అన్వేషించండి
Fenugreek & Fennel Water Benefits : మెంతి , సోంపు నీరు కలిపి ఉదయాన్నే తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే.. ఈ 7 సమస్యలు దూరం
Herbal Drink : ఉదయాన్నే సోంపు, మెంతి నీటిని కలిపి తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయంటున్నారు. అవేంటో వాటితో కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.
బరువును తగ్గించడంలో హెల్ప్ చేసే డ్రింక్ ఇదే
1/7

మెంతులు, సోంపు నీరు జీవక్రియను వేగవంతం చేస్తుంది. ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగడం వల్ల కొవ్వు కరగడానికి సహాయపడుతుంది. రెగ్యులర్గా తీసుకుంటే బరువు తగ్గుతారు.
2/7

ఈ నీటిని తీసుకోవడం వల్ల మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి పొట్టను తేలికగా ఉంచుతుంది.
3/7

మెంతులు మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. రక్తంలో చక్కెరను కంట్రోల్ చేస్తాయి. సోంపు శరీరంలో గ్లూకోజ్ స్థాయిని సమతుల్యం చేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
4/7

మెంతులు, సోంపు నీరు మహిళల్లో హార్మోనల్ బ్యాలెన్స్ నిలబెట్టుకోవడానికి హెల్ప్ చేస్తాయి. ఇది పీరియడ్స్ రెగ్యులర్ చేయడంలో హెల్ప్ చేసి.. నొప్పిని తగ్గిస్తాయి.
5/7

చర్మం, జుట్టు కోసం ఉపయోగకరంగా ఉంటుంది. ఈ నీటిలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తాయి. ఇది చర్మానికి మెరుపును ఇస్తుంది. జుట్టుకు బలాన్ని అందిస్తుంది.
6/7

ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ సోంపును రాత్రిపూట నీటిలో నానబెట్టండి. ఉదయం ఈ నీటిని కొద్దిగా గోరువెచ్చగా చేసి వడకట్టండి. పరగడుపున నెమ్మదిగా తాగండి.
7/7

సోంపు, మెంతులు రెండూ యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది.
Published at : 17 Sep 2025 07:23 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆట
ఆధ్యాత్మికం
శుభసమయం
రాజమండ్రి
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















