Kakinada Crime News: కాకినాడ జిల్లా సోమవరంలో కారు బీభత్సం- ముగ్గురు మృతి- ఏడుగురు చిన్నారులకు గాయాలు
Kakinada News: కాకినాడ జిల్లా సోమవరంలోలో దారుణం జరిగింది. బస్సు కోసం ఎదురు చూస్తున్న జనాలపైకి కారు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు స్పాట్‌లోనే ప్రాణాలు వదిలేశారు. ఏడుగురు చిన్నారులు గాయపడ్డారు.

Kakinada Crime News: కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవరం వద్ద 216 నెంబర్ జాతీయ రహదారిపై శనివారం ఉదయం కారు బీభత్సాన్ని సృష్టించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అన్నవరం వైపు నుంచి రాజమహేంద్రవరం వైపునకు వెళ్తున్న పెళ్లి బృందం కారు టైరు ఫంక్చర్ అయ్యింది.
దీంతో అదుపుతప్పిన ఆ కారు హైవే బస్ స్టాప్ వద్ద బస్సు కోసం చూస్తున్న వారిపైకి దూసుకుపోయింది. అంతటితో ఆగకుండా హైవే పక్కన బైకును, మూడు చక్రాల రిక్షాను ఢీకొట్టింది. దీంతో సోమవరం గ్రామానికి చెందిన మోర్త ఆనందరావు (60) మోర్త కొండయ్య (30), ఏలేశ్వరం గ్రామానికి చెందిన బొప్పాయి కాయలు అమ్ముకునే కాకాడ రాజు (60) మృతి చెందారు. అలాగే బస్సు కోసం వేచి చూస్తున్న కొండ్రపు చైతన్య, చీపురుపల్లి స్రవంతి, బత్తిన భద్రరావు తీవ్రగాయాలు కాగా, మరో నలుగురుకి గాయాలయ్యాయి.ఘటన స్థలానికి ఎంఎల్ఎ జ్యోతుల నెహ్రు చేరుకుని క్షతగాత్రులను ప్రత్తిపాడు ఆసుపత్రికి పంపించారు. మెరుగైన వైద్యం అందించాలని ఎంఎల్ఎ అధికారులను ఆదేశించారు.





















