్బరంగా ఉండే సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
షుగర్ లెవల్స్ నియంత్రణ: కొత్తిమీర నీరు తాగడం వల్ల శరీరంలోని చక్కెర నియంత్రణలో ఉంటుంది. చక్కెర్‌పై ప్రభావం చూపే ఎంజైమ్‌లను కంట్రోల్ చేస్తుంది.
దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ: కొత్తిమీర నీటిలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అందుకే బాడీలో జరిగే ఆక్సీకరణ ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కోగలదు. దీని వల్ల దీర్ఘకాలికంగా వచ్చే వ్యాధుల నియంత్రణ యూజ్ అవుతుంది. మనిషి ఆరోగ్యవంతంగా, యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది.
దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి
కొత్తిమీర ఆరోగ్య ప్రయోజనాలనే కాదు కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేకుంటే సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అలెర్జీ రావచ్చు: కొందరికి ఈ కొత్తిమీర నీరు తాగడం వల్ల అలెర్జీ రావచ్చు. ఈ నీరు తాగినప్పుడు చర్మంపై దద్దుర్లు రావడం, దురదపెట్టడం, చర్మం వాయడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంది. అలాంటి వాళ్లు ఈ కొత్తిమీర నీరు తాగకపోవడం మంచిది. తాగిన వెంటనే అలెర్జీ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
గర్భవతులు: గర్భవతులు ఈ కొత్తమీర నీటికి దూరంగా ఉండాలి. అప్పటికే వారి శరీరంలో అనేక మార్పులు వస్తుంటాయి. అలర్జీలు అటాక్ చేస్తుంటాయి. అందుకే ఆటైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ సమయంలో రిస్క్ చేయడం సరికాదు.
బాలింతలు: కాన్పు తర్వాత కొన్ని నెలల వరకు కొత్తిమీర తీసుకోవడం కూడా మంచిది కాదు. అప్పటికే పిల్లలకు పాలు ఇస్తుంటారు. ఆ ప్రభావం పిల్లలపై పడుతుంది. అందుకే పిల్లలకు పాలు ఇచ్చే తల్లులు ఈ కొత్తమీర నీటికి దూరంగా ఉండాలి. లేకుంటే తల్లీ బిడ్డకు ఇద్దరికీ ప్రమాదకరం కావచ్చు.
లోబీపీ ఉన్న వ్యక్తులు : కొత్తిమీర నీరు రక్తపోటును తగ్గిస్తుంది. అందుకే లోబీపీ ఉన్న వ్యక్తులు దీనికి దూరంగా ఉండాలి. తీసుకోవాలని భావిస్తే మాత్రం వైద్యుడిని సంప్రదించిన తర్వాతే నిర్మయం తీసుకోవాలి.
కిడ్నీ వ్యాధిగ్రస్తులు: కొత్తిమీర కిడ్నీల పనితీరుపై కూడా ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది. ఇది మితిమీరి తీసుకుంటే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇప్పటికే కిడ్నీ వ్యాధితో ఇబ్బంది పడుతున్న వాళ్లు ఈ కొత్తిమీర జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది.
కొత్తిమీర వంటకాల రుచిని మరింత అమోఘం చేయడమే కాదు ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. అయితే కొత్తిమీర, కొత్తిమీర నీరు తీసుకోవడం వ్యక్తిగత ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.





















