Psych Siddhartha Teaser : డిఫరెంట్‌గా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'సైక్ సిద్దార్థ' టీజర్ - లోకల్ లాంగ్వేజ్, బూతులు బాగా వాడేశారు
Psych Siddhartha Movie : డిఫరెంట్ కాన్సెప్ట్... పక్కా లోకల్ లాంగ్వేజ్... లేటెస్ట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'సైక్ సిద్ధార్థ'. డిసెంబర్ 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Shree Nandu's Psych Siddhartha Movie Teaser Out : హైదరాబాద్‌లో ఉండే ఓ సాధారణ యువకుడు... వెరీ హైపర్ యాక్టివ్... ప్రతీ చిన్న విషయానికి ఇరిటేట్ అయిపోతుంటాడు. ఏదో ఓ మానసిక సమస్య ఉన్నట్లు చిన్న చిన్న విషయాలకే బూతులు తిడుతుంటాడు. అలాంటి యువకుడి లైప్, లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్‌గా తెరకెక్కింది లేటెస్ట్ మూవీ 'సైక్ సిద్దార్థ్'. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది.
బూతులు బాగా వాడేశారు
యంగ్ హీరో శ్రీనందు హీరోగా యామిని భాస్కర్ హీరోయిన్‌గా 'సైక్ సిద్ధార్థ్' మూవీలో నటించారు. వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించగా... స్టైల్ మ్యాడ్ నెస్‌తో పూర్తి స్థాయి యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా మూవీని రూపొందించారు. ప్రస్తుతం యూత్ ట్రెండ్‌కు అనుగుణంగా స్టోరీని రాశారు డైరెక్టర్ వరుణ్. 'సక్సెస్ డెఫినెషన్ ఏంటో తెలుసా నీకు?' అంటూ హీరో ఫ్రెండ్ ప్రశ్నించగా... 'LOSER' అంటూ ఫ్రస్టేషన్‌తో హీరో చెబుతాడు. ఈ కాన్వర్షేషన్‌తోనే టీజర్ ప్రారంభం కాగా... కారులో తన ఫ్రెండ్‌తో ప్రతీ చిన్న విషయానికే బూతులు తిడుతూ మాట్లాడుతుంటాడు.
రాంగ్ రూట్‌లో వచ్చినా... సైడ్ మిర్రర్ లేకపోయినా... బస్ హారన్ గట్టిగా వేసినా కూడా బూతులు తిడుతూ హల్చల్ చేస్తుంటాడు. ప్రతీ దానికీ నెగిటివిటీ స్ప్రెడ్ చేయడంతో పాటు చిన్న విషయాలకే ఇరిటేట్ కావడం ఓ మానసకి రోగిలా హీరో ప్రవర్తిస్తుంటాడు. టీజర్‌లో పక్కా లోకల్ లాంగ్వేజ్‌తో పాటు బూతులను బాగా వాడేశారు. ప్రస్తుతం ఇది హైప్ క్రియేట్ చేస్తోంది.
Also Read : ఓటీటీలోకి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ 'జారన్' - చేతబడి కథ... ఎట్టకేలకు తెలుగులోనూ స్ట్రీమింగ్
దగ్గుబాటి రానా సపోర్ట్
ఈ మూవీని హీరో దగ్గుబాటి రానా స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై శ్రీనందు, శ్యామ్ సుందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. శ్రీనందు సరసన యామినీ భాస్కర్ హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటు ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు. స్మరన్ సాయి మ్యూజిక్ అందిస్తున్నారు. డిసెంబర్ 12న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ద్వారా రిలీజ్ కానుండగా... మార్కెటింగ్ బాధ్యతలను రానా స్పిరిట్ మీడియా నిర్వహిస్తుంది.





















