News
News
X

Prabhas: ప్రభాస్ సినిమాను రిజెక్ట్ చేసిన 'ఆర్ఆర్ఆర్' నిర్మాత - కారణమేంటంటే?

ప్రభాస్ సినిమా నుంచి దానయ్య తప్పుకోవడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం!

FOLLOW US: 

వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. మారుతి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. ఈ విషయాన్ని మారుతి స్వయంగా చెప్పారు. ముందుగా ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించాలనుకున్నారు. అప్పటికే ప్రభాస్ కి భారీ అడ్వాన్స్ ఇచ్చారు దానయ్య. 'ఆర్ఆర్ఆర్' లాంటి సినిమాను నిర్మించిన ఆయన తన తదుపరి సినిమా ప్రభాస్ తో చేయాలనుకున్నారు. కానీ ఆయన సడెన్ గా తప్పుకున్నారు. 

దీంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రంగంలోకి దిగింది. ఈ సినిమా కోసం ప్రభాస్ రూ.150 కోట్ల రెమ్యునరేషన్ కోట్ చేశారట. ఈ సినిమాను మారుతి అతి తక్కువ రోజుల్లో, లిమిటెడ్ బడ్జెట్ లో పూర్తి చేయాలనుకున్నారు. దీంతో దానయ్యకి ఈ సినిమా మంచి లాభాలను తీసుకొస్తుందని అందరూ భావించారు. కానీ ఆయన ఆలోచనలు వేరుగా ఉన్నాయి. లాభాల సంగతి పక్కన పెడితే.. ప్రభాస్ తో హైవోల్టేజ్ యాక్షన్ ఫిల్మ్ చేయాలనేది దానయ్య ఆలోచన. 

కానీ మారుతి రాసుకున్నది ఫన్ ప్యాక్డ్ ఫిల్మ్. అందులో యాక్షన్ ఎలిమెంట్స్ ఉండవట. అందుకే దానయ్య ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. 'ఆర్ఆర్ఆర్' తరువాత తన బ్యానర్ లో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు తీయాలని భావిస్తున్నారు దానయ్య. ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్ లాంటి స్టార్లతో సినిమాలను లైన్ లో పెట్టారు. ఇప్పుడు ప్రభాస్ కోసం కూడా పెద్ద డైరెక్టర్ ను వెతికే పనిలో పడ్డారు.  

మారుతిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్:

ఈ సంగతి పక్కన పెడితే.. మారుతితో సినిమాను మొదలుపెట్టొద్దని కోరుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. దానికి కారణం మారుతి అనే చెప్పాలి. ఈ మధ్యకాలంలో మారుతి నుంచి వచ్చిన ఒక్క సినిమా కూడా సరిగ్గా ఆడలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన 'పక్కా కమర్షియల్' సినిమా కూడా పెద్దగా ఆడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభాస్ తో సినిమా కరెక్ట్ కాదనేది అభిమానుల అభిప్రాయం. ఈ క్రమంలో మారుతిని ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయొద్దంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు.

ఫ్యాన్స్ ఎంత ట్రోల్ చేసినా.. ఈ కాంబోలో సినిమా రావడం పక్కా అంటున్నారు. మొదట డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చారు. ఇప్పుడు ఆయన తప్పుకోవడంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడానికి ఒప్పుకుంది. మరి ఈ సినిమాతో మారుతి తన టాలెంట్ నిరూపించుకొని.. అందరి నోళ్లు మూయిస్తారేమో చూడాలి. 

కొన్ని రోజుల క్రితం ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు మారుతి. తన మార్క్ లోనే సినిమా చేస్తానని అన్నారు. దీనికొక ఉదాహరణ కూడా చెప్పారు. 'మనం నాటుకోడి బాగా వండుతామని తెలిసి మనల్ని పిలిచినప్పుడు మనకి వచ్చిన వంటే చేసి పెట్టాలి తప్ప మనకి రాని చైనీస్ మరొకటి వండకూడదు' అంటూ చెప్పుకొచ్చారు. మారుతి మాటలను బట్టి ప్రభాస్ తో తన మార్క్ సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. ప్రభాస్ ఇమేజ్ కి తగ్గట్లుగా కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసే ఛాన్స్ ఉంది. 

Also Read : 'లైగర్' రివ్యూ : విజయ్ దేవరకొండ పంచ్ అదిరిందా? లేదా? పూరి ఏం చేశారు?

Also Read : 'లైగర్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా? ఏ ఏరియా రైట్స్ ఎన్ని కోట్లకు అమ్మారో చూడండి

Published at : 25 Aug 2022 04:32 PM (IST) Tags: RRR DVV Danayya Maruthi Prabhas

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

టాప్ స్టోరీస్

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా  .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Minister Jogi Ramesh : బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Minister Jogi Ramesh :  బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!