Akshay Kumar: 'ది కశ్మీర్ ఫైల్స్' నా సినిమాను దెబ్బకొట్టింది - అక్షయ్ కుమార్ ఓపెన్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాపై తన అభిమానాన్ని చాటుకున్నాడు.
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. మార్చి 11న విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను సాధించింది. 90వ దశకంలో కశ్మీర్ పండిట్ లపై సాగిన సామూహిక హత్యాకాండ నేపథ్యంలో దర్శకుడు వివేక్ ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ లు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాపై ఎందరో ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ చేశారు.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఇటీవల భోపాల్ లో జరిగిన ఓ ఈవెంట్ లో ఈ సినిమా గురించి మాట్లాడారు అక్షయ్. వివేక్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేసిన 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుందని.. దీని ఎఫెక్ట్ తన సినిమాపై కూడా పడిందని అన్నారు. తను నటించిన 'బచ్చన్ పాండే' కలెక్షన్స్ ను కశ్మీర్ ఫైల్స్ దెబ్బకొట్టిందని చెప్పుకొచ్చారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ట్విట్టర్ లో వీడియోను షేర్ చేస్తూ.. తన సినిమాపై ప్రశంసలు కురిపించిన అక్షయ్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పటివరకు ఈ సినిమా హిందీ వెర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా సినిమాను డబ్ చేయబోతున్నారు.
Also Read: పాపం, ఈసారి సరయుకి డేంజర్ తప్పేలా లేదు!
Also Read: 'నన్ను గర్వపడేలా చేశాడు' చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
Thanks @akshaykumar for your appreciation for #TheKashmirFiles. 🙏🙏🙏 pic.twitter.com/9fMnisdDzR
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 25, 2022
View this post on Instagram