అన్వేషించండి

Watch Models: చేతి గడియారంలో టైం చూసుకునే కాలం పోయినా వాచ్‌లపై ఎందుకంత మోజు!

Watches News: ప్రీ- వెడ్డింగ్ లో అనంత్ అంబానీ ధరించిన వాచ్ ఫేస్ బుక్ కో-ఫౌండర్, మెటా CEO మార్క్ జూకర్బెర్గ్, ప్రిసిల్లా దంపతుల్నీ ఆశ్చర్యపరిచింది. 

Ananta Ambani Radhika Pre Wedding Event: కలిగినోళ్లింటి పెళ్లంటే అన్నీ అతిశయోక్తులే. కానీ, ప్రీ- వెడ్డింగ్ లో అనంత్ అంబానీ ధరించిన వాచ్ మరింత అతిశయం. మనల్నే కాదు ఈ వాచ్ ఫేస్ బుక్ కో-ఫౌండర్, మెటా CEO మార్క్ జూకర్బెర్గ్(Mark Zuckerberg), ప్రిసిల్లా(Priscilla) దంపతుల్నీ ఆశ్చర్యపరిచింది. ఈ సెల్ ఫోన్ యుగంలో మనుషులు చేసే పనులు కూడా టెక్నాలజీనే చేసేస్తోంది. చేతిలో ఫోను రేడియో, కెమెరా,వాక్ మెన్ లాంటి ఎన్నో పరికరాలను కంటికి కనపడకుండా చేసింది. కానీ ఈ చేతి గడియారాల మోజు నుంచి మాత్రం ఏ ఐ-ఫోనూ తప్పుకోనీయలేదు. చేతి గడియారం కథ ఇప్పటిది కాదు. ఆడవాళ్లకు చీరలు ఎలాగో మగాళ్ల ఫ్యాషన్ ప్రపంచంలో చేతి వాచ్ లు అలా టైం లెస్ కథలుగా నిలుస్తున్నాయి.

లైఫ్‌ స్టైల్‌కు సింబల్‌

మహాత్మ గాంధీ(Gandhi), ఒబామా(Obama) వంటి ఐకాన్ లు సమయపాలనకు చిహ్నంగా ధరించినప్పటికీ, వారి సామాన్యమైన జీవితాన్ని వారి చేతి గడియారాలు మరింత ప్రస్ఫుటంగా చూపేవి. వారే కాదు..ఇప్పటి హాలీవుడ్ స్టార్లు కూడా ఖరీదైన బ్రాండ్ల వాచ్ కలెక్షన్స్ తో సందడి చేస్తున్నారు. టాం క్రూయిస్ ని తలుచుకుంటే, ఆ రూపంతో పాటు, తన చేతికి రోలెక్స్(Rolex), పోర్షె(Porsche) వంటి వాచ్ లు కూడా కళ్ల ముందు మెదులుతాయి. అంత పిచ్చిగా వాచ్ ల మీద ఇష్టం ఉన్న స్టార్లు ఎంతో మంది ఉన్నారు. 

అనంత్ అంబానీ వద్ద హ్యూజ్‌ కలెక్షన్

మనతోపాటు మొబైల్ యుగంలో పెరిగిన 90'స్ కిడ్ అనంత్ అంబానీ(Anant Ambani) వాచ్ ల మీద మోజు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అనంత్ అంబానీ వాచ్ కలెక్షన్లలో ఎక్కువగా పరిచయం అవసరం లేని బ్రాండ్ రోలెక్స్ వాచ్ లు ఉన్నాయి. వాటితో పాటు, డేటోనా(Daytona), సబ్మరినర్(Submariner), జీఎంటీ-మాస్టర్ మోడల్స్ ఉన్నాయి. అయితే తాజాగా తన ప్రీ వెడ్డింగ్ లో అనంత్ అంబానీ రిచర్డ్ మిల్ల్ వాచ్ తో కనిపించారు.

వైభవంగా ప్రీవెడ్డింగ్ వేడుక 

ప్రపంచంలోనే సంపన్నులైన ముఖేష్ అంబానీ(Mukesh Ambani), నీతా అంబానీ(Nita Ambani)ల కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్( Radhika Merchant) వివాహం జూలై లో జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మద్యే వీరి ప్రీవెడ్డింగ్ వేడుక ఏర్పాటు చేసారు. ఈ వేడుక గుజరాత్ లోని, జామ్నగర్లో జరిగింది. ఇందుకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. సినీ, క్రీడా, బిజినెస్, రాజకీయ ఇలా వివిధ రంగాల ప్రముఖులు కాబోయే దంపతులను అభినందించారు. అడుగడుగునా అంబానీల వైభవం ఉట్టిపడేలాగా ఏర్పాట్లు చేసారు. దాదాపు వెయ్యి కోట్లు ఖర్చయిందని టాక్! 500 రకాల తిండి పదార్థాలతో, వెయ్యి మందికి పైగా అతిథులతో జామ్నగర్లో సందడి ధూం ధాం గా సాగింది. 

ప్రపంచవ్యాప్తంగా సెలబ్రెటీలు హాజరు

బాలీవుడ్,టాలీవుడ్ ప్రముఖులే కాకుండా, డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక, హాలీవుడ్ పాప్ స్టార్ రిహన్నా కూడా పాల్గొన్నారు. వీరంత ఈ వేడుకలో ఆడి పాడి మరింత సందడి తీసుకొచ్చారు. ప్రీవెడ్దింగ్ లో అంబానీలు ప్రముఖ బ్రాండ్ డిజైనర్ బట్టల్లో మెరిసిపోయారు. అతిథుల్ని ఆప్యాయంగా పలకరించారు. వారికి కావల్సిన ఏర్పాట్లు బాగా చేసారు. విదేశాల ప్రముఖుల్ని వారికి దేశం తిరిగి చూడాలనుంటే ఏర్పాట్లు చేస్తామని కూడా అనంత్ ముచ్చటించారు. ఘనమైన వేదికలంటే అంబానీలకు ఎంతో ప్రీతి అనే విషయం తెలిసిందే. రకరకాల పూలతో, మునుపెన్నడూ చూడని హంగులతో జామ్నగర్ టెంపుల్ కాంప్లెక్స్ లో వేదిక చూడముచ్చటగా తయారుచేసారు. 

ఆకట్టుకున్న అనంత్ వాచ్‌

ఇన్ని హంగుల మధ్య అతిథుల కళ్లు అనంత్ అంబానీ ధరించిన రిచర్డ్ మిల్ల్ వాచ్ మీద పడ్డాయి. ముఖ్యంగా మార్క్ జూకర్బర్గ్, ప్రిసిల్లా దంపతుల కళ్లు. ఎంతలా అంటే అప్పటికప్పుడు ఆ వాచ్ తయారుచేసిందెవరో తెలుసుకొని, తామూ ధరించాలనేంతలా..ఆ వాచ్ గొప్పతనం అలాంటిది మరి! ప్రపంచలోని పది ఉన్నతమైన బ్రాండ్ల రిస్ట్ వాచుల్లోకెల్లా ఒకటైన రిచర్డ్ మిల్ల్ RM 56-02 వాచ్ అది.ఫ్రెంచ్ వాచ్ మేకర్లకు ఉండే క్రేజ్ అలాంటిది. ప్రపంచంలో లగ్జరియస్ వాచ్ లకు పెట్టింది పేరు ఈ రిచర్డ్ మిల్ల్.

ధరపై రకరకాల కామెంట్స్

ఈ చేతి వాచ్ సంగతి నెట్టింట ఇంత వైరల్ అవటానికి కారణం..ఇంత ఇంజినీరింగ్/కోడింగ్ బ్యాగ్రౌండ్ ఉన్న మార్క్ జూకర్బర్గ్ రిస్ట్ వాచ్ ల జోలికి వెళ్లకుండా, ఏనాడూ అంతగా ఖరీదైన వాచ్ లను ధరించకుండా, ఇపుడు అనంత్ అంబానీ చేతి వాచ్ ను చూసి ముగ్ధుడైపోవటం. తనకూ ఈ వాచ్ కావాలని, ఎవరీ వాచ్ మేకర్ అని మార్క్ భార్య డా.ప్రిసిల్లా అడిగి తెలుసుకోవటం. వెంటనే ఇది రిచర్డ్ మిల్ల్ వాచ్ అని అనంత్ సమాధానం చెప్పటం. ఈ వీడియో ఆన్లైన్లో వైరల్ అయింది. ఈ వాచ్ ధర 15 కోట్లని కొందరు, 63 కోట్లని కొందరు, 18 కోట్లని కొందరు ముచ్చటించుకుంటున్నారు. మొత్తానికి కోట్లల్లో ఉన్నమాట వాస్తవం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Sri Simha Koduri : పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Embed widget