అన్వేషించండి

Beetroot Juice Benefits : పరగడుపునే ఈ జ్యూస్​ తాగితే చాలు.. అందానికి, ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదు

Beetroot Orange Juice Recipe : బీట్​రూట్​ జ్యూస్​తో అందం, ఆరోగ్యాన్ని పొందవచ్చని మీకు తెలుసా? అయితే దీనిని పరగడుపున తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

Beetroot Juice Recipe : బీట్​రూట్​ ఆరోగ్యానికి మంచిదని చాలా మంది తమ డైట్​లో తీసుకుంటారు. కొందరైతే దాని జోలికి కూడా వెళ్లరు. మీరు కూడా వారిలో ఒకరు అయితే మీరు కచ్చితంగా బీట్​రూట్​ జ్యూస్ ట్రై చేయండి. ఎందుకంటే మీరో ఓ కూరగాయనే తినట్లేదు అనుకుంటున్నారేమో.. కానీ దానివల్ల కలిగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల (Health Benefits)ను మీరు దూరం చేసుకుంటున్నారు. కేవలం ఆరోగ్యానికే కాదు.. అందంగా ఉండడంలో కూడా ఈ జ్యూస్ అద్భుతాలు చేస్తుంది. అయితే బీట్​రూట్​ రుచి కొందరికి నచ్చకపోవచ్చు. అలాంటి వారు జ్యూస్​ను ఈ విధంగా టేస్టీగా చేసుకోవచ్చు. దీనివల్ల మీరు కూడా బీట్​ రూట్​ జ్యూస్ ప్రయోజనాలు పొందవచ్చు. 

కావాల్సిన పదార్థాలు

బీట్​రూట్ - 2 (తొక్కను తీసి.. ముక్కలుగా కట్ చేసుకోండి)

కొత్తిమీర - కొంచెం

నారింజ - 1

నిమ్మకాయ -1 స్పూన్

నీరు తగినంత

తయారీ విధానం

బీట్​ రూట్, నారింజ రసం, నిమ్మరసం, కొత్తిమీర వేసి.. జ్యూసర్ లేదా గ్రైండర్​లో కలపండి. ఇది పలుచగా ఉండాలనుకుంటే మీరు దానిలో నీటిని వేయొచ్చు. దీనిని ఫిల్టర్ చేసి తాగినా.. చేయకుండా తాగిన కూడా ఆరోగ్యానికి మంచిదే. అయితే బీట్​రూట్​ తీసుకోవడం ఇష్టం లేనివారికి.. నారింజ ఫ్లేవర్​ మంచిగా ఉంటుంది. అంతేకాకుండా దీనిలోని విటమిన్ సి.. మీ అందానికి, ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు ఇస్తుంది. ఉదయాన్నే నిమ్మరసం తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. దీనిలో వినియోగించే ప్రతీ పదార్థం కూడా మీకు ఎన్నో హెల్త్​ బెనిఫిట్స్ ఇస్తుంది.

ముఖ్యంగా బీట్​రూట్​లో నైట్రేటు, విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమాల్లు దండిగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి. దీనిలోని నైట్రేట్లు.. నైట్రేట్ ఆక్సైడ్​లుగా మారి రక్తప్రసరణ వేగాన్ని మెరుగుపరుస్తాయి. తద్వారా రక్తపోటు(Blood pressure)లో అదుపులోకి వస్తుంది. దీనిలోని విటమిన్ సి మధుమేహాన్ని(Diabetes) కూడా అదుపులో ఉంచుతుంది. బీట్ రూట్​ జ్యూస్​ తాగేవారిలో వృద్ధాప్యంలో కూడా మెదుడలో రక్తప్రసరణ వేగంగా ఉండి.. ఆలోచనల్లో వారు చురుకుగా ఉన్నట్లు పలు అధ్యయనాలు నిరూపించాయి. 

బీట్​రూట్ చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పెదువులు పొడిబారకుండా చేస్తుంది. కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. గర్భిణీలలో కణజాలం పెరుగుతుంది. దీనిలోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్ సమ్మేళనాలు క్యాన్సర్ ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాడుతాయి. బీట్​రూట్​లోని ఫైబర్ ఆకలిని తగ్గించి.. టాక్సిన్లను బయటకు పంపుతుంది. తద్వార బరువు తగ్గవచ్చు. ఇన్ని ప్రయోజనాలున్న జ్యూస్​ను ప్రతిరోజూ.. పరగడుపునే తాగితే మంచి ఫలితాలు పొందవచ్చు. 

Also Read : బరువు తగ్గాలనుకుంటే కొత్తిమీర రైస్​ ట్రై చేయండి.. రెసిపీ ఇదే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget