అన్వేషించండి

పొడి దగ్గు వేధిస్తున్నప్పుడు, ఆయుర్వేదం చెప్పిన ఈ చిట్కాలను పాటించండి

పొడి దగ్గు ఎక్కువ కాలం వేధిస్తే ,గొంతులో మంట, చికాకు కలుగుతుంది.

ఇటీవలి కాలంలో చాలామంది వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు. దీనివల్ల జ్వరం, పొడి దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది.  పొడి దగ్గు ఎక్కువగా వేధిస్తున్నప్పుడు ఆయుర్వేదం సులువైన చిట్కాలను చెబుతోంది. దగ్గు 5 నుంచి వారం రోజుల్లో సాధారణంగా తగ్గిపోతుంది. అలాకాకుండా నాలుగు నుంచి ఆరు వారాలపాటు కొనసాగుతుందంటే దాన్ని సుదీర్ఘ దగ్గుగా అర్థం చేసుకోవాలి. అంటే ఇది ఒక క్రానిక్ డిసీజ్. సాధారణ దగ్గు మందులకు ఈ సుదీర్ఘమైన దగ్గు తగ్గదు. కాబట్టి ఈ దగ్గును తగ్గించేందుకు ఆయుర్వేదం కొన్ని చిట్కాలు చెబుతోంది. కాలుష్యం వల్ల, నాణ్యత లేని గాలి వల్ల కూడా రావచ్చు. ఇది మన రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది.

అల్లం టీ 
అల్లంలో శోథనిరోధక లక్షణాలు అధికం. పొడి దగ్గును, దీర్ఘకాలికంగా వేధిస్తున్న దగ్గును తగ్గించేందుకు నీటిలో అల్లం తరుగును వేసి మరిగించాలి. ఆ టీని వడకట్టి గ్లాసులో వేయాలి. తాగే ముందు ఒక స్పూను తేనెను కలపాలి. ఈ టీని రోజుకి రెండు మూడు సార్లు తాగడం వల్ల దగ్గు తగ్గుతుంది. తేనే సహజంగానే దగ్గును అణిచివేసే లక్షణాలను కలిగి ఉంటుంది. 

పసుపు పాలు 
పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికం.  కాబట్టి దీర్ఘకాలం పాటు వేధిస్తున్న దగ్గును వదిలించుకోవడానికి ఇది ఒక సులభమైన మార్గం. గోరువెచ్చని పాలలో ఒక టీ స్పూన్ పసుపు పొడిని వేసి బాగా కలిపి నిద్రపోవడానికి ముందు తాగాలి. దీన్నే ‘గోల్డెన్ మిల్క్’ అని కూడా పిలుస్తారు.

వెల్లుల్లి 
దగ్గును తగ్గించే గొప్ప లక్షణం వెల్లుల్లిలో ఉంది. పాలలో ఒక వెల్లుల్లి రెబ్బను వేసి మరిగించాలి. దానికి చిటికెడు పసుపు కూడా జోడించాలి. ఈ పానీయాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. పొడి దగ్గుకు ఇది సరైన చికిత్స. చల్లారాక తాగడం వల్ల ఫలితం ఉండదు.

తులసి టీ 
పవిత్రమైన తులసిలో యాంటీ టస్సివ్ లక్షణాలు ఉంటాయి. ఇది పొడి దగ్గును తగ్గించడంలో సహాయపడతాయి. తులసి ఆకులను కొన్ని నిమిషాలు నీటిలో వేసి మరిగించాలి. ఆ టీ ని వడకట్టి టేబుల్ స్పూన్ తేనె కలిపి తాగాలి. ఇలా ఈ టీ ని రోజుకి రెండు మూడు సార్లు తాగితే ఎంతో ప్రయోజనం.

ఉప్పునీరు
ప్రాచీన కాలం నుంచి దగ్గుకు ఉత్తమ పరిష్కారంగా చెబుతున్నది పుక్కిలించడం.  గోరువెచ్చని నీటిలో ఉప్పు కలుపుకొని ఆ నీటితో గార్గిలింగ్ చేయడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. ఆ నీటిని తాగకుండా  ఉమ్మేయాలి.

లికోరైస్ రూట్ 
ఆయుర్వేదంలో లైకోరైస్ మొక్క వేరుకు ప్రాధాన్యత ఉంది. ఈ లైకోరైజ్ వేరు పొడిని, దగ్గును తగ్గించడానికి వినియోగిస్తారు. నీటిలో కొన్ని నిమిషాల పాటు ఈ లికోరైజ్ వేరును నానబెట్టి తర్వాత వడకట్టి తాగితే మంచిది. లేదా గోరువెచ్చని నీటిలో లికోరైస్ వేరు పొడిని కలుపుకొని రోజుకు రెండు మూడు సార్లు తాగినా పొడి దగ్గు పోతుంది. అయితే ఈ వేరును గర్భిణీ స్త్రీలు, అధిక రక్తపోటు ఉన్నవారు మాత్రం తీసుకోకూడదు. 

Also read: తరచూ ముక్కు నుండి రక్తం కారుతుందా? అది ఆ తీవ్రమైన వ్యాధిని సూచిస్తుంది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Embed widget