అన్వేషించండి
Advertisement
Samantha at Tirupati: 'గుడికి వచ్చి.. బుద్ధుందా..?' ఘాటు బదులిచ్చిన సమంత.. వీడియో వైరల్..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మీడియాపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. వారు అడిగిన ప్రశ్నకు అసలు బుద్దుందా అంటూ మండిపడింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మీడియాపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. వారు అడిగిన ప్రశ్నకు అసలు బుద్దుందా అంటూ మండిపడింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సమంత ఎప్పటికప్పుడు తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకొని వస్తుంటుంది. ఈసారి కూడా సమంత తిరుమలకు వెళ్లారు. తన స్టాఫ్‌తో కలిసి దేవుడిని దర్శించుకొని బయటకు వచ్చింది. వెంటనే మీడియా ఆమెను చుట్టుముట్టింది.
ఈ క్రమంలో ఓ రిపోర్టర్..'మీ గురించి రూమర్స్ వస్తున్నాయి' అంటూ ప్రశ్నించడంతో సమంత సీరియస్ అయింది. 'గుడికి వచ్చి.. బుద్ధుందా..?' అంటూ ఘాటుగా స్పందించింది. దీనికి సంబంధించిన వీడియూలో సోషల్ మీడియాలో తెగ వైరల్అవుతోంది. ఈ విషయంలో పలువురు నెటిజన్లు సమంతకు మద్దతుగా నిలుస్తున్నారు. దేవుని దర్శనం కోసం వచ్చినప్పుడు కూడా ఇలా వ్యక్తిగత ప్రశ్నలు అడగడం ఏంటి అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
సాధారణంగా సమంత.. నాగచైతన్య సినిమాలు విడుదలయ్యే సమయంలో దైవ దర్శనం కోసం వెళ్తుంటుంది. త్వరలోనే 'లవ్ స్టోరీ' సినిమా రిలీజ్ ఉంది కాబట్టి ఆమెకి తిరుమలకు వచ్చిందని అంటున్నారు. ఇటీవలి కాలంలో సమంత వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఉన్నాయని.. భార్య నాగచైతన్యతో విభేదాలు వచ్చాయని.. ఆయనతో దూరంగా ఉంటుందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో సమంత మీడియాకు చాలా దూరంగా ఉంటుంది.
తన వివాహబంధం గురించి మీడియాలో వస్తోన్న వార్తలపై సమంత కానీ. చైతు కానీ స్పందించడం లేదు. ఇక ఆమె సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గానే గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' సినిమాను పూర్తి చేసిన ఆమె ఇప్పుడు బ్రేక్ లో ఉంది. త్వరలోనే ఓ కొత్త దర్శకుడితో సినిమా చేయబోతోందని సమాచారం. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఇదొక లేడీ ఓరియెంటెడ్ సినిమా అని టాక్. నవంబర్ నెల నుంచి ఈ సినిమా పట్టాలెక్కనుంది.
Sam really proud of you!! Some people don’t understand what to ask when .. Just loved that reply of yours !@Samanthaprabhu2
— Multi Fandom (@multifandom5928) September 18, 2021
.
.#SamanthaAkkineni #SamanthaRuthPrabhu #Samantha pic.twitter.com/5RUO5bbhbz
Also Read: వెంకటేష్-మీనా ‘దృశ్యం 2’ మూవీపై క్రేజీ అప్‌డేట్
Also Read: ‘మా కథకుడు రెడీ’ ‘పంచతంత్రం’ సినిమా నుంచి బ్రహ్మీ పోస్టర్ అదుర్స్
Also Read: ‘హనుమాన్ ఫ్రం అంజనాద్రి’ అంటూ మరో కాన్సెప్ట్ తో ఆసక్తి పెంచిన జాంబిరెడ్డి దర్శకడు ప్రశాంత్ వర్మ
Also Read: పవన్ కళ్యాణ్-రానా ‘భీమ్లానాయక్’ లో నిత్యామీనన్ తో పాటూ మరో మీనన్..రానాకు జోడీగా మలయాళ మారుతం..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion