అన్వేషించండి

Cancer and Height: షాకింగ్, మనిషి ఎత్తు ఎక్కువగా ఉంటే కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువ

భయంకరమైన రోగం క్యాన్సర్. ఇది వచ్చిందా జీవితాంతం అనారోగ్యం వెంటాడుతుంది. ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది.

క్యాన్సర్ అనేది శరీరంలో వివిధ భాగాలకు వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి. దీని చికిత్స కూడా చాలా కష్టతరంగా ఉంటుంది. శరీరంలో కణాలు ఒకే చోట అనియంత్రితంగా పెరిగి గడ్డల్లా ఏర్పడి, క్యాన్సర్ కణితిగా మారుతుంది. ఇది ఇతర భాగాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది.క్యాన్సర్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొందరికి ముసలితనం రాగానే వచ్చే అవకాశం ఉంది. అలాగే కుటుంబ చరిత్రలో ఈ వ్యాధి ఉన్నవారు ఉన్నా కూడా రావచ్చు. పొగాకు, మద్యపానం అధికంగా తాగే వాళ్ళకి వచ్చే ముప్పు ఎక్కువ. రేడియేషన్‌కు గురయ్యే వారికి కూడా క్యాన్సర్ ప్రమాదం అధికమే. అయితే ఇటీవల ఒక అధ్యయనం ప్రకారం ఎత్తు కూడా ఆ వ్యక్తి క్యాన్సర్‌కు గురవుతాడో లేదో నిర్ధారిస్తుందని తేలింది. వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ ఇంటర్నేషనల్ ప్రకారం మనిషి ఎత్తు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని నిర్ధారిస్తుంది.

ఈ క్యాన్సర్లు రావొచ్చు
ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధనా బృందం ప్రపంచవ్యాప్తంగా ఎత్తుగా ఉన్న మనుషుల ఆహారం, బరువు, శారీరక శ్రమ, ఆరోగ్యం వంటి డేటాలను సేకరించి పరిశీలించింది. ఇందులో మనిషి ఎత్తు ఎంత ఎక్కువగా ఉంటే, అంత అధికంగా కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని తేలింది. ముఖ్యంగా అండాశయాల క్యాన్సర్,  ప్రొస్టేట్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్,  రొమ్ము, కిడ్నీ క్యాన్సర్ వచ్చే ముప్పు ఉందని తేలింది.
ఎత్తుగా ఉన్న మనుషులకు కిడ్నీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పది శాతం ఎక్కువ
మెనోపాజ్ కి ముందు లేదా తరువాత రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం 9 నుంచి 11% ఎక్కువ.
అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం 8 శాతం 
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం 5 శాతం 
ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం నాలుగు శాతం అధికం అని తేలింది. 

 వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ ఇంటర్నేషనల్ సైన్స్ ప్రోగ్రాం మేనేజర్ సూజన్ బ్రౌన్ మాట్లాడుతూ ఒకరి ఎత్తు క్యాన్సర్ ప్రమాదాన్ని ఎందుకు ప్రభావితం చేస్తుందో వివరించారు. ఆమె చెప్పిన ప్రకారం ఒక వ్యక్తి ఎత్తు అనేది తల నుండి పాదాల మధ్య దూరం. ఈ దూరం ఎక్కువ ఉంటే ప్రమాదం పెరుగుతుంది. ఈ ఎత్తు ప్రక్రియ జన్యువులు నిర్ణయించడమే కాదు కొన్ని రకాల ఇతర కారకాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఇన్సులిన్, గ్రోత్ హార్మోన్లు, ఈస్ట్రోజన్ వంటి సెక్స్ హార్మోన్లు ఈ ఎత్తు అధికం అవ్వడానికి కారణమని చెప్పుకోవచ్చు. 

అయితే పొడవుగా ఉండడం ఒక శాపం అని చెప్పడం లేదు. మధుమేహం, బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటు వంటి రోగాలు వచ్చే అవకాశం పొడవుగా ఉండే వారిలో తక్కువగా ఉంటాయి. కాబట్టి ఎత్తుగా ఉండడం కొన్ని విషయాల్లో వరమనే చెప్పాలి. అయితే క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తినడం, వ్యాయామం చేయడం ద్వారా అడ్డుకోవచ్చు. ధూమపానం, మద్యపానం వంటివి పూర్తిగా మానేయాలి.

క్యాన్సర్ లక్షణాలు
1. విశ్రాంతి తీసుకున్న కూడా తీవ్రమైన అలసట 
2. హఠాత్తుగా బరువు తగ్గడం లేదా పెరగడం 
3. శరీరంలో ఎక్కడైనా వాపు లేదా గడ్డలు రావడం 
4. హఠాత్తుగా శరీరంలో ఎక్కడైనా నొప్పి ప్రారంభం కావడం 
5.చర్మం రంగులో మార్పులు రావడం 
6.గొంతు బొంగురు పోవడం 
7. మూత్రంలో రక్తం పడడం 
8. జ్వరం అధికంగా రావడం 
9. రాత్రుళ్లు చెమట పట్టడం 
10. తలనొప్పి 
11. దృష్టి, వినికిడి సమస్యలు కలగడం 

ఇవన్నీ క్యాన్సర్ లక్షణాలే ఇందులో ఏవి కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

Also read: ఒక స్పూన్ ఆల్కహాల్ కూడా ప్రమాదమే -క్యాన్సర్ బారిన పడే ముప్పు ఎక్కువ

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Hyundai CNG Sales: మాకు సీఎన్‌జీ కార్లే కావాలంటున్న ప్రజలు - భారీగా పెరుగుతున్న డిమాండ్!
మాకు సీఎన్‌జీ కార్లే కావాలంటున్న ప్రజలు - భారీగా పెరుగుతున్న డిమాండ్!
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Hyundai CNG Sales: మాకు సీఎన్‌జీ కార్లే కావాలంటున్న ప్రజలు - భారీగా పెరుగుతున్న డిమాండ్!
మాకు సీఎన్‌జీ కార్లే కావాలంటున్న ప్రజలు - భారీగా పెరుగుతున్న డిమాండ్!
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Realme GT 7 Pro Launch Date: రూ.1000 పెట్టి బుక్ చేస్తే రూ.6598 విలువైన ఆఫర్ - రియల్‌మీ జీటీ 7 ప్రో ప్రీ బుకింగ్స్ స్టార్ట్!
రూ.1000 పెట్టి బుక్ చేస్తే రూ.6598 విలువైన ఆఫర్ - రియల్‌మీ జీటీ 7 ప్రో ప్రీ బుకింగ్స్ స్టార్ట్!
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
Embed widget