Fact Check: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సీఎం జగన్ ప్రసంగం - ఆ వీడియోలో నిజమెంతంటే?
Factly: ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై వివరణ ఇచ్చారు. అయితే, దీనికి సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతుండగా అది ఎడిటెడ్ అని 'ఫ్యాక్ట్ లీ' స్పష్టం చేసింది.
Factly Clarity On Cm Jagan Land Titling Act Speech Edited Video: ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) ఇటీవల ఎన్నికల ప్రచారంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ (Land Titling Act) పై మాట్లాడుతూ.. 'అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అంటే భూముల మీద ఒక యాక్ట్ చేయడమే దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు' అని అన్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ వీడియోపై 'ఫ్యాక్ట్ లీ' (Factly) క్లారిటీ ఇచ్చింది. అసలు ఆ వీడియోలో నిజా నిజాలపై స్పష్టత ఇచ్చింది.
క్లెయిమ్: ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటి అని చెప్తున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో ఎడిట్ చేసినది. ఈ ఏడాది మే 4వ తేదీన హిందూపురంలో జరిగిన వైసీపీ ఎన్నికల ప్రచారంలో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి టీడీపీ చేస్తున్న వ్యాఖ్యలను విమర్శిస్తూ, ఈ యాక్ట్ అంటే ఏంటో అక్కడ ఉన్న ప్రజలకి వివరించారు. వాస్తవంగా, వై.ఎస్. జగన్ మాట్లాడుతూ.. 'అయ్యా అసలు మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటో తెలుసా.? చంద్రబాబు, అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అంటే భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే, దానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు ఫస్ట్ అది తెలుసుకో' అని అన్నారు. కావున షేర్ అవుతోన్న వీడియో ఎడిటెడ్ వీడియో అని నిర్ధారించుకోవచ్చు.
ఈ దృశ్యాలు కలిగిన పూర్తి నిడివి గల వీడియోను 04 మే 2024న సాక్షి టీవీ (Sakshi TV live) తమ అధికారిక యూట్యూబ్ ఛానల్ లో “CM YS Jagan Responded On AP Land Titling Act At Hindupur YSRCP Election Campaign Public Meeting” అనే శీర్షికతో లైవ్ టెలికాస్ట్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియో వివరణ ప్రకారం, ఈ వీడియో ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురంలో జరిగిన వైసీపీ ఎన్నికల ప్రచారానికి సంబంధించినది అని 'ఫ్యాక్ట్ లీ' తెలిపింది.
ఈ వీడియోని పూర్తిగా పరిశీలిస్తే, వైరల్ వీడియో క్లిప్పింగ్ లోని దృశ్యాలు టైంస్టాంప్ 02:03 వద్ద మొదలై, టైంస్టాంప్ 02:17 వద్ద ముగుస్తుంది అని తెలుస్తోంది. వాస్తవంగా, ఈ ప్రచార సభలో ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. “అయ్యా అసలు మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటో తెలుసా చంద్రబాబు, అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అంటే భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే, దానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు ఫస్ట్ అది తెలుసుకో” అని అన్నారు. దీన్ని బట్టి అసలు వీడియోను ఎడిట్ చేస్తూ ఈ వైరల్ వీడియోని రూపొందించారు అని 'ఫ్యాక్ట్ లీ' నిర్ధారించింది. వాస్తవంగా, వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటో తెలుసుకో అని చంద్రబాబును విమర్శిస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటో అక్కడ ఉన్న ప్రజలకి వివరించారు. వైరల్ అవుతోన్న వీడియో ఎడిట్ చేశారని 'ఫ్యాక్ట్ లీ' స్పష్టం చేసింది.
This story was originally published by Factly.in, as part of the Shakti Collective. Except for the headline/excerpt/opening introduction para, this story has not been edited by ABP Desam staff.