Samantha: రణవీర్ సింగ్ తో సమంత - ఏం చేస్తుందంటే?
ఓ టీవీ యాడ్ కోసం రణవీర్-సమంత కలిసి నటిస్తున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది సమంత. ప్రస్తుతం ఆమె చేతుల్లో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. అందులో కొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో ఓ స్టేటస్ పెట్టుకుంది. అందులో ఆమెతో పాటు బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ కూడా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో తెగ వైరల్ అవుతోంది.
ఈ ఫొటోలో సమంత డిఫెన్స్ యూనిఫామ్ ధరించి కనిపిస్తోంది. ఆ డ్రెస్ పై తన పేరు 'పుష్ప ప్రభు' అని రాసి ఉంది. ఈ ఫొటో చూసిన వారు సమంత.. రణవీర్ తో కలిసి నటిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే వీరిద్దరూ కలిసింది సినిమా కోసం కాదట. ఓ టీవీ యాడ్ కోసం రణవీర్-సమంత కలిసి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ముంబైలో దీనికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే ఈ యాడ్ టీవీలో టెలికాస్ట్ కానుంది.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సమంత 'యశోద' సినిమాతో పాటు.. 'ఖుషి' సినిమాలో నటిస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాను శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. త్వరలోనే కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది. అలానే ఓ బైలింగ్యువల్, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ ఒప్పుకుంది సమంత.
Also Read: అంటే థియేటర్లలో నానికి ఎదురు లేదా? ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు
View this post on Instagram