News
News
X

ఈ టీ రోజూ తాగితే థైరాయిడ్ సమస్యలు దూరం - చెబుతున్న ఆయుర్వేదం

మహిళలు అధికంగా ఎదుర్కొంటున్న సమస్య థైరాయిడ్ . దీనికి ఓ మసాలా టీతో చెక్ పెట్టొచ్చు.

FOLLOW US: 
Share:

ఆరోగ్యం బాగుండాలంటే శరీరంలోని ప్రతి అవయవం చక్కగా పనిచేయాలి. ఏ అవయవం తమ పనిని తగ్గించినా, లేక శృతిమించి చేస్తున్నా శరీరానికి ఏదో ఒక సమస్య తప్పదు.  థైరాయిడ్ గ్రంధి అధికంగా మహిళల్లో సమస్యలకు కారణం అవుతుంది. గొంతు దగ్గర చిన్న సీతాకోకచిలుక ఆకారంలో ఉండే గ్రంధి థైరాయిడ్. ఇది థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అయినా సమస్యే, తక్కువగా ఉత్పత్తి అయిన సమస్యే. అలా కాకుండా మన శరీరానికి తగినంత హార్మోన్లే విడుదల అయ్యేలా ఉండాలి. ఇందుకు  థైరాయిడ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారు రోజు కింద వివరించిన టీని చేసుకుని తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. 

థైరాయిడ్ గ్రంధి శరీరంలో రెండు ప్రధాన హార్మోన్లను విడుదల చేస్తుంది. అవి ట్రయోడోథైరోనిన్, థైరాక్సిన్. వీటినే సింపుల్‌గా T3, T4 అని పిలుచుకుంటారు. ఈ హార్మోన్లు శరీరంలోని దాదాపు ప్రతి కణంపై ప్రభావం చూపిస్తాయి. శరీరంలోని కొవ్వులు, కార్బోహైడ్రేట్ల వినియోగాన్ని ఇవి నియంత్రిస్తాయి. శరీర ఉష్ణోగ్రత, హృదయస్పందన రేటు, పునరుత్పత్తి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయి. ఈ హార్మోన్లు తగినంత ఉత్పత్తి కాకపోయినా, అవసరానికి మించి ఉత్పత్తి అయినా సమస్యలు వస్తాయి. ఈ హార్మోన్లు తగినంత ఉత్పత్తి కాకపోతే హైపోథైరాయిడిజం సమస్య వచ్చినట్టు, అతిగా ఉత్పత్తి అయితే హైపర్ థైరాయిడిజం సమస్య ఉన్నట్టు. ఈ సమస్యలు తరచుగా అయోడిన్ లోపం, ఆటో ఇమ్యూన్ సమస్యలు, అలాగే చెడు జీవనశైలి, కుటుంబ వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది.

ఆయుర్వేదం ఏం చెబుతోంది?
ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం థైరాయిడ్ సమస్య అలసట, బలహీనత,జీవక్రియ సరిగా జరగకపోవడం, రోగనిరోధక శక్తి లేకపోవడం వంటి వాటికి కారణం అవుతుంది. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు రోజూ ధనియాలతో చేసిన టీ ని తాగడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈ టీ ని చేయడం చాలా సులువు. రోజూ రెండుసార్లు తాగితే ఉత్తమ ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా పరగడుపున ఉదయాన్నే ఈ టీ తాగాలి.

ఇలా చేయాలి
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకొని ఒక స్పూను ధనియాలను వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం లేచాక ఆ మిశ్రమాన్ని స్టవ్ పై పెట్టి మరగబెట్టాలి. తరువాత వడకట్టి గ్లాస్ లో వేయాలి. గోరువెచ్చగా మారాక తాగే ముందు కాస్త తేనె కలుపుకొని తాగాలి. 

ధనియాల వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

Also read: అబ్బాయిలు జాగ్రత్త, ఇలాంటి వ్యాయామాలు చేస్తే టెస్టోస్టెరాన్ స్ఠాయిలు పడిపోతాయి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 15 Feb 2023 09:03 AM (IST) Tags: Thyroid Ayurvedam Tea for Thyroid Coriander seeds Tea

సంబంధిత కథనాలు

పొడి దగ్గు వేధిస్తున్నప్పుడు, ఆయుర్వేదం చెప్పిన ఈ చిట్కాలను పాటించండి

పొడి దగ్గు వేధిస్తున్నప్పుడు, ఆయుర్వేదం చెప్పిన ఈ చిట్కాలను పాటించండి

Eyes: కళ్లు పొడిబారిపోతున్నాయా? ఈ ఆయుర్వేద చిట్కాలతో సాంత్వన పొందండి

Eyes: కళ్లు పొడిబారిపోతున్నాయా? ఈ ఆయుర్వేద చిట్కాలతో సాంత్వన పొందండి

Diabetic Retinopathy: మధుమేహం వల్ల వచ్చే అంధత్వాన్ని అడ్డుకోవచ్చు, ఇవిగో ఆయుర్వేద చిట్కాలు

Diabetic Retinopathy: మధుమేహం వల్ల వచ్చే అంధత్వాన్ని అడ్డుకోవచ్చు, ఇవిగో ఆయుర్వేద చిట్కాలు

Cough: దగ్గుతో బాధపడుతుంటే కేవలం 10 నిమిషాల్లో ఇలా సిరప్‌ను ఇంట్లోనే తయారు చేసుకోండి

Cough: దగ్గుతో బాధపడుతుంటే కేవలం 10 నిమిషాల్లో ఇలా సిరప్‌ను ఇంట్లోనే తయారు చేసుకోండి

Constipation: మలబద్దకంతో ముప్పుతిప్పలు పడుతున్నారా? ఈ ఆయుర్వేద చిట్కాలు పాటించండి

Constipation: మలబద్దకంతో ముప్పుతిప్పలు పడుతున్నారా? ఈ ఆయుర్వేద చిట్కాలు పాటించండి

టాప్ స్టోరీస్

TSPSC Issue : తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య టీఎస్పీఎస్సీ రచ్చ ఖాయమా ? కఠిన చర్యలు తీసుకోబోతున్నారా?

TSPSC Issue :   తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య టీఎస్పీఎస్సీ రచ్చ ఖాయమా ? కఠిన చర్యలు తీసుకోబోతున్నారా?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు

రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు

Hindenburg Research: మరో బాంబ్‌ పేల్చిన హిండెన్‌బర్గ్‌, కొత్త రిపోర్ట్‌పై సిగ్నల్‌

Hindenburg Research: మరో బాంబ్‌ పేల్చిన హిండెన్‌బర్గ్‌, కొత్త రిపోర్ట్‌పై సిగ్నల్‌