అన్వేషించండి
Advertisement
VirataParvam: 'ది బర్త్ ఆఫ్ వెన్నెల' - సినిమా రిలీజ్ కి ముందే ఇంటెన్స్ సీన్ షేర్ చేసిన టీమ్!
వెంకీ చేతుల మీదుగా 'ది బర్త్ ఆఫ్ వెన్నెల' అనే వీడియోను రిలీజ్ చేయించారు విరాటపర్వం దర్శకనిర్మాతలు
దగ్గుబాటి రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'విరాటపర్వం'. ఈ సినిమాను వేణు ఊడుగుల డైరెక్ట్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కించారు. గతేడాది వేసవిలో రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదా పడింది. ఫైనల్ గా జూన్ 17న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు.
దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి 'నగాదారిలో', 'చలో చలో' అనే సాంగ్స్ ను రిలీజ్ చేశారు. రీసెంట్ గా ట్రైలర్ ను విడుదల చేశారు. దీంతో సినిమాపై బజ్ ఓ రేంజ్ లో వచ్చింది. సాయిపల్లవి, రానాల పెర్ఫార్మన్స్ ను వెండితెరపై చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బుధవారం నాడు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. దీనికి రామ్ చరణ్, వెంకీ, సుకుమార్ గెస్ట్ లుగా వస్తారని అనౌన్స్ చేశారు కానీ.. వెంకీ మాత్రమే ఈవెంట్ కి హాజరయ్యారు.
వెంకీ చేతుల మీదుగా 'ది బర్త్ ఆఫ్ వెన్నెల' అనే వీడియోను రిలీజ్ చేయించారు దర్శకనిర్మాతలు. సినిమాలో సాయిపల్లవి రోల్ వెన్నెల జన్మించే సీన్ అది. నటి ఈశ్వరి పురిటి నొప్పులతో బాధపడుతుండగా.. ఆమెని అడివిలోనుంచి హాస్పిటల్ కి తీసుకెళ్తుంటారు. అదే సమయంలో నక్సల్స్ కి పోలీసులకు మధ్య కాల్పులు జరుగుతుంటాయి. దీంతో ఈశ్వరి ప్రయాణించే బండిని మధ్యలోనే ఆపేస్తారు. ఆమెని ఎలాగైనా కాపాడాలని నక్సల్స్ లో ఒకరైన నివేతా పేతురేజ్ రిస్క్ తీసుకుంటుంది. బిడ్డకు ప్రాణం పోసి వెన్నెల అని పేరు పెడుతుంది. అదే సమయంలో పోలీసులు ఆమెని కాల్చి చంపేస్తారు. ఈ వీడియో చాలా ఎమోషనల్ గా ఉంది. నందితా దాస్, ప్రియమణి, నవీన్ చంద్ర, జరీనా వాహబ్, సాయి చంద్ వంటి భారీ తారాగణం నటిస్తున్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.
Also Read: కశ్మీర్ లో పండిట్స్ ను చంపారు, ఇక్కడ ముస్లింను కొట్టారు - సాయిపల్లవి వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్!
Also Read: ప్రభాస్ హ్యాండ్సమ్ లుక్ - వైరలవుతోన్న ఫొటోలు
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నిజామాబాద్
తిరుపతి
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion