తమన్నాతో డేటింగ్‌పై స్పందించిన విజయ్ వర్మ - కవరింగ్‌లు వద్దంటున్న నెటిజన్స్!
కొన్ని రోజులుగా తమన్నా గురించి వస్తున్న డేటింగ్ వార్తలపై నటుడు విజయ్ వర్మ స్పందించారు.
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ఇప్పటివరకు పెళ్లి విషయంలోనే ఎన్నో రూమర్లు వచ్చాయి. కానీ డేటింగ్ పరంగా మాత్రం ఆమె ఫలానా హీరోతో రిలేషన్‌షిప్‌లో ఉందంటూ ఇప్పటివరకు ఎలాంటి రూమర్లు రాలేదు. కానీ మొదటిసారి నటుడు విజయ్ వర్మతో తమన్నా డేటింగ్‌లో ఉందంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల గోవాలో జరిగిన ఎల్ గ్రాడ్యుయేట్స్ 2023 అవార్డుల కార్యక్రమానికి చాలా మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తమన్నా, విజయ్ వర్మ కూడా వెళ్లారు. మరి కలిసి వెళ్లారో లేదా అక్కడి వెళ్లాకే ఇద్దరూ కలుసుకుని ప్రేమలో పడ్డారో తెలీదు కానీ వారిద్దరూ లిప్ లాక్ చేసుకుంటుండగా తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు గుప్పమన్నాయి. ఇటీవల వారిద్దరూ కలిసి ఎయిర్‌పోర్ట్‌లో కూడా కనిపించడంతో.. క్లారిటీ కూడా వచ్చేసింది.
అయితే వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని వస్తున్న వార్తలపై తమన్నా మాత్రం ఇప్పటివరకు పెదవి విప్పింది లేదు. కానీ విజయ్ వర్మ మాత్రం ఒక స్టైల్‌లో ఈ రిప్లై ఇచ్చాడు. తన ట్విటర్ హ్యాండిల్‌లో ఓ ఫొటో పోస్ట్ చేసాడు. ఆ ఫొటోలో విజయ్‌తో పాటు బాలీవుడ్ దర్శకుడు సుజాయ్ ఘోష్ కూడా ఉన్నారు. ఆ ఫొటోకు ‘‘నా లంచ్ డేట్’’ అని ఫన్నీ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. అంటే.. ఒకవేళ తమన్నాతో ప్రేమలో ఉంటే తాను లంచ్ డేట్‌కి తననే తీసుకువెళ్లేవాడిని కదా.. అనే సందేహాన్ని ప్రజల్లో కలిగించాలని విజయ్ అభిప్రాయపడినట్లున్నాడు. ఒకవేళ తమన్నాతో ప్రేమలో ఉన్నది నిజం కానప్పుడు అలాంటివన్నీ తప్పుడు వార్తలని నేరుగానే ఖండించవచ్చు కదా.. అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. లేదా కొంతకాలం పాటు ఇలాంటి రూమర్స్ రావడం వల్ల తనకూ కాస్త పాపులారిటీ పెరిగి అవకాశాలు వస్తాయని నేరుగా ఏ విషయం అనేది విజయ్ చెప్పలేకపోతున్నాడేమో అని కూడా కొందరి వాదన.
My lunch date🤷🏻♂️@sujoy_g https://t.co/I9jT7gupzV pic.twitter.com/nKKW8S0vkH
— Vijay Varma (@MrVijayVarma) January 17, 2023
ఏదేమైనా తమన్నా ప్రేమలో పడిందన్న రూమర్లు స్టార్ట్ అవగానే ఫ్యాన్స్ మాత్రం తెగ సంబరపడిపోయారు. మొత్తానికి తమ ఫేవరేట్ హీరోయిన్ కూడా కాజల్ అగర్వాల్ లాగా ఓ ఇంటికి ఇల్లాలిగా మారిపోతే చూడాలి అని అనుకుంటున్నారట. అందుకే తమన్నా తన సోషల్ మీడియాలో ఏ ఫొటో పెట్టినా తమ్మూ పెళ్లెప్పుడు? విజయ్‌తోనే నా నీ వివాహం అంటూ బోలెడు కామెంట్లు పెడుతున్నారు. కానీ తమన్నా నుంచి మాత్రం ఎలాంటి రిప్లై రావడం లేదు. ఇప్పటికే తమన్నా ఎవరో డాక్టర్‌ని వివాహం చేసుకోబోతోందని, కాదు కాదు ఎవరో వ్యాపారవేత్తతోనే పెళ్లి నిశ్చయం అయిందని కొన్ని రోజుల పాటు ప్రచారం జరిగింది. కానీ ఎప్పటికప్పుడు పెళ్లి వార్తలను ఖండిస్తూ వచ్చిన తమ్మూ.. విజయ్ విషయంలో మాత్రం నోరు మెదపకపోవడం గమనార్హం. ఇక సినిమాల విషయానికొస్తే.. తెలుగులో ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమన్నా.. ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తోంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.