అన్వేషించండి
Intestinal Worms : కడుపులో నులి పురుగులను దూరం చేసే ఇంటి చిట్కాలివే.. పిల్లలకే కాదు, పెద్దలకి కూడా
Home Remedies to Intestinal Worms : పొట్టలో పురుగులు ఉంటే కడుపు నొప్పి, ఆకలి తగ్గడం, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. మందులు లేకుండా ఉపశమనం కలిగించే ఇంటి చికిత్సలు ఇప్పుడు తెలుసుకుందాం.
నులిపురుగులను తగ్గించే ఇంటి చిట్కాలు(Image Source : Freepik)
1/6

ఒక చెంచా పచ్చి బొప్పాయి రసం తీసుకుని.. దానిలో తేనె కలిపి.. పరగడుపున ఉదయం తాగండి. పచ్చి బొప్పాయి కడుపులో ఉండే నులి పురుగులను చంపుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
2/6

ప్రతిరోజూ ఉదయం పరగడుపున 2 పచ్చి వెల్లుల్లి రెబ్బలను నమిలి నీరు తాగండి. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు కడుపులోని పురుగులను చంపడానికి సహాయపడతాయి.
3/6

కొన్ని తాజా వేపాకులను మెత్తగా నూరి రసం తీసి.. ఉదయం పరగడుపున తాగాలి. కావాలంటే వేప పొడి కూడా తీసుకోవచ్చు. వేప యాంటీ-పరాసిటిక్గా పనిచేస్తుంది. ఇది శరీరంలోని క్రిములను బయటకు పంపడానికి సహాయపడుతుంది.
4/6

ఒక గ్లాసు వేడి నీరు లేదా పాలల్లో అర టీస్పూన్ పసుపు కలిపి ఉదయాన్నే తీసుకోండి. పసుపు సహజ క్రిమినాశకి. ఇది పేగులను శుభ్రపరచడానికి, పురుగులను తొలగించడానికి సహాయపడుతుంది.
5/6

గుమ్మడికాయ గింజలను వేయించి తినండి. లేదా పొడి చేసి నీరు లేదా పాలతో తీసుకోండి. వాటిలో ఉండే సమ్మేళనాలు కడుపులోని పురుగులను శరీరం నుంచి బయటకు పంపడానికి సహాయపడతాయి.
6/6

చిటికెడు వామును బెల్లంతో కలిపి ఉదయం పూట తినండి. ఈ మిశ్రమం కడుపులో ఉండే పురుగులను చంపుతుంది. జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది.
Published at : 06 Aug 2025 07:15 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆట
ఆధ్యాత్మికం
శుభసమయం
రాజమండ్రి
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















