అన్వేషించండి

Varisu Cast Remuneration: ‘వారిసు’ కోసం విజయ్‌కు భారీ రెమ్యునరేషన్, రష్మికాకు ఎంతిచ్చారో తెలుసా?

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా సినిమా ‘వారిసు’. విడుదలైన అన్ని చోట్ల సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సినిమా కోసం విజయ్ ఏకంగా రూ. 110 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి.

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, కన్నడ సోయగం రష్మిక మందన్న కలిసి నటించిన సినిమా ‘వారిసు’. ‘బీస్ట్’, ‘మాస్టర్’,  ‘బిగిల్’ లాంటి కమర్షియల్ హిట్స్ తర్వాత యాక్షన్ డ్రామాగా ‘వారిసు’ తెరకెక్కింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శరత్‌ కుమార్, ప్రకాష్ రాజ్‌, శ్రీకాంత్ సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషించారు. రూ. 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కోసం ఆయా నటీ నటులు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఎవరెవరు ఎంత తీసుకున్నారంటే...

1. రష్మిక మందన్న

గత ఏడాది అమితాబ్ బచ్చన్ నటించిన ‘గుడ్‌బై‘ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నటి రష్మిక మందన్న, యాక్షన్ డ్రామా ‘వారిసు‘ కోసం విజయ్‌ తో జతకట్టింది. ఈ సినిమా కోసం తను రూ. 4 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలిసింది. 

2. శరత్‌కుమార్

100కి పైగా సౌత్ సినిమాల్లో నటించిన శరత్‌ కుమార్ ‘వారిసు’ సినిమాలో విజయ్ తండ్రి రాజేంద్రన్ పళని స్వామి పాత్రలో నటించారు. ఈ సినిమాలో తన క్యారెక్టర్ కోసం ఆయన రూ. 2 కోట్లు తీసుకున్నారని సమాచారం. 

3. ప్రభు

ఈ సినిమాలో ప్రభు డాక్టర్ పాత్రలో నటించారు. ఇందుకు గాను తను రూ.2 కోట్ల పారితోషికం అందుకున్నారట.   

4. ప్రకాష్ రాజ్

సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అన్ని చోట్లా రాణిస్తున్న ప్రకాష్ రాజ్, ఈ సినిమాలో రాజేంద్రన్ పళని స్వామి వ్యాపార ప్రత్యర్థి  జయ ప్రకాష్ అకా JP పాత్రను సోషించారు. ఈ సినిమా కోసం ప్రకాష్ రాజ్ రూ. 1.5 కోట్లు తీసుకున్నారట.

5. శ్యామ్

2001లో ‘12బి’తో  నటనా రంగ ప్రవేశం చేసిన ఈ నటుడు తెలుగులో ‘కిక్’, ‘రేసు గుర్రం’ సహా పలు హిట్ సినిమాట్లో నటించారు. ‘వారిసు’ సినిమాలో విజయ్ అన్నయ్య అజయ్ రాజేంద్రన్ గా చేశారు. ఇందుకు రూ.కోటి తీసుకున్నట్లు తెలిసింది. 

6. శ్రీకాంత్

టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగిన శ్రీకాంత్, పలు సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ‘వారిసు’ మూవీలో విజయ్ అన్నయ్య జై రాజేంద్రన్‌ గా కనిపించారు. ఇందులో తన పాత్ర కోసం శ్రీకాంత్ రూ. 60 లక్షలు అందుకున్నారట.

7. విజయ్

ఇక తమిళ సినిమా పరిశ్రమలో టాప్ హీరోగా కొనసాగుతున్నారు దళపతి విజయ్. ‘బీస్ట్’, ‘మాస్టర్’, ‘బిగిల్’ లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత తన రెమ్యునరేషన్ భారీగా పెంచాడు. తాజాగా ఆయన ‘వారిసు’ సినిమా కోసం ఏకంగా రూ. 110 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. 

Read Also: మల్టీఫ్లెక్స్‌లో రూ.99కే సినిమా చూడొచ్చు, ఆ ఒక్కరోజే అవకాశం మిస్ చేసుకోకండి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
KTR: '28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
'28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
Embed widget