News
News
X

మీరు మారిపోయారు పూరీ సార్, ‘లైగర్’ అంచనాలు తార్ మార్!

లైగర్ సినిమా అనుకున్నంత ఆకట్టుకోలేదని ఫస్ట్ షో నుంచే టాక్ నడుస్తోంది. అసలు సినిమాకు ఎక్కడ తేడా కొట్టింది..? పూరి అంచనాలు తప్పాయా..?

FOLLOW US: 

క్షిణాది చిత్రాలను ఉత్తరాది ప్రేక్షకులు ఈ మధ్య బాగా ఇష్టపడుతున్నారు. అంతేకాదు, వారికి మన సినిమాలపై గౌరవం కూడా పెరిగింది. ముఖ్యంగా మన కంటెంట్‌కు అక్కడి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇటీవల సౌత్ నుంచి వెళ్లిన చాలా సినిమాలు బాలీవుడ్ లో మంచి విజయాలను నమోదు చేశాయి. అక్కడి ఆడియన్స్ ను థియేటర్ల వైపు రప్పించాయి. ఆ సినిమాలేంటో మీక్కూడా తెలుసు. కానీ సౌత్ నుంచి వచ్చింది కదా అని ప్రతి సినిమానూ వాళ్లు నెత్తిన పెట్టుకుంటున్నారా? కొన్ని సినిమాలను చూస్తే లేదనే తెలుస్తోంది. 

కొన్ని నెలల ముందు రాధే శ్యామ్. ఇప్పుడు లేటెస్ట్ ఎగ్జాంపిల్ లైగర్. ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ కు ముందు. ఎంఎంఏ ఫైటర్ గా విజయ్ దేవరకొండ ట్రాన్సఫర్మేషన్, రిలీజ్ కు ముందు చేసిన ప్రమోషనల్ ఈవెంట్స్ లో వచ్చిన అమేజింగ్ అప్లాజ్... సినిమా మీద అంచనాలు పెంచేస్తూ పోయింది. రిలీజ్ కు ఒకట్రెండు రోజుల ముందు నుంచి బాయ్ కాట్ లైగర్ ట్రెండ్ అయింది. 

విజయ్ దేవరకొండ ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్ కొందరికీ ప్రాబ్లంగా అనిపించి ఈ ట్రెండ్ చేశారు. కరణ్ జోహార్ సినిమా కాబట్టి కొందరు బాయ్ కాట్ అన్నారు. అమీర్ ఖాన్ కు విజయ్ సపోర్ట్ చేశాడు కాబట్టి బాయ్ కాట్ అన్నారు. ఇలా అనేక రీజన్స్. ఎంత బాయ్ కాట్ ట్రెండ్ అయినా సరే సినిమాలో స్టఫ్ ఉంటే ఆడియన్స్ ను ఎవరూ ఆపలేరు. కానీ లైగర్ ను సరైన వేలో ప్రజెంట్ చేయలేకపోయారని ఫస్ట్ షో నుంచే నెగెటివ్ టాక్స్ వచ్చాయి. 

కొందరైతే సినిమా మీద అసంతృప్తిని వేరే స్థాయికి తీసుకెళ్లారు. సినిమా ఫస్ట్ అరగంట పూరి జగన్నాథ్ డైరెక్షన్ చేస్తే, ఆ తర్వాత నుంచి కరణ్ జోహార్ డైరెక్ట్ చేశాడని ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు ఫ్యాన్స్ అయితే కాస్త మర్యాదగానే తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. బాలీవుడ్ కు సౌత్ నుంచి వస్తున్న కంటెంట్ మాత్రమే నచ్చుతోందని అంతే తప్ప సౌత్ స్టార్స్ నుంచి ప్రతి సినిమాను నెత్తిన పెట్టుకోవట్లేదని అభిప్రాయాలు తెలియచేస్తున్నారు. లైగర్ లో పూరి మార్క్ లేదని, ఆయన రేంజ్ డైలాగ్స్ పడాలంటే హీరోకు నత్తి పెట్టకుండా ఉండాల్సిందని చాలా మంది చెబుతున్నారు. సో ఇప్పుడు బాలీవుడ్ లో వచ్చే రోటీన్ సినిమాలను తిరస్కరిస్తూ అక్కడి ఆడియన్స్ సౌత్ సినిమాలను ఆదరిస్తున్నారంటే అది కేవలం కంటెంట్ ఉన్న చిత్రాలను మాత్రమే అని మరోసారి అర్థమైంది. అయితే, స్క్రీన్ ప్లే మరీ పూర్‌గా ఉండటం, చాలా సీన్లు పూరీ మార్క్‌ను రీచ్ కాకపోవడం కూడా అభిమానులను నిరాశకు గురించేసినట్లు తెలుస్తోంది. దీంతో కొందరు పూరీ సార్ మీరు మారిపోయారు సార్ అని కామెంట్లు చేస్తున్నారు. 

Also Read : 'లైగర్' రివ్యూ : విజయ్ దేవరకొండ పంచ్ అదిరిందా? లేదా? పూరి ఏం చేశారు?

Also Read : 'లైగర్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా? ఏ ఏరియా రైట్స్ ఎన్ని కోట్లకు అమ్మారో చూడండి

Published at : 25 Aug 2022 05:15 PM (IST) Tags: Vijay Devarakonda Puri Jagannadh Liger Movie liger movie review Liger Failure Puri Jagannadh Mark

సంబంధిత కథనాలు

Hunt Movie Teaser : నన్ను ఎవరూ ఆపలేరు - సుధీర్ బాబు స్టైలిష్ యాక్షన్ అవతార్ 

Hunt Movie Teaser : నన్ను ఎవరూ ఆపలేరు - సుధీర్ బాబు స్టైలిష్ యాక్షన్ అవతార్ 

Mrunal Thakur: ఆ సమయంలో చనిపోవాలనుకున్న మృణాల్‌ - ‘సీతారామం’ సక్సెస్ వరకు ‘సీత’ పడిన కష్టాలెన్నో!

Mrunal Thakur: ఆ సమయంలో చనిపోవాలనుకున్న మృణాల్‌ - ‘సీతారామం’ సక్సెస్ వరకు ‘సీత’ పడిన కష్టాలెన్నో!

Janaki Kalaganaledu October 3rd: ఎగ్జామ్ లో అదరగొట్టిన జానకి- జ్ఞానంబ ఇంట్లో మొదలైన శరన్నవరాత్రుల పూజ, చెడగొట్టేందుకు సిద్ధమైన మల్లిక

Janaki Kalaganaledu October 3rd: ఎగ్జామ్ లో అదరగొట్టిన జానకి- జ్ఞానంబ ఇంట్లో మొదలైన శరన్నవరాత్రుల పూజ, చెడగొట్టేందుకు సిద్ధమైన మల్లిక

Gruhalakshmi October 3rd Update: తులసి పోస్ట్ ఊస్ట్- నందు చేతికి పగ్గాలు, సామ్రాట్ చేసిన పనికి దణ్ణం పెట్టేసి వెళ్ళిపోయిన తులసి

Gruhalakshmi October 3rd Update: తులసి పోస్ట్ ఊస్ట్- నందు చేతికి పగ్గాలు, సామ్రాట్ చేసిన పనికి దణ్ణం పెట్టేసి వెళ్ళిపోయిన తులసి

Guppedanta Manasu October 3rd : ఇద్దరూ ఇద్దరే అసలు తగ్గడం లేదు- రిషి కోసం దేవయాని ముందు తలవంచిన మహేంద్ర

Guppedanta Manasu  October 3rd : ఇద్దరూ ఇద్దరే అసలు తగ్గడం లేదు- రిషి కోసం దేవయాని ముందు తలవంచిన మహేంద్ర

టాప్ స్టోరీస్

AP BJP : ట్రాక్ మార్చిన ఏపీ బీజేపీ - ఇక ఊపందుకుంటుందా ?

AP BJP :  ట్రాక్ మార్చిన ఏపీ బీజేపీ - ఇక ఊపందుకుంటుందా ?

Karimnagar: తెలుగు సినిమాల్లా తెలుగు పార్టీ, పాన్ ఇండియాలో దుమ్ము లేపే రోజు దగ్గర్లోనే - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Karimnagar: తెలుగు సినిమాల్లా తెలుగు పార్టీ, పాన్ ఇండియాలో దుమ్ము లేపే రోజు దగ్గర్లోనే - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

MLA Kotamreddy: ఆ సెంటిమెంట్ ని గౌరవిస్తా, అందుకే అలా చేశా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

MLA Kotamreddy: ఆ సెంటిమెంట్ ని గౌరవిస్తా, అందుకే అలా చేశా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

Palnadu District News: పల్నాడులో కిడ్నాప్ అయిన బాలుడు క్షేమం, కారులోనే వదిలి నిందితులు పరార్

Palnadu District News: పల్నాడులో కిడ్నాప్ అయిన బాలుడు క్షేమం, కారులోనే వదిలి నిందితులు పరార్