Cult - Cult Bomma: విశ్వక్ ‘కల్ట్’ vs ఎస్కేఎన్ ‘కల్ట్ బొమ్మ’- టైటిల్ వివాదం తప్పదా?
Cult-Cult Bomma : విశ్వక్ సేన్ కొత్త సినిమాను ప్రకటించారు. ‘కల్ట్’ పేరుతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలిపారు. అయితే, ఈ మూవీ టైటిల్ విషయంలో వివాదం రాజుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Cult-Cult Bomma Titles Clash: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తన కొత్త ప్రాజెక్టును ప్రకటించారు. ‘కల్ట్’ పేరుతో ఈ మూవీ రూపొందనున్నట్లు వెల్లడించారు. న్యూ ఏజ్ యూత్ ఫుల్ ఫిల్మ్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో, కొత్త నటీనటులను తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా టైటిల్ పోస్టర్ ను రివీల్ చేశారు. ‘కల్ట్’ అనే టైటిల్ కు ‘లైక్ ఎ లీప్ ఇయర్ 2024’ అనే ట్యాగ్ లైన్ తగిలించారు. ఈ పోస్టర్ పై భాగంలో సే నో టు డ్రగ్స్ అనే స్లోగన్ ఉంచారు. అంతేకాదు, పోస్టర్ మీద డ్రగ్స్ ట్యాబ్లెట్లు, పౌడర్ల మాదిరి కనిపిస్తున్నాయి. ఈ మూవీ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రానికి విశ్వక్ కథ అందించగా, తాజుద్దీన్ దర్శకత్వం వహించబోతున్నారు. విశ్వక్ సేన్ హోమ్ బ్లానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది.
In My writing ✍️ Coming up with
— VishwakSen (@VishwakSenActor) December 30, 2023
" #CULT " - A new age youthful film with all NEW TALENTED JANATHA 🔥
Directed by #Tajudin
Produced by @VanmayeCreation @VScinemas_
Join team @CultTheFilm_
By Sending your details to the mail ID
✉️ cultthefilmofficial@gmail.com pic.twitter.com/EHdbuJNf7Y
‘కల్ట్’, ‘కల్ట్ బొమ్మ’ టైటిల్ వివాదం
అటు ‘కల్ట్’ టైటిల్ మీద వివాదం మొదలయ్యింది. ఇప్పటికే ‘బేబీ’ నిర్మాత ‘కల్ట్ బొమ్మ’ అనే టైటిల్ రిజిస్టర్ చేయించారు. ఇప్పుడు విశ్వక్ సేన్ ‘కల్ట్’ అనే టైటిల్ పెట్టడం ఆసక్తికరంగా మారింది. ఈ మూవీ అనౌన్స్ మెంట్ సందర్భంగా ఈ టైటిల్ ఆల్రెడీ SKN రిజిస్టర్ చేసుకున్నారు కదా? అని విశ్వక్ ను మీడియా ప్రతినిధులు అడిగారు. అయితే, “’కల్ట్’ అనే టైటిల్ ఎవరూ రిజిస్టర్ చేయించుకోలేదు. అందుకే నేను రిజిస్టర్ చేసుకున్నాను. టైటిల్ పెట్టుకున్నాను” అని విశ్వక్ చెప్పారు.
టైటిల్ వివాదంపై స్పందించిన SKS
‘కల్ట్’ టైటిల్ గురించి విశ్వక్ చెప్పగానే SKS సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “రిజిస్టర్ చేయించుకోకుండా ‘కల్ట్ బొమ్మ’ టైటిల్‌ను ప్రకటించారా? అని కొంత మంది మీడియా ఫ్రెండ్స్ అడుగుతున్నారు. ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని అనుకుంటున్నాను. ‘బేబీ’ సినిమా టైంలో ‘కల్ట్ బొమ్మ’ అనే పేరే ఎక్కువగా వాడాను. అదే ఫేమస్ అయ్యింది. ఆ పేరును తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో నేను రిజిస్టర్ చేయించుకున్నాను. ఓ బాధ్యతగల సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిగా రిజిస్టర్ చేయించుకోకుండా ఏ నిర్మాత టైటిల్ ప్రకటించరు” అని తెలిపారు.
Some media friends called me and asked did I announced the #CultBomma title without registration ?
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) December 30, 2023
For such queries once and all I am clarifying The #CultBomma title is much popular from #Babythemovie promotions so I have registered it for one of my next films In TELUGU FILM…
అయితే, SKN ‘కల్ట్ బొమ్మ’ అని టైటిల్ రిజిస్టర్ చేసుకోగా, విశ్వక్ మాత్రం ‘కల్ట్’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేసుకున్నారు. దీనికి దానికి సంబంధం లేదు. ఈ టైటిల్ విషయంలో ఎవరిని ఎవరు విమర్శించాల్సిన అవసరం లేదని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అసలు టైటిల్ విషయంలో ఎలాంటి వివాదమే లేదంటున్నారు.
కొత్త వారితో తెరకెక్కనున్న ‘కల్ట్’
ఇక వాస్తవ ఘటన స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు విశ్వక్ తెలిపారు. ఈ మూవీలో ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలతో పాటు 25 మంది కొత్త ఆర్టిస్టులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నట్టు చెప్పారు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు ఆడిషన్ వీడియోలు పంపించవచ్చు అన్నారు. ఎలా సెండ్ చేయాలో చెప్తూ ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.