Major Movie OTT Offer: 'మేజర్' ఓటీటీ రిలీజ్ కి క్రేజీ ఆఫర్ - రిజెక్ట్ చేసిన మహేష్ బాబు
'మేజర్' సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు మహేష్ బాబు.
![Major Movie OTT Offer: 'మేజర్' ఓటీటీ రిలీజ్ కి క్రేజీ ఆఫర్ - రిజెక్ట్ చేసిన మహేష్ బాబు When Mahesh Babu turned down a large OTT offer for Major Major Movie OTT Offer: 'మేజర్' ఓటీటీ రిలీజ్ కి క్రేజీ ఆఫర్ - రిజెక్ట్ చేసిన మహేష్ బాబు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/10/1a8db7f3f0d3823c1174742d2323cbce_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ప్రొడక్షన్ లో 'మేజర్' అనే సినిమాను రూపొందించారు. 26/11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా. ఇందులో ఆయన పాత్రను అడివి శేష్ పోషిస్తోన్న సంగతి తెలిసిందే.
'గూఢచారి' ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అడివి శేష్ సరసన సయీ మంజ్రేకర్ నటించగా... కీలక పాత్రలో శోభితా దూళిపాళ్ల నటించింది. జూన్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో చిత్రబృందంతో పాటు మహేష్ బాబు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు మహేష్ బాబు. అలానే 'మేజర్' సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా మొదలై చాలా కాలమవుతుంది. కోవిడ్ సమయంలో 'మేజర్' ఓటీటీలో రిలీజ్ అవుతుందని వార్తలు వచ్చాయి. నిజానికి ఈ సినిమాకి క్రేజీ ఓటీటీ ఆఫర్ వచ్చిందని చెప్పారు మహేష్ బాబు. కానీ ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా అని.. అందుకే భారీ ఓటీటీ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు చెప్పారు.
హీరో శేష్ కూడా తన హిందీ డెబ్యూ ఫిల్మ్ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవ్వాలని కోరుకున్నట్లు చెప్పుకొచ్చారు. సోమవారం నాడు విడుదలైన సినిమా ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఎమోషనల్ గా సాగిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. మరి ఆశించిన స్థాయిలో సినిమా సక్సెస్ అవుతుందేమో చూడాలి!
Also Read: నాగార్జునకు ముద్దు పెట్టిన అషురెడ్డి - ఏం చెప్పిందో తెలుసా?
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)