అన్వేషించండి
Natural Remedies for Mucus : కఫం ఎక్కువైందా? దగ్గువంటి గొంతు సమస్యలను దూరం చేసే ఇంటి చిట్కాలు ఇవే
Home Remedies to Reduce Phlegm : ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం దగ్గు, జలుబు వంటి శ్వాస సమస్యలను పెంచుతుంది. అయితే దీనిని వంటింట్లో దొరికే కొన్ని చిట్కాలతో దూరం చేసుకోవచ్చు.
కఫాన్ని తగ్గించే ఇంటి చిట్కాలు ఇవే
1/7

అల్లంలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. వేడి వేడి అల్లం టీ తాగడం వల్ల శ్లేష్మం కరిగిపోతుంది. గొంతు నొప్పి కూడా తగ్గుతుంది.
2/7

పసుపులో ఉండే కర్కుమిన్ శ్లేష్మాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి సీజనల్ వ్యాధులను దూరం చేస్తుంది. కాబట్టి రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తాగడం మంచిది.
3/7

తేనె గొంతు నొప్పిని తగ్గిస్తుంది. మిరియాలు శ్లేష్మాన్ని తగ్గిస్తాయి. రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల శ్వాస సమస్యలు దూరమై.. ముక్కు దిబ్బడ తగ్గుతుంది.
4/7

వేడి నీటితో ఆవిరి పీల్చడం వల్ల శ్లేష్మం త్వరగా కరిగి ఛాతీలో పేరుకున్నది తగ్గిపోతుంది. వేడి నీటిలో పుదీనా నూనె కొన్ని చుక్కలు వేసి ఆవిరి పీల్చుకోవడం వల్ల మరింత ఎఫెక్టివ్‌గా ఉంటుంది.
5/7

తులసి ఒక సహజ యాంటీబయాటిక్‌గా పనిచేస్తుంది. తులసి ఆకులను నమలడం లేదా తులసి టీ తాగడం వల్ల శ్లేష్మం నెమ్మదిగా బయటకు వస్తుంది. కఫాన్ని దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది.
6/7

గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి దానితో పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. గొంతు నుంచి శ్లేష్మాన్ని దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది.
7/7

వెల్లుల్లిలోని యాంటీమైక్రోబియల్ లక్షణాలు కఫాన్ని దూరం చేయడంలో హెల్ప్ చేస్తాయి. దీన్ని పాలలో ఉడకబెట్టి తాగడం లేదా ఆహారంలో చేర్చుకోవడం వల్ల శ్లేష్మం తగ్గుతుంది. రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది.
Published at : 03 Sep 2025 09:52 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















