Fact Check: ఇటీవల ఎన్నికల్లో బహదూర్ పూరాలో రిగ్గింగ్ జరిగిందా? - షేర్ అవుతోన్న వీడియోలో నిజమెంత?
Logically Facts: ఇటీవల ఎన్నికల్లో తెలంగాణ బహదూర్ పురాలో రిగ్గింగ్ జరిగిందంటూ ఓ వీడియో షేర్ అవుతుండగా.. దీనిపై 'లాజికల్లీ ఫ్యాక్ట్స్' స్పష్టత ఇచ్చింది.
Logically Facts Clarity Bahadurpura Voting Audio: 2024 ఎన్నికల్లో తెలంగాణలోని బహదూర్ పురాలో జరిగిన ఓటింగ్ ప్రక్రియలో రిగ్గింగ్ జరిగిందంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. దీనిపై 'లాజికల్లీ ఫ్యాక్ట్స్' స్పష్టత ఇచ్చింది. ఇది తప్పుడు వీడియో అని నిర్ధారించింది.
క్లెయిమ్ ఏమిటి.?
సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియోలో పోలింగ్ ఏజెంట్ కూర్చుని ఉండగా, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ వద్ద ఒక గీతల టీ షర్ట్ వేసుకున్న వ్యక్తి నిలబడి, ఓటర్లను ఆపుతూ, వాళ్లకు బదులు ఇతను ఓట్లు వేస్తున్నట్టుగా ఉంది. ఈ వీడియోని షేర్ చేస్తూ, అల్ ఇండియా మజ్లీస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) వ్యక్తులు పోలింగ్ రిగ్గింగ్ చేస్తున్నారు అని పేర్కొన్నారు. ఈ వీడియోకి పెట్టిన శీర్షికలో, ఈ వీడియో దక్షిణ భారతదేశమైన తెలంగాణలోని బహదూర్ పుర నియోజకవర్గం లోనిది అని రాసుకొచ్చారు. ఇక్కడ మే 13న ఎన్నికలు జరిగాయి.
కానీ, ఈ వీడియో తప్పుడు క్లెయిమ్ తో ప్రచారం అవుతుందని 'లాజికల్లీ ఫ్యాక్ట్స్' నిర్ధారించింది. ఈ వీడియో 2022 ఫిబ్రవరి నాటిదని.. వివిధ కథనాల ప్రకారం భారతదేశానికీ తూర్పున ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ లోని కోల్ కత్తాలో మున్సిపల్ ఎన్నికలలో ఓటు రిగ్గింగ్ జరిగిన సమయం లోనిది అని తెలిపింది.
వాస్తవం ఏమిటి ?
వైరల్ అవుతున్న వీడియోని పరిశీలించగా.. ఈ వీడియో 2022లో కోల్ కత్తాలోని మున్సిపల్ ఎన్నికల సమయంలో వార్డ్ నెంబర్ 33లో లేక్ వ్యూ స్కూల్ లోనిది అని 'లాజికల్లీ ఫ్యాక్ట్స్' నిర్ధారించింది. ఫిబ్రవరి 27, 2022 నాడు 108 మున్సిపాలిటీలకు వెస్ట్ బెంగాల్ లో ఎన్నికలు జరిగాయి. అధికార పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్, 102 మున్సిపాలిటీలలో ఎన్నికలు గెలిచింది, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికలు రిగ్గింగ్ చేసింది అని ఆరోపించారు.
బీజేపీ నాయకురాలు అగ్నిమిత్ర పాల్ ఈ వీడియోని షేర్ చేస్తూ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను రిగ్గింగ్ చేసింది అని పేర్కొన్నారు. ఇదే వీడియోని బెంగాల్ బీజేపీ తమ ట్విట్టర్ హ్యాండిల్ లోనూ షేర్ చేసింది. బెంగాలీ న్యూస్ ఛానల్ టీవీ9 బంగ్లా ఈ వీడియోని తమ యూట్యూబ్ ఛానల్ లో ఫిబ్రవరి 27, 2022 నాడు పబ్లిష్ చేస్తూ, ఈ ఘటన బూత్ నెంబర్ 108లో, వార్డ్ నెంబర్ 33 లో, సౌత్ డమ్ డమ్ లో జరిగింది అని పేర్కొన్నారు. పైగా ఓటరు ఓటు వేయలేదు, ఏజెంటే ఓటు వేశారు అని పేర్కొన్నారు.
ఎడిటర్జీ అనే వార్త సంస్థ కుడా ఈ వీడియోని పబ్లిష్ చేసి, ప్రతిపక్ష నేతలు సౌత్ డమ్ డమ్ మున్సిపల్ ఎన్నికలలో రిగ్గింగ్ జరిగింది అని పేర్కొన్నారు అని ఉంది. బెంగాల్ ప్రభుత్వం ఈ వీడియో గురించిన ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు, కానీ, ఈ వీడియో 2022 నాటిది అని, కర్ణాటక ఎన్నికల ముందు నుంచే ఉందని మాత్రం తెలుస్తోంది. 2022లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కుడా ఇదే వీడియో సూరత్ లోని వారచ్చ ప్రాంతంలో దొంగ ఓట్లు వేస్తున్నారన్న క్లైమ్ మీద వైరల్ అయింది. అప్పుడు కుడా 'లాజికల్లీ ఫ్యాక్ట్స్' దీనిపై స్పష్టత ఇచ్చింది.
This story was originally published by Logically Facts as part of the Shakti Collective. Except for the headline/excerpt/opening introduction para, this story has not been edited by ABP Desam staff.