Fact check : షర్మిలపై సీఎం జగన్ చేయి చేసుకున్నారా ? - ఆ వార్తల్లో నిజం ఇదిగో
YCP Fact check : షర్మిలను జగన్ కొట్టారని జరుగుతున్న ప్రచారం ఫేక్ అని వైసీపీ ప్రకటించింది. టీడీపీ ఈ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించింది.
Fact check : ఏపీ రాజకీయాలపై సోషల్ మీడియాలో జరిగే ప్రచారంలో నిజం ఎంత అనేది కనిపెట్టడం కష్టంగా మారింది. రెండు రాజకీయ పార్టీల అభిమానులు పోటీ పడి ఫేక్ న్యూస్ ను విస్తృతంగా సర్క్యూలేట్ చేస్తున్నాయి. తాజాగా సీఎం జగన్ , షర్మిల గురించిన ఓ వార్త క్లిప్పింగ్ విషయంలో వైఎస్ఆర్‌సీపీ క్లారిటీ ఇచ్చింది. అది ఫేక్ వార్త అని స్పష్టం చేసింది.
ఓటమి భయంతో రోజురోజుకీ దిగజారిపోతున్న టీడీపీ
— YSR Congress Party (@YSRCParty) January 31, 2024
షర్మిల గారి గురించి ఓ ఫేక్ వార్తని క్రియేట్ చేసిన @JaiTDP.. సీఎం వైయస్ జగన్ గారితో ముడిపెడుతూ బురదజల్లుతోంది. ఒంటరిగా వస్తున్న జగనన్నని ఎదుర్కొనే దమ్ములేక టీడీపీ వేస్తున్న చిల్లర వేషాలకి ఇది పరాకాష్ట.@way2_news పేరు మీద వస్తున్న ఫేక్… pic.twitter.com/cf20Ry3n4c
మూడు రోజులుగా సోషల్ మీడియాలో సీఎం జగన్ , షర్మిలపై చేయి చేసుకున్నరన్న ప్రచారం జరుగుతోంది. స్వయంగా షర్మిల ఈ విషయం చెప్పారని ఆ వార్త క్లిప్ లో ఉంది. ఆస్తి పంపకాల గురించి మాట్లాడటానికి వెళ్లినప్పుడు జగన్ తన మెడ పట్టుకునిగోడకేసి గుద్దారని షర్మిల చెప్పినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే షర్మిల అలాంటి వ్యాఖ్యలు ఎక్కడా చేయలేదని వైఎస్ఆర్‌సీపీ స్పష్టం చేసింది. టీడీపీ కార్యకర్తలు షేర్ చేస్తున్న పేపర్ క్లిప్పింగ్ కూడా ఫేకేనని ఆధారాలను పోస్ట్ చేసింది.
షర్మిల పేరుతో టీడీపీనే ఫేక్ వార్తలు తయారు చేసి సర్క్యూలేట్ చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఫేక్ వార్తలను ఫ్యాక్ట్ చెక్‌లో ఆ వార్త కోడ్‌ని వేయడం ద్వారా క్రాస్ చెక్ చేసుకోవచ్చుని వైసీపీ సూచించింది.
ఇటీవలి కాలంలో ఏపీలో రెండు పార్టీల తరపున పెద్ద ఎత్తున ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. జనసేన పార్టీకి సీట్లు కేటాయించారని.. ఓ జాబితాను విడుదల చేశారు. అలాగే.. బుద్దా వెంకన్నతో పాటు ఇతర టీడీపీ నేతలు చేసినట్లుగా చెబుతున్న ప్రకటనలు వైరల్ అయ్యాయి. అయితే తమ పేరుతో ఫేక్ వార్తలను సర్క్యూలేట్ చేస్తున్నారని టీడీపీ నేతలు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.