Fact Check: మోదీతో ఫ్రాన్స్ ప్రధాని కరచాలనం చేయలేదా ? - వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదిగో
Fact Check:ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ మోదీతో కరచాలనం చేయలేదనే ప్రచారం ఫేక్ న్యూస్ . అసలేం జరిగిందో మీరే చదవండి.

French President Macron did not shake hands with Modi is fake news: భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు దేశాల పర్యటనలో భాగంగా మొదట ఫ్రాన్స్ వెళ్లారు. అక్కడ పారిస్‌లో జరిగిన AI సమ్మిట్‌కు సహ అధ్యక్షునిగా వ్యవహరించారు. ప్యారిస్‌లో ప్రధాని మోదీకి భారతీయ సమాజం నుంచి ఘన స్వాగతం లభించింది.
AI సమ్మిట్‌కు ముందు ఎలిసీ ప్యాలెస్‌లో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఏర్పాటు చేసిన స్వాగత విందుకు హాజరయ్యారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. అయితే "ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ పారిస్‌లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో కరచాలనం చేయలేదు" అనే క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేస్తున్నారు. వైరల్ చేస్తున్నారు. దాన్ని ఇక్కడ ఇక్కడ చూడవచ్చు.
మోదీ కరచాలనం చేయడానికి చేయి చాపినా కూడా మాక్రాన్ పట్టించుకోలేదని, ఇది మోదీకి అవమానం అని మరికొంత మంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
వైరల్ పోస్టుకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
Claim : ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో కరచాలనం చేయలేదు
Fact : వైరల్ అవుతున్న వాదన తప్పుదారి పట్టిస్తోంది, వీడియో చిత్రీకరణకు ముందు ఇద్దరు నాయకులు ఒకరినొకరు పలకరించుకున్నారు
ఈవెంట్ కు సంబంధించి మరిన్ని వీడియోలను గురించి తనిఖీ చేశాము. పూర్తి విజువల్స్ ను చూపలేదని తెలుస్తోంది. పారిస్‌లో జరిగిన AI సమ్మిట్‌కు ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్, భారత ప్రధాని మోదీ ఇద్దరూ సహ అధ్యక్షత వహించారు. కాబట్టి, వారిద్దరూ కలిసి వేదిక పైకి ప్రవేశించారు. తరువాత మాక్రాన్ అప్పటికే వేదిక వద్ద ఉన్న ఇతర నాయకులను పలకరించడం ప్రారంభించారు. వారి మధ్య ప్రధాని మోదీ ఉన్నారు. Xలో అప్లోడ్ చేసిన నిడివి ఎక్కువ ఉన్న వీడియో ఇక్కడ ఉంది, ఇందులో ప్రధాని మోదీ, మాక్రాన్ కలిసి వేదిక మీదకు ప్రవేశించడం, ఇతరులను పలకరించడం కనిపిస్తుంది.
‼️ Kremlin spreads another fake "scandal"
— NEXTA (@nexta_tv) February 11, 2025
Russian propaganda have circulated a misleading, out-of-context video, claiming that French President Emmanuel Macron allegedly refused to shake hands with Indian Prime Minister Narendra Modi.
In reality, they had already shaken hands… pic.twitter.com/Ugvi3fCYZ2
నిజానికి, ప్రధాని మోదీ పారిస్ చేరుకున్న తర్వాత ఇద్దరు నేతలు ఆలింగనం చేసుకున్నారు. AI సమ్మిట్ వేదిక వద్ద ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ కరచాలనంతో అభివాదం చేస్తున్న చిత్రాలను ప్రధాని మోదీ స్వయంగా సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇక్కడ చూడవచ్చు.
భారత ప్రధాని నరేంద్ర మోదీతో కరచాలనం చేయకుండా ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ వెళ్లిపోయారనే వాదన తప్పుదారి పట్టిస్తోంది. వైరల్ వీడియో చిత్రీకరణకు ముందు ఇద్దరు నాయకులు ఒకరినొకరు చాలాసార్లు కలుసుకున్నారు. పలకరించుకున్నారు. ఇద్దరూ కలిసి వేదిక వద్దకు చేరుకుని శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షత వహించారు.
This story was originally published by Telugu Post as part of the Shakti Collective. Except for the headline/excerpt/opening introduction, this story has not been edited by ABP DESAM staff.
Follow Fact Check News on ABP DESAM for more latest stories and trending topics.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

