X

Thyroid Problems: థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? థైరాయిడ్ నియంత్రణ ఆహారాలు, ఏ ఆసనం ద్వారా థైరాయిడ్‌ను అదుపుచేయొచ్చు?  

పోషక, సమతుల్య ఆహారంతో పాటు మందులు తీసుకోవడం ద్వారా థైరాయిడ్ లక్షణాలను తగ్గించవచ్చు.

FOLLOW US: 

రోజు రోజుకీ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు ఎక్కువ అవుతున్నారు. థైరాయిడ్ అనేది ఒక రకమైన ఎండోక్రైన్ గ్రంథి. హార్మోన్లను తయారు చేసే ఈ గ్రంథి సీతాకోకచిలుక ఆకారంలో గొంతు లోపల, కాలర్ బోన్ పైన ఉంటుంది. ఈ గ్రంథిలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు, అలసట, జలుబు, జట్టు రాలడం, ఉన్నట్టుండి బరువు పెరగడం లాంటి తదితర లక్షణాలు కనిపించడం ప్రారంభమవుతుంది.

థైరాయిడ్ లక్షణాలు:

చికాకు, అధిక చెమట, చేతులు వణకడం, సన్నబడటం, జుట్టు రాలడం, కండరాల బలహీనత, గుండె వేగంగా కొట్టుకోవడం, బరువు తగ్గడం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక వ్యక్తి శరీరంలో థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువ లేదా తక్కువగా ప్రారంభమైనప్పుడు థైరాయిడ్ సమస్య తలెత్తుతుంది. 

థైరాయిడ్ నియంత్రణ ఆహారాలు
పోషక, సమతుల్య ఆహారంతో పాటు మందులు తీసుకోవడం ద్వారా థైరాయిడ్ లక్షణాలను తగ్గించవచ్చు. ఆహారంలో అయోడిన్, కాల్షియం, విటమిన్ డి ఉన్న వాటిని చేర్చుకోవాలి. 

ఏ ఆసనంతో థైరాయిడ్‌ని అదుపుచేయవచ్చు

సింహాసనంతో థైరాయిడ్‌ సమస్యకు అడ్డుకట్టవేయవచ్చని యోగా నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ ఆసనం ఎలా వేయాలో చదువుదాం. 

* ముందుగా వజ్రాసన స్థితిలో కూర్చోవాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ రెండు మోకాళ్ల మధ్య కాస్త ఎడం ఉండేలా దూరం జరపాలి.
* ఊపిరి వదులుతూ, చేతులను ముందుకు తీసుకొని అరచేతులను నేల మీద ఉంచాలి.
* ఇప్పుడు, గదవను గొంతుకు ఆనేలా కిందికి అనాలి. శ్వాస తీసుకుంటూ మెడను కాస్త ముందుకు తీసుకురావాలి.
* రెండు కండ్ల దృష్టి ముక్కు చివరపై ఉంచాలి. ఇప్పుడు నాలుక బయటపెట్టి.. శ్వాస వదులుతూ గొంతులో నుంచి సింహనాదం వచ్చేలా గర్జించాలి.
* మళ్లీ గదవను గొంతుకు ఆనించి శ్వాస తీసుకోవాలి. శ్వాసను వదిలే సమయంలో మెడను కాస్త ముందుకు తెచ్చి నాలుకను బయటపెట్టి, సింహంలా గర్జించాలి. ఇలా ఐదుసార్లు చేయాలి. తర్వాత, నిదానంగా మళ్లీ వజ్రాసన స్థితిలోకి రావాలి. 

థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు ప్రతి రోజూ ఈ ఆసనం చేస్తే... కొద్ది రోజులకి మార్పును గమనిస్తారు అంటున్నారు నిపుణులు. 

ఈ పండ్లను ఆహారంలో జత చేసుకోండి 

యాపిల్
రోజూ ఒక యాపిల్ తినడం ద్వారా బరువును నియంత్రించవచ్చు. రక్తంలో చక్కెరను, థైరాయిడ్ గ్రంథిని  కంట్రోల్ చేయడానికి యాపిల్ సహాయపడుతుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. అలాగే ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
 
పైనాపిల్
పైనాపిల్‌లో విటమిన్ సి, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు పోషకాలు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడంలో సహాయపడతాయి. ఇందులో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. ఇది అలసట నుంచి ఉపశమనం ఇస్తుంది. పైనాపిల్ క్యాన్సర్, కణితి, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తోంది. 

జామూన్
బెర్రీలలో థైరాయిడ్‌ను తగ్గించే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. థైరాయిడ్‌ సమస్యతో బాధపడేవారికి షుగల్ లెవల్స్, బరువు పెరగడం సాధారణం. అప్పుడు ఆహారంలో స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్ చేర్చుకోండి. 
 
నారింజ
నారింజను తినడం వలన అనేక వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ సి సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో తోడ్పడుతుంది.

Tags: LifeStyle Health food Thyroid

సంబంధిత కథనాలు

Covid Vaccination: కరోనా వ్యాక్సినేషన్‌పై సర్కార్ కీలక ప్రకటన.. ఇక వారు కూడా అర్హులే

Covid Vaccination: కరోనా వ్యాక్సినేషన్‌పై సర్కార్ కీలక ప్రకటన.. ఇక వారు కూడా అర్హులే

Omicron Sub-Variant BA.2: బీ అలర్ట్.. దేశంలో ఆ వేరియంట్ వ్యాప్తే ఎక్కువగా ఉందట!

Omicron Sub-Variant BA.2: బీ అలర్ట్.. దేశంలో ఆ వేరియంట్ వ్యాప్తే ఎక్కువగా ఉందట!

Covid Vaccine Update: మార్కెట్ విక్రయానికి కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు.. కానీ అక్కడ మాత్రం దొరకవు!

Covid Vaccine Update: మార్కెట్ విక్రయానికి కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు.. కానీ అక్కడ మాత్రం దొరకవు!

పచ్చి మాంసాన్ని కసకస నమిలి తినేస్తున్నాడు.. కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!

పచ్చి మాంసాన్ని కసకస నమిలి తినేస్తున్నాడు.. కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!

Covid-19 Update: దేశంలో కొత్తగా 2,86,384 కరోనా కేసులు నమోదు.. 573 మంది మృతి

Covid-19 Update: దేశంలో కొత్తగా 2,86,384 కరోనా కేసులు నమోదు.. 573 మంది మృతి

టాప్ స్టోరీస్

Naga Chaitanya in Moscow: మాస్కోలో నాగచైతన్య... ఆయన అక్కడ ఏం చేస్తున్నారంటే?

Naga Chaitanya in Moscow: మాస్కోలో నాగచైతన్య... ఆయన అక్కడ ఏం చేస్తున్నారంటే?

Snake Vs Hen: గుడ్ల కోసం వచ్చిన పాముతో కోడి ఫైటింగ్.. చివరికి ఏమైందో చూడండి

Snake Vs Hen: గుడ్ల కోసం వచ్చిన పాముతో కోడి ఫైటింగ్.. చివరికి ఏమైందో చూడండి

Tata Taken Air India: ఇక టాటా వారీ 'ఎయిర్‌ ఇండియా'! ప్రభుత్వం నుంచి వాటాలు అధికారికంగా బదిలీ

Tata Taken Air India: ఇక టాటా వారీ 'ఎయిర్‌ ఇండియా'! ప్రభుత్వం నుంచి వాటాలు అధికారికంగా బదిలీ

Covid Updates: తెలంగాణలో తగ్గని కోవిడ్ ఉద్ధృతి... కొత్తగా 3,944 కేసులు, ముగ్గురు మృతి

Covid Updates: తెలంగాణలో తగ్గని కోవిడ్ ఉద్ధృతి... కొత్తగా 3,944 కేసులు, ముగ్గురు మృతి