Vijayashanti: 'అవగాహన లేకుండా మాట్లాడొద్దు' సాయిపల్లవి వ్యాఖ్యలపై విజయశాంతి సీరియస్!
సీనియర్ నటి, బీజేపీ నేత విజయశాంతి.. సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు.
కశ్మీర్ లో పండిట్స్ మారణహోమం, గోరక్షణ పేరుతో చేస్తోన్న హింస ఒకటేనని ఇటీవల సాయిపల్లవి చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ఈ విషయంలో చాలా మంది సాయిపల్లవిపై మండిపడుతున్నారు. రీసెంట్ గా సీనియర్ నటి, బీజేపీ నేత విజయశాంతి కూడా ఈ విషయంపై మాట్లాడారు. ట్విట్టర్ వేదికగా ఆమె కొన్ని ట్వీట్స్ పెట్టారు.
ఆమె ఏమ్మన్నారంటే.. ''కశ్మీర్ పండిట్లపై దారుణ అకృత్యాలకు పాల్పడిన వారిని.. గోవధ కోసం ఆవుల అక్రమరవాణాకు పాల్పడేవారిని అడ్డుకున్న గోసంరక్షకులను ఒకే గాటన కడుతూ హీరోయిన్ సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర వివాదానికి దారి తీశాయి. మతోన్మాదంతో పండిట్లపై మారణకాండ సృష్టించడం.. ధర్మం కోసం దైవసమానమైన గోవులను కాపాడుకునేందుకు గోరక్షకులు చేసే పోరాటం ఒకటే ఎలా అవుతాయో కాస్త ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. డబ్బు కోసం దోపిడీ దొంగ ఎవరినైనా కొట్టడం... తప్పు చేసిన పిల్లవాడిని తల్లి దండించడం ఏవిధంగా ఒకటవుతాయి? ఆ దోపిడి దొంగను, తల్లిని ఒకేలా చూస్తారా?
ఎవరైనప్పటికీ తమకు అవగాహన లేని విషయాల ప్రస్తావన వచ్చినప్పుడు సున్నితంగా ఆ అంశాన్ని పక్కన పెట్టడం మంచిది. నేడు మనం మాట్లాడే ప్రతి మాటా క్షణాల్లో కోట్లాదిమందికి చేరిపోతూ.. ఆ మాటల్లో ఏ మాత్రం తేడా ఉన్నా పట్టుకుని ప్రశ్నించే సమాజంలో ఉన్నాం. అందువల్ల మాట్లాడే అంశాలపై సమగ్ర అవగాహనతో.. సామాజిక స్పృహతో స్పందించడం చాలా అవసరమని గ్రహించాలి.
ఏది ఏమైనా ఆ సినిమా ఆర్ధిక లాభాలతో ఆసక్తి ఉన్న నిర్మాణ సంబంధితులు, కశ్మీర్ ఫైల్స్ పోలిక తెచ్చి, ప్రజల దృష్టిని ఆకట్టుకోవడానికి చేసిన ప్రీరిలీజ్ కార్యక్రమంలో ఆ కథానాయికను సమస్యల్లోకి లాగినట్టుందేమో అని కొందరు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం కూడా అందుతోంది'' అంటూ విజయశాంతి తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
Also Read: 'సాయిపల్లవి మైండ్ పాడైంది, ఏది పడితే అది మాట్లాడితే సహించం' బీజేపీ ఎమ్మెల్యే ఫైర్
Are all film industries the same ?#SaiPallavi pic.twitter.com/TT4DbdRKRr
— Kreately.in (@KreatelyMedia) June 14, 2022
I liked #SaiPallavi.
— Norbert Elekes (@N0rbertElekes) June 14, 2022
Not any more.
I never complained about her pimple filled cheeks, ugly shaped ass, bad hair styles.
But going forward I will hate her. As she tells killing a cow smuggler and killing Kashmiri Pundits are same.
She might say killing Terrorist and KP is same.