అన్వేషించండి
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Covid 19 Guidelines: పిల్లల భద్రతపై కేంద్రం కొత్త రూల్స్.. పాటించకపోతే పాఠశాలల పని అంతే!
పిల్లల భద్రత, రక్షణపై కేంద్రం కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇవి పాటించకపోతే పాఠశాలల గుర్తింపును కూడా రద్దు చేస్తామని తేల్చిచెప్పింది.
పిల్లల భద్రతపై కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. సరైన మౌలిక సదుపాయాలు, మెడికల్ ఎయిడ్, పిల్లల ఫిర్యాదులపై సరైన చర్యలు తీసుకోకపోవడం, పిల్లలను బెదిరించడం, వివక్ష చూపడం, కొవిడ్ మార్గదర్శకాలను పాటించడం వంటి విషయాలపై కేంద్ర ఇక ప్రత్యేక దృష్టి పెట్టనుంది. ఇవి పాటించని పాఠశాలలకు జరిమానాలు విధించడం లేదా కొన్ని సందర్భాల్లో స్కూల్స్ గుర్తింపు రద్దు చేయడం వంటి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా పాఠశాలల భద్రతపై నిపుణుల కమిటీ ఈ మార్గదర్శకాలను తయారు చేసింది. పిల్లల భద్రత విషయంలో పాఠశాలల యాజమాన్యం జవాబుదారీతనంగా ఉండాలని, ఇందుకు సరైన మార్గదర్శకాలను ఇవ్వాలని ఓ వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. ఆ మార్గదర్శకాలు ఇవే.
- పాఠశాలలో విద్యార్థి అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆ చిన్నారి భద్రత, రక్షణ బాధ్యత పూర్తిగా ఆ స్కూల్ యాజమాన్యం లేదా ప్రిన్సిపల్‌పై ఉంటుంది. ఒక వేళ చిన్నారి భద్రతను పాఠశాల గాలికొదిలేస్తే అది జువైనల్ జస్టిస్ యాక్ట్ 2015ను ఉల్లంఘించినట్లు పరిగణిస్తాం.
- పిల్లలను భౌతిక దాడుల నుంచి కాపాడటమే కాదు వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి. ప్రస్తుతం ఉన్న పాఠశాల భద్రత మార్గదర్శకాలతో పాటు వీటిని కూడా అమలు చేయాలి.
- పాఠశాలలోని ఫర్నిచర్, పరికరాలు, స్టేషనరీ, స్టోర్ రూమ్‌లు, నీటి ట్యాంకులు, వంట గదులు, క్యాంటీన్, మరుగుదొడ్లు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు తదితర అన్ని ప్రాంతాలను పూర్తిగా శుభ్రపరచడమే కాకుండా డిస్‌ఇన్‌ఫెక్ట్ చేయాలి. లోపలి ప్రాంతంలోకి గాలి ధారాళంగా వచ్చేలా చూడాలి.
- వీటితో పాటు 2015 జువైనల్ జస్టిస్ యాక్ట్‌కు సంబంధించిన కొన్ని మార్గదర్శకాలను కూడా ఇందులో ప్రస్తావించారు. లైంగిక వేధింపులు, పోక్సో సవరణ బిల్లు 2019 కింద పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోవచ్చు.
- తల్లిదండ్రుల ఫిర్యాదులు పాఠశాలలు స్వీకరించకపోతే పేరెంట్స్- టీచర్స్ అసోసియేషన్.. బ్లాక్ ఎడ్యూకేషన్ ఆఫీసర్ (బీఈఓ)ను సంప్రదించవచ్చు. అక్కడ కూడా నిర్లక్ష్యం వహిస్తే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (డీఈఓ) దృష్టికి తీసుకువెళ్లొచ్చు. వాళ్లు జిల్లా పాలనాధికారి వద్దకు ఈ సమస్యను తీసుకువెళ్తారు. డీఎమ్ సదరు విషయంపై దర్యాప్తు చేపడతారు.
- ఒక వేళ ఈ మార్గదర్శకాలను పాఠశాలలు పాటించకపోతే.. ఓ ఏడాదిలో వారికి వచ్చే రెవెన్యూలో 1 శాతం జరిమానాగా విధిస్తారు. మరో రెండు మూడుసార్లు ఫిర్యాదు అందితే 3 నుంచి 5 శాతం మేర జరిమానా విధించే అవకాశం ఉంది. అంతేకాదు పాఠశాలలు కొత్త ఎడ్మిషన్లు తీసుకోవడంపై కూడా నిషేధం విధిస్తారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే డీఎం.. ఈ అంశాన్ని రాష్ట్ర/ యూటీ ఎడ్యూకేషన్ డిపార్ట్‌మెంటు ముందుకు తీసుకువెళ్తారు. ఇలా జరిగితే స్కూల్ గుర్తింపును కూడా రద్దు చేసే అవకాశం ఉంది.
- ఇక పాఠశాలలకు గుర్తింపు ఇచ్చే ముందు అన్ని రాష్టాలు, యూటీలు ఈ మార్గదర్శకాలను ప్రస్తావించాలని కేంద్రం పేర్కొంది.
- పాఠశాలలు టాస్క్ టీమ్‌లను ఏర్పాటు చేయాలి. అత్యవసర సహాయం అందించే టీమ్, జనరల్ సపోర్ట్ టీమ్, రవాణా మద్దతు బృందం, పారిశుద్ధ్య తనిఖీ బృందం వంటి వాటిని ఏర్పరచి వాటికి బాధ్యతలు అప్పగించాలి.
- రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసే మార్గదర్శకాలను అనుసరించి పాఠశాలలు ప్రామాణిక నియమావళిని రూపొందించుకునేలా ప్రోత్సహించాలి. భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు, తల్లిదండ్రులకు ఎప్పటికప్పడు సమాచారం ఇచ్చే వ్యవస్థ వంటి వాటిని ఈ నియమావళిలో చేర్చాలి.
- పాఠశాలలో విద్యార్థులు సహా అందరి ఆరోగ్య స్థితిగతులపై సమాచారాన్ని సేకరించాలి. అత్యవసర పరిస్థితుల్లో ఆరోగ్య సేవలు పొందేందుకు వీలుగా ప్రభుత్వ యంత్రాం గానికి చెందిన ఫోన్‌నెంబర్లు, కోవిడ్ సెంటర్ వివరాలు అందుబాటులో ఉంచుకోవాలి.
- హాజరు, సిక్ లీవ్స్ విధానంలో అనువైన మార్పులు చేసుకుని విద్యార్థులు, సిబ్బంది అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలి.
- కొవిడ్–19 సందేహాత్మక కేసులు ఉన్నప్పుడు ప్రభుత్వ ప్రొటోకాల్‌ను అనుసరించాలి.
Also Read: దిగొచ్చిన పుత్తడి, స్వల్పంగా పెరిగిన వెండి..ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలివే...
Also Read:ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
హైదరాబాద్
విశాఖపట్నం
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement