African Swine Fever: భారత్‌లో వందలాది పందులకు ఆఫ్రికన్ స్వైన్ ఫివర్, ఈ వైరస్ మనుషులకు సోకితే ప్రమాదమా?
African Swine Fever in India: కేరళలో వందలాది పందులకు ఆఫ్రికన్ స్వైన్ ఫివర్ సోకింది. వాటన్నింటినీ వెంటనే చంపేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
African Swine Flu: కేరళలోని త్రిసూర్‌లో African Swine Fever(ASF) అలజడి సృష్టించింది. 310 పందులకు ఈ ఫ్లూ సోకినట్టు అధికారులు గుర్తించారు. వాటన్నింటినీ వెంటనే చంపేయాలని అధికారులు ఆదేశించారు. మిగతా వాటికీ ఈ ఫ్లూ వ్యాప్తి చెందకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. మడకతరలోని ఓ ప్రైవేట్ ఫామ్‌లో ఈ కేసులు నమోదయ్యాయి. ఈ ఫామ్ పరిసరాల్లోని కిలోమీటర్ మేర ఫ్లూ ప్రభావిత ప్రాంతంగా డిక్లేర్ చేశారు. 10 కిలోమీటర్ల పరిధి వరకూ నిఘా పెట్టేనున్నారు. గతేడాది కూడా అలప్పుజలో African Swine Flu కేసులు వెలుగు చూశాయి. తొలిసారి ఇండియాలో 2020లో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ అసోంలో వెలుగు చూసింది. అప్పుడు దాదాపు 2,900 పందులు ఈ ఫ్లూ కారణంగా చనిపోయాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. అడవి పందులకూ ఈ వైరస్ సోకే ప్రమాదముంది. ఈ ఫ్లూ బారిన పడితే చనిపోయే అవకాశం 100% ఉంటుంది. జర్మన్‌కి చెందిన ఓ ఫార్మా కంపెనీ చెప్పిన వివరాల ఆధారంగా చూస్తే ఆఫ్రికాలో తొలిసారి 1990ల్లో ఈ ఫ్లూని గుర్తించారు. అప్పటి నుంచి ఏటా ఇది కలవర పెడుతూనే ఉంది. 2022 జనవరి నుంచి దాదాపు 57 దేశాల్లో 5 లక్షలకుపైగా పందులకు ఈ ఫ్లూ సోకింది. ఆసియాలోనే 26.55% పందులు ఈ ఫ్లూ బారిన పడ్డాయి. మిగతా 70% మేర కేసులు యూరప్‌లో నమోదయ్యాయి. ఆఫ్రికన్ స్వైన్ ఫివర్ Asfarviridae వర్గానికి చెందిన DNA వైరస్. రక్తంలో ఎక్కువ రోజుల పాటు ఉండిపోతుంది. మొత్తం కండరాల్లో వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకిన పందుల మాంసాన్ని సరిగ్గా వండకుండా తింటే ఆ వైరస్ మనుషులకూ సోకే ప్రమాదముంది. అయితే..మనుషులకు మాత్రం ఈ వైరస్‌తో ఎలాంటి ముప్పు లేదని సైంటిస్ట్‌లు వెల్లడించారు. కాకపోతే పందుల జాతిని మాత్రం పూర్తిగా తుడిచి పెట్టే స్థాయిలో ఇది ప్రభావం చూపిస్తుందని హెచ్చరించారు.
ఎలా వ్యాప్తి చెందుతుంది..?
ఈ వైరస్ అత్యంత వేగంగా సోకుతుంది. ఓ జంతువు నుంచి మరో జంతువుకి వ్యాప్తి చెందుతుంది. అప్పటి వరకూ ఆరోగ్యంగా ఉన్నవి కూడా ఈ వైరస్ సోకగానే వెంటనే అనారోగ్యానికి గురువుతాయి. వైరస్ సోకిన మాంసాన్ని తిన్నా ఇది వ్యాప్తి చెందుతుంది. వ్యాప్తి చెందిన చోట చాలా రోజుల పాటు ఈ వైరస్ ఉనికి ఉండిపోతుంది. అందుకే ఇన్‌ఫెక్షన్ రేట్ ఎక్కువ. అంతే కాదు. ఒక్కోసారి ఇవి ఓ దేశం నుంచి మరో దేశానికీ సోకుతుంటాయి. అంటే ఆ వైరస్ అన్ని గంటల పాటు యాక్టివ్‌గా ఉండగలుగుతుంది. ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకుని నిలబడుతుంది. దుస్తులు, షూస్‌తో పాటు వెహికిల్ వీల్స్‌పైనా ఉండిపోతుంది.
వ్యాక్సిన్ లేని వ్యాధి..
ఈ వైరస్ సోకితే వెంటనే జ్వరం వస్తుంది. చాలా వేగంగా జంతువులు చనిపోయే ప్రమాదముంది. డయేరియా, స్కిన్ అలెర్జీ కారణంగా 24-48 గంటల్లోనే చనిపోతాయి. ప్రస్తుతానికైతే ఆఫ్రికన్ స్వైన్ ఫివర్‌కి మందు ఎలాంటి మెడిసిన్‌లు, వ్యాక్సిన్‌లు అందుబాటులో లేవు. వైరస్ సోకినప్పుడు వాటిని చంపేసి ఎలాంటి సమస్యా రాకుండా వాటిని పాతి పెట్టడమొక్కటే మార్గం. ఇక ఇన్‌ఫెక్టెడ్ జోన్స్‌పై నిఘా పెట్టాల్సి ఉంటుంది. ఆ వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతోందో అంచనా వేసి అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.