News
News
వీడియోలు ఆటలు
X

Diabetic Retinopathy: డయాబెటిక్ రెటినోపతితో కంటి చూపు పోతుందా? ఆయుర్వేదంతో కళ్లను కాపాడుకోవచ్చా?

సైలెంట్ కిల్లర్స్ వ్యాధుల్లో మధుమేహానికి అగ్రస్థానం ఇవ్వవచ్చు. ఇది ఒకసారి వస్తే వదిలించుకోవడం కష్టం. షుగర్ లేవల్స్ అధికంగా ఉంటే కళ్ళని కూడా దెబ్బతీస్తుంది.

FOLLOW US: 
Share:

మధుమేహం తీవ్రమైన పరిస్థితి. ఇది కళ్ళతో సహా వివధ అవయవాల మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. డయాబెటిక్ వల్ల రెటినోపతి సంభవిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో లేనప్పుడు కళ్ళను ప్రభావితం చేసే సమస్య. రెటీనా వెనుక భాగంలోని కాంతి సున్నితమైన కణజాలానికి సంబంధించి రక్త నాళాలు దెబ్బతింటాయి. డయాబెటిక్ రెటినోపతిలో తేలికపాటి దృష్టి సమస్యలే కాకుండా ప్రారంభంలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. కానీ చివరికి అంధత్వానికి దారి తీయవచ్చు.

సెంటర్స్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం డయాబెటిస్ ఉన్న వారిని ప్రభావితం చేసే కంటి వ్యాధులు మాక్యులర్ ఎడెమా, కంటి శుక్లం, గ్లకోమా తో పాటు దృష్టి లోపానికి దారితీస్తుంది. ముందస్తు రోగనిర్ధారణ చేసుకుని చికిత్స తీసుకుంటే కంటి చూపును రక్షించుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2.2 బిలియన్ల మంది ప్రజలు దృష్టి లోపంతో బాధపడుతున్నారు. వారిలో 3 మిలియన్ల మందికి డయాబెటిక్ రెటినోపతి ఉంది. ఇందులో రెండు దశలు ఉన్నాయి.

ప్రాథమిక దశ: నాన్-ప్రొలిఫెరేటివ్ అని కూడా పిలుస్తారు. ఇందులో రెటీనాలోని రక్తనాళాల గోడలు బలహీనపడతాయి. రక్తం, ఇతర ద్రవాలను లీక్ అవడం వల్ల దృష్టి సమస్యలకు కారణమవుతాయి.

అడ్వాన్స్డ్ స్టేజ్: ఇది రెటీనాలో కొత్త రక్తనాళాలు పెరగడం జరుగుతుంది. పెళుసుగా ఉంటాయి. సులభంగా రక్తస్రావం అవుతుంది. కనుగుడ్డులో డార్క్ స్పాట్స్ కలిగిస్తుంది. రక్తస్రావం అనియంత్రంగా మారితే దృష్టి పూర్తిగా తగ్గిపోతుంది.

రెటినోపతి లక్షణాలు, సంకేతాలు

  • మసక మసకగా కనిపించడం
  • కంట్లో మచ్చలు
  • రంగులను గుర్తించలేకపోవడం
  • చీకటి, ఖాళీ ప్రదేశాల్లో కళ్ళు కనిపించకపోవడం
  • పూర్తిగా దృష్టి కనిపించకపోవడం
  • కళ్ళలో నొప్పి
  • చదవడంలో ఇబ్బంది

ఆయుర్వేదం ద్వారా డయాబెటిక్ రెటినోపతికి చికిత్స చేయవచ్చు. ఈ వ్యాధి దశలను బట్టి కన్ను మూడు దోషాలను కలిగి ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అనారోగ్యం ప్రమాదాన్ని పెంచే ప్రధాన కారకాలు మానసిక ఒత్తిడి, ఆహారం. ఇవి నాళాల ఆకృతిని దెబ్బతీస్తాయి. ఆయుర్వేదంలో రెటినోపతికి చికిత్స ఉంటుంది. ఆయుర్వేద మందులు రెటినోపతిని నిరోధించగలవు. మీ రోజువారీ ఆహారంలో ఈ పదార్థాలు చేర్చుకున్నారంటే రెటినోపతి పరిస్థితి నుంచి బయటపడొచ్చు.

ఆమ్లా

ఉసిరి లేదా ఇండియన్ గూస్బెర్రీ రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా తగ్గించడంలో సహాయపడుతుంది. డయాబెటిక్ డైట్లో భాగంగా ఆహారంలో ఉసిరి రసం, ఉసిరికాయ మురబ్బా, ఉసిరి పొడి లేదా ఉసిరికాయ పచ్చడిని జోడించవచ్చు.

గిలోయ్

గిలోయ్ లేదా గుడుచీ వేప, మామిడి వంటి పెద్ద చెట్లపై పెరుగుతుంది. ఆయుర్వేదం మధుమేహుల కోసం దీన్ని సిఫార్సు చేస్తుంది. దీని చేదు రుచి కఫ, పిత్త, మీద సమతుల్య ప్రభావాన్ని కలిగి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ పైరేటిక్ లక్షణాలు ఉన్నాయి.

త్రిఫల

సర్వరోగ నివారిణి త్రిఫల చూర్ణం. త్రిఫల గ్లైకేషన్ ఎంజైమ్‌ల నిరోధం ద్వారా మధుమేహ వ్యాధిగ్రస్తులను కాపాడుతుంది.

జీవనశైలి

ప్రాణాయామ పద్ధతులు అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కంటి చూపును మెరుగుపరచడం కోసం యోగాలోని ముఖ్యమైన భాగం. నిప్పు, చంద్రుడు, సూర్యుని వంటి నిర్ధిష్ట వస్తువు మీద దృష్టి పెట్టాలి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: అలసటగా ఉంటుందా? ఇది లోపించడం వల్లే కావచ్చు!

Published at : 19 May 2023 08:00 AM (IST) Tags: Ayurvedam Diabetic Retinopathy Ayurvedam Tips Retinopathy Reverse Tips Eyes Protection

సంబంధిత కథనాలు

Diabetes: షుగర్ వ్యాధిని అదుపులో పెట్టే అద్భుత ఔషధం ఇది, ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం

Diabetes: షుగర్ వ్యాధిని అదుపులో పెట్టే అద్భుత ఔషధం ఇది, ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం

Ayurvedam: ఫ్యాటీ లివర్ డీసీజ్‌ని నయం చేసే ఆయుర్వేద టీ- ఎలా తయారు చేయాలంటే

Ayurvedam: ఫ్యాటీ లివర్ డీసీజ్‌ని నయం చేసే ఆయుర్వేద టీ- ఎలా తయారు చేయాలంటే

Ayurvedic Fruits: ఆయుర్వేదంలో ఔషధాలుగా పరిగణించే పండ్లు ఇవే- వీటిని తింటే బోలెడు ప్రయోజనాలు

Ayurvedic Fruits: ఆయుర్వేదంలో ఔషధాలుగా పరిగణించే పండ్లు ఇవే- వీటిని తింటే బోలెడు ప్రయోజనాలు

Leftover Food: ఆయుర్వేదం ప్రకారం మిగిలిపోయిన ఆహారాన్ని ఎన్ని గంటల్లోపు తినాలో తెలుసా?

Leftover Food: ఆయుర్వేదం ప్రకారం మిగిలిపోయిన ఆహారాన్ని ఎన్ని గంటల్లోపు తినాలో తెలుసా?

Ayurvedam Tips: జీర్ణక్రియను మెరుగుపరిచే ఐదు ఆయుర్వేద మార్గాలు ఇవిగో

Ayurvedam Tips: జీర్ణక్రియను మెరుగుపరిచే ఐదు ఆయుర్వేద మార్గాలు ఇవిగో

టాప్ స్టోరీస్

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !

Apsara Murder Case Update :  అప్సర హత్య  వెనుక ఇన్ని కోణాలున్నాయా ? -  మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన  సంచలన విషయాలు !

TSRTC Services: 'గ్రూప్-1' ప్రిలిమిన‌రీ ప‌రీక్షకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు!

TSRTC Services: 'గ్రూప్-1' ప్రిలిమిన‌రీ ప‌రీక్షకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు!